7వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

1979 చలన చిత్రోత్సవం

7వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1979 జనవరి 3 నుండి జనవరి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2] శ్యామ్ బెనగళ్ రూపొందించిన "జునూన్" సినిమా ప్రదర్శనతో ఈ ఉత్సవం ప్రారంభమైంది. 1978–79 మధ్యకాలంలో ప్రపంచం మొత్తంమీద జరిగిన ఏకైక సినిమా పోటీ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇది. ఈ చిత్రోత్సవాల చరిత్రలో తొలిసారిగా, సెనెగల్ కుస్మాన్ సెంబెనే అనే విదేశీయుడు జ్యూరీకి నాయకత్వం వహించగా, తొలిసారి జ్యూరీలో ఇద్దరు మహిళలు (చంటల్ అకర్మాన్ - బెల్జియం, మార్తా మాస్జావ్స్ - హంగరీ) కూడా ఉన్నారు.[3]

7వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on16 January 1979
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"హంగేరియన్ రాప్సోడి"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: మిక్లేస్ జాన్సే దర్శకత్వం వహించిన "హంగేరియన్ రాప్సోడి" (హంగేరియన్ సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "యాన్ ఎన్కౌంటర్ విత్ ఫేసెస్" (ఇండియా), "ఒలింపిక్ గేమ్స్" (పోలాండ్)
  • ఉత్తమ నటుడు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఒండనోండు కలదల్లి" సినిమాలో నటించిన శంకర్ నాగ్[7]

మూలాలు

మార్చు
  1. "Few Facts About International Film Festivals of India". Ministry of Information & Broadcasting17. Retrieved 4 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 12 January 2018. Retrieved 4 July 2021.
  3. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.
  7. Ray, Bibekananda (5 April 2017). Conscience of The Race. Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123026619 – via Google Books.