63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2015లో విడుదలైన ఉత్తమ భారతీయ చిత్రాలను గౌరవించేందుకు భారత డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వార్షిక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రదానం చేసే రానున్నవేడుక. 2016 మార్చి 28న పురస్కారాలు ప్రకటించగా, 2016 మే 3న వేడుకలు జరుగుతాయి.[1]

ఎంపిక ప్రక్రియ

మార్చు

2016 జనవరిలో డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానించారు. 2016 జనవరి 13 వరకూ ఎంట్రీలను అంగీకరించారు. 2015 జనవరి 1 నుంచి 2015 జనవరి 31 వరకూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారి నుంచి సెన్సార్ సర్టిఫికేట్ లభించిన ఫీచర్, నాన్-ఫీచర్ సినిమాలు సినిమా పురస్కారాల కేటగిరీలో నామినేషన్ పంపేందుకు అర్హత కలిగివున్నాయి. సినిమాల గురించిన  పుస్తకాలు, విమర్శ రచనలు, సమీక్షలు లేదా వ్యాసాలు (భారతీయ పత్రికల్లో, మేగజైన్లలో, జర్నల్స్ లో) 2015 జనవరి 1 నుంచి 2015 జనవరి 31 మధ్యలో ప్రచురితమైనవి, సినిమా గురించిన ఉత్తమ రచనలు విభాగంలో పోటీపడేందుకు అర్హత కలిగివుంటాయి. సినిమాల్లో డబ్బింగ్, సవరణ, నకలు వెర్షన్లు లేదా పుస్తకాల్లో అనువాదాలు, సంక్షిప్తీకరణలు, ఎడిటెడ్ లేదా వ్యాఖ్యాన రచనలు అవార్డులకు అనర్హం.[1]

ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ విభాగాల్లో, 16 ఎంఎం, 35ఎంఎం, వైడర్ ఫిల్మ్ గేజ్ లేదా డిజిటల్ ఫార్మాట్లలో చిత్రీకరించి సినిమాగా విడుదలైనా లేక వీడియో లేదా ఇంటిలో చూసేందుకు వీడియో ఫార్మాట్లో అయినా విడుదలైన ఏ భారతీయ భాషా చిత్రమైనా అర్హత కలిగినవే. సినిమాలు ఫీచర్, ఫీచరెట్ లేదా డాక్యుమెంటరీ/న్యూస్ రీల్/నాన్-ఫిక్షన్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి సర్టిఫికెట్ పొందితే చాలు.[1]

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

మార్చు

1969లో ప్రారంభించిన, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం భారతీయ సినిమా అభివృద్ధికి, ఈ మాధ్యమానికి, దాని అభివృద్ధికి, ప్రాచుర్యానికి సినిమా ప్రముఖులు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఇచ్చే అత్యుత్తమ పురస్కారం.[2]

అవార్డు పేరు పురస్కార 

గ్రహీత (లు)

పురస్కారం

పొందినది

పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మనోజ్ కుమార్ నటుడు, చిత్ర నిర్మాత, 

దర్శకుడు

స్వర్ణ కమలం, 1 million (UతS$15,000) and a Shawl

ఫీచర్ ఫిల్మ్స్

మార్చు

జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ కూడా ఫీచర్ ఫిల్మ్స్ అవార్డు పొందుతాయి. ప్రతి కాటగిరీలోనూ ఈ కింది అవార్డులు ఇస్తారు:

ఆలిండియా పురస్కారం

మార్చు

ఈ కింది అవార్డులు ప్రదానం చేస్తారు:

స్వర్ణ కమలం పురస్కారం

మార్చు

అధికారిక నామం: స్వర్ణ కమల్

అందరు అవార్డు గ్రహీతలు స్వర్ణ కమలం, ధ్రువపత్రం, క్యాష్ ప్రైజ్ పొందుతారు.

అవార్డు పేరు సినిమాపేరు భాష పురస్కార గ్రహీతలు Cash Prize
ఉత్తమ చలన చిత్రం బాహుబలి:ద బిగినింగ్  •తెలుగు

 •తమిళం

నిర్మాత: శోభు యార్లగడ్డ, అర్క మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్.

దర్శకుడు: ఎస్. ఎస్. రాజమౌళి

2,50,000/- Each
దర్శకుడి ఉత్తమ 

తొలి చిత్రం

మసాన్ హిందీ దర్శకుడు: నీరజ్ ఘయ్వాన్ 1,25,000/- Each
ప్రజాదరణ పొందిన

వినోదభరిత ఉత్తమ చిత్రం

భజరంగీ భాయ్ జాన్ హిందీ నిర్మాత:సల్మాన్ ఖాన్, రాక్లైన్ వెంకటేష్

దర్శకుడు:కబీర్ ఖాన్

2,00,000/- Each
ఉత్తమ బాలల చిత్రం దురొంతో హిందీ నిర్మాత:

దర్శకుడు: సౌమ్నెద్రా పదీ

 1,50,000/- Each
ఉత్తమ యానిమేషన్ సినిమా  •ఫిషర్ ఉమన్

 •టక్ టక్

 1,00,000/- Each
ఉత్తమ దర్శకుడు బాజీరావ్ మస్తానీ
హిందీ సంజయ లీలా భన్సాలీ 2,50,000/-
  1. 1.0 1.1 1.2 "Call for entries; 63rd National Film Awards for 2015" (PDF). Directorate of Film Festivals. Retrieved 17 March 2016.
  2. "17th National Film Awards" (PDF). Directorate of Film Festivals. p. 38. Retrieved 12 April 2013.