ఇది నెల్లూరు జిల్లా  బుచ్చిరెడ్డి పాలెం సమీపం లో ఉన్న    ప్రకృతి వ్యవసాయ క్షేత్రం.  2013  లో  బీగాల మాలకొండయ్యగారు ఈ  వ్యవసాయ క్షేత్రం లో సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తి తో  వారి ఇంటి అవసరాల నిమిత్తం పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండ ఆరోగ్య కరమైన ఆహారాన్ని పండించండం నలబై సెంట్స్ లో    వరి మరియు అపరాల సాగు తో  ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు.[1]

BMK's సహజ సిద్ధ
BMK Sahaja sidda
స్థానం బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు జిల్లా
వ్యవస్థాపకుడు బీగాల మాలకొండయ్య
స్థాపన 2013
లొకేషన్ 14.539853, 79.858993

గురించి

మార్చు

సహజ సిద్ద వ్యవసాయక్షేత్రం నందు 5 లేయర్ పద్ధతి లో ఒకటిన్నర ఎకరం సాగులో ఉంది . ఇందులో పసుపు, అరటి , జామ , మునగ, మామిడి, పనస, కొబ్బరి  మరియు ఇతర పండ్ల మొక్కలు సాగు లో కలవు . వ్యవసాయక్షేత్రం నందు వివిధ రకముల కాషాయాలు తాయారు చేసి కూరగాయల సాగు కు వినియోగిస్తారు .

ప్రధాన లక్ష్యాలు

మార్చు
  • సహజ సిద్ద ఆహారాన్ని పండించండం లో వివిధ ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటించడం మరియు ప్రచారం చేయడం.
  • ప్రతి కుటుంబం సహజ సిద్ద ఆహారం సేకరించుకొనేటట్లు లేదా పండించుకొనేటట్లు కావలిసిన తోర్పాటు అందిచడం.
  • పర్యావరణ పరిరక్షణ కొరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం .
 
SahajaSiddhaSeedsDistribution

మొక్కల నర్సరీ

మార్చు

సహజ సిద్ద వ్యవసాయక్షేత్రం నందు రహదారుల కు ఇరువైపులా నాటుటకు అవసరమైన మొక్కల నర్సరీ కలదు. ఈ నర్సరీ నందు అత్తి(మేడి ) , సీతాఫలం , గంగిరావి , మొదలైన మొక్కలు మరియు వివిధ రకాల అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంటాయి .

  1. "బీగాల మాలకొండయ్య", వికీపీడియా, 2024-08-09, retrieved 2024-08-09