బేరియం సల్ఫైడ్

(BaS నుండి దారిమార్పు చెందింది)

బేరియం సల్ఫైడ్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.బేరియం, సల్ఫర్ అను రెండు మూలకాల సమ్మేళనం వలన బేరియం సల్ఫైడ్ ఏర్పడినది.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaS.బేరియం కార్బోనైట్ (BaCO3, వర్ణకం లిథోపోన్, జింకు సల్ఫైడ్ (ZnS) బేరియం సల్ఫేట్ (BaSO4) వంటి పలు బేరియం సంయోగ పదార్థాల ఉత్పత్తికి బేరియం సల్ఫైడ్ పుర్వగామి (precursor) గా పనిచేయును[2]. ఇతర క్షార మృత్తిక లోహాల చాకోజేనైడ్‌లవలె బేరియం సల్ఫైడ్ను, ఎలక్ట్రాన్ డిస్ప్లేలలో తక్కువ పొడవుగల కాంతి తరంగధ్యైర్ఘ్య ఏమిటర్ (wavelength emitters) గా ఉపయోగిస్తారు.

బేరియం సల్ఫైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [21109-95-5]
పబ్ కెమ్ 6857597
యూరోపియన్ కమిషన్ సంఖ్య 244-214-4
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32590
SMILES [Ba+2].[S-2]
ధర్మములు
BaS
మోలార్ ద్రవ్యరాశి 169.39 g/mol
సాంద్రత 4.25 g/cm3 [1]
ద్రవీభవన స్థానం 1,200 °C (2,190 °F; 1,470 K)
బాష్పీభవన స్థానం decomposes
2.88 g/100 mL (0 °C)
7.68 g/100 mL (20 °C)
60.3 g/100 mL (100 °C)
ద్రావణీయత insoluble in alcohol
వక్రీభవన గుణకం (nD) 2.155
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Halite (cubic), cF8
Fm3m, No. 225
కోఆర్డినేషన్ జ్యామితి
Octahedral (Ba2+); octahedral (S2−)
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22, మూస:R31, R50
S-పదబంధాలు (S2), S28, S61
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Magnesium sulfide
Calcium sulfide
Strontium sulfide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

బేరియం సల్ఫైడ్ రంగులేని ఘన స్థితిలో ఉండు ఒక సంయోగపదార్థం.బేరియం సల్ఫైడ్‌యొక్క అణుభారం 169.39 గ్రాములు/మోల్. ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 4.25 గ్రాములు/సెం.మీ3. బేరియం సల్ఫైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1,200 °C (2,190 °F; 1,470K).ఈ రసాయన పదార్థం బాష్పికరణ కన్న ముందే వియోగం చెందును.నీటిలో కరుగుతుంది.నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది, నీటిలో ద్రావణీయత పెరుగుతుంది.ఆల్కహాల్‌లో కరుగదు.

ఆవిష్కరణ-ఉత్పత్తి

మార్చు

విన్సేన్టినస్ కాసియోరోలస్ (Vincentinus Casciorolus1571-1624 ) అనునతడు, బారైట్ (barite) అను ఖనిజంగా లభించు బేరియం సల్ఫేట్ (Baso4) ను క్షయికరించడం ద్వారా బేరియం సల్ఫైడ్ ను మొదటి సారి ఉత్పత్తి చేసాడు.[3]. వర్తమాన కాలంలో కాసియోరోలస్ ప్రక్రియలో మార్పు చేసి గతంలో ఉపయోగిస్తున్నపిండి (flour) కి ప్రత్నామ్యాయంగా కోక్ (coke) ను ఉపయోగిస్తున్నారు.ఈ విధానాన్ని కార్బోథేర్మిక్ చర్య అంటారు

BaSO4 + 2C → BaS + 2CO2

బేరియం సల్ఫేట్ కు ఉన్న ఫాస్పారెసేన్స్ ఈ సమ్మేళనంలో ఉండు స్వాభావిక రాగి మాలిన్యం వలన అని తెలుస్తున్నది.

భద్రత

మార్చు

బేరియం సల్ఫైడ్ విషపూరితమైనది.నీటితో సంపర్కం వలన హడ్రోజన్ సల్ఫైడ్ అను విషయుతమైన వాయువును విడుదల చేయును.

ఇవికూడా చూడండి

మార్చు

బేరియం

మూలాలు

మార్చు
  1. Lide, David R., ed. (2006). CRC Handbook of Chemistry and Physics (87th ed.). Boca Raton, FL: CRC Press. ISBN 0-8493-0487-3.
  2. Holleman, A. F.; Wiberg, E. "Inorganic Chemistry" Academic Press: San Diego, 2001. ISBN 0-12-352651-5.
  3. F. Licetus, Litheosphorus, sive de lapide Bononiensi lucem in se conceptam ab ambiente claro mox in tenebris mire conservante, Utini, ex typ. N. Schiratti, 1640. See http://www.chem.leeds.ac.uk/delights/texts/Demonstration_21.htm Archived 2011-08-13 at the Wayback Machine