యూరో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
యూరో 13 ఐరోపా దేశాల అధికారిక మారక ద్రవ్యం (కరెన్సీ). ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, హాలండు, పోర్చుగల్, స్లొవేనియా, స్పెయిన్లు యూరోను ప్రవేశపెట్టాయి. అయితే ఐరోపా సమాఖ్యలో సభ్యులైన ఇంగ్లాండ్, డెన్మార్క్ దేశాలు యూరోను తమ దేశాల్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి దీన్ని ఐరోపా సమాఖ్య ద్రవ్యంగా భావించరాదు. సమాఖ్యలో ఇటీవల చేరిన దేశాలు యూరోను ద్రవ్యంగా అంగీకరించాలనే నియమం ఉన్నప్పటికీ పాత సభ్యులైన ఇంగ్లండు, డెన్మార్కు లకు ఆ నియమం వర్తించదు. సమాఖ్యలో సభ్యులు కానప్పటికీ వాటికన్ సిటీ, మొనాకో, సాన్ మారినో, యాండొర్రా వంటి చిన్న దేశాలు కూడా యూరోను ప్రవేశపెట్టాయి. యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగిన దేశాలను సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.
-
యూరో చిహ్నం
-
2023లో యూరోజోన్
-
యూరో నాణేలు, నోట్లు
ముందుగా 1999 జనవరి 3 న ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు. 2002 జనవరి 1 న నాణేలు, నోట్లను విడుదల చేసి సాధారణ చెలామణీ లోకి తెచ్చారు. దానితో ఆస్ట్రియా షిల్లింగు, బెల్జియం ఫ్రాంకు, ఫిన్లండు మర్కా, ఫ్రెంచి ఫ్రాంకు, జర్మను మార్కు, ఇటలీ లీరా, ఐర్లండు పంటు, లక్సెంబర్గు ఫ్రాంకు, హాలండు గిల్డరు, పోర్చుగీసు ఎస్కుడో, స్పానిషు పెసేటాలను చెలామణీ లోంచి తొలగించారు.
వెలుపటి వలయము
మార్చు- Heiko Otto (ed.). "యూరో (బ్యాంకు నోట్లు, చరిత్ర)" (in ఇంగ్లీష్ and జర్మన్). Archived from the original on 2017-07-15. Retrieved 2017-12-31.