గన్నేరు చెట్టు

(Karaveera patram నుండి దారిమార్పు చెందింది)

గన్నేరు పొదను సాధారణంగా దూలగుండా[1] అంటారు. ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలిన యూనివెర్సిటి ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నేరు చెట్టుకు దూలగుండ[1] అనే పేరు వచ్చింది.దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు.

నీరియం ఒలియండర్
Scientific classification
(unranked):
యూడైకాట్స్
Order:
జెంషియానేల్స్
Family:
అపోసైనేసీ
Subfamily:
అపోసైనోయిడే
Genus:
నీరియం
Species:
ఒలియండర్

వివరణ

మార్చు
 

గన్నేరు పొద పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా 2-6 మీ' పొడవు పెరుగుతుంది[1]. దీని ఆకులు జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి ఎరుపు,తెలుపు, గులాబీ వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.పండ్లు పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.

పెరిగే ప్రదేశాలు , పరిధి

మార్చు

గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , మొరాకో , పోర్చుగల్ తూర్పువైపు,చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో విస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల , ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు. శ్రీలంకలో దీనిని కానేరు[1] అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా పెంచుతారు.

చికిత్సా సామర్ధ్యం

మార్చు

దీని నుండి తయారుచేసిన మందులను క్యాన్సర్ చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు.

విషప్రభావం

మార్చు
 
toxicity on animals

దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది[1].[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 న్యూస్, మై డిజిటల్ (2021-07-31). "గన్నేరు చెట్టు". మై డిజిటల్ న్యూస్. Retrieved 2021-07-31.
  2. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు