కొప్పళ జిల్లా

కర్ణాటక లోని జిల్లా
(Koppal district నుండి దారిమార్పు చెందింది)

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో కొప్పళ జిల్లా ఒకటి. కొప్పళ (కోపనగర) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రపంచ సంప్రదాయకేంద్రంగా గుర్తించబడిన హంపీ నగరం కొప్పళ పట్టణానికి 38కి.మీ దూరంలో ఉంది. జిల్లాలోని ఆనెగొంది కూడా ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తించబడుతుంది.

Koppal district
ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲೆ
district
Country India
రాష్ట్రంకర్ణాటక
ప్రధాన కార్యాలయంKoppal
BoroughsKoppal, Gangavati, Yalburga, Kushtagi
విస్తీర్ణం
 • Total7,190 కి.మీ2 (2,780 చ. మై)
జనాభా
 (2001)
 • Total11,96,089
 • జనసాంద్రత166/కి.మీ2 (430/చ. మై.)
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్+ 91 (0)8539
Vehicle registrationKA-37

చరిత్ర

మార్చు

కొప్పల్ జిల్లా కేంద్రం పురాతన కోపనగరం జైనులకు పవిత్రనగరంగా గుర్తించబడుతుంది. పాల్కిగుండు, గవిమథ్, కొప్పల్ పురాణాలలో వర్ణించిన ఇంద్రకీలాద్రి అని భావిస్తున్నారు. ఇక్కడ పురాతనమైన " మాలె మల్లీశ్వర " ఆలయం ఉంది. పాలకిగుండు, గవినాథ్ వద్ద రెండు శిలాశాసనాలు ఉన్నాయి. పశ్చిమ చాళుఖ్య సామ్రాజ్యానికి సామంతరాజ్యమైన షిలహరా రాజ్యానికి రాజధానిగా ఉంది. శివాజి పాలనాకాలంలో 8 రెవెన్యూ విభాగాలలో కొప్పళ నగరం ఒకటి. [1] 1858లో భారతదేశ మొదటి స్వాతంత్ర్యసమరంలో ముందర్గి భీమారావు, హమ్మిజ్ కెంచనగౌడా ఇక్కడ ప్రాణత్యాగం చేసారు. లక్కకళాఖాండాలకు ప్రసిద్ధిగాంచిన కింహల్ కొల్లల్ పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉంది.

కొప్పల్ జిల్లాలో పట్టణాలు

మార్చు
  • గంగావతి
  • కనకగిరి
  • కరతగి
  • కొప్పళ్
  • కుక్నూర్
  • కుష్తగి (కుష్ఠగి)
  • మునీరాబాద్
  • యెలబుర్గ
  • భగ్యనగర్
  • తవరగెర
  • హనుమసాగర్
  • కిన్నాల్
  • మంగలురు
  • చల్లుర్

భౌగోళికం

మార్చు

ఈ జిల్లా 7,190 కిమీ² విస్తీర్ణంలో ఉంది, 1,196,089 జనాభాను కలిగి ఉంది, ఇది 2001 నాటికి 16.58% పట్టణవాసులు. రాయచూర్ జిల్లా విడిపోయిన తరువాత కొప్పల్ జిల్లా ఏర్పడింది.

తాలూకాలు

మార్చు

కొప్పళ్ జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నవి -

  1. కొప్పళ్
  2. గంగావతి.
  3. యలబుర్గా
  4. కుష్టగి

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

2011 జనాభా లెక్కల ప్రకారం కొప్పల్ జిల్లా జనాభా 1,391,292, ఇది స్వాజిలాండ్ దేశానికి లేదా యుఎస్ రాష్ట్రమైన హవాయికి సమానం. ఇది భారతదేశంలో 350 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 250 మంది (650 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.32%. కొప్పల్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 983 మంది స్త్రీలు, అక్షరాస్యత 67.28%.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 
కొప్పల్ జిల్లాలోని ఇటాగి వద్ద మహాదేవ ఆలయం, సా.శ. 1112, నగరా సూపర్ స్ట్రక్చర్‌తో కర్ణాట-ద్రవిడ ఉచ్చారణకు ఉదాహరణ

పశ్చిమ చాళుఖ్య కాలానికి చెందిన నిర్మాణాలలో.[2] ఇతగి వద్ద ఉన్న " మహదేవ ఆలయం " ఒకటి.

ది మహదేవ ఆలయం

మార్చు
 
1112 CE, కొప్పల్ జిల్లా ఇటగిలోని మహాదేవ ఆలయంలో ఓపెన్ మంటప (హాల్)
 
మహాదేవ ఆలయంలో మూర్తి శిల్పం

ఇతగి వద్ద మహాదేవ ఆలయంలోని ప్రధానదైవం శివుడు. చాళుఖ్యులు నిర్మించిన బృహత్తరమైన ఆలయాలలో ఇది ఒకటి. ఇది అతిప్రాముఖ్యమైన ఆలయంగా గుర్తించబడుతూ ఉంది. శిలాక్షరాలు ఈ ఆలయాన్ని ఆయయాల చక్రవర్తిగా అభివర్ణిస్తున్నాయి.[3] ప్రధాన ఆలయంలో లింగరూపంలో ఉన్న శివుడు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలలో కూడా లింగప్రతిష్ఠ్జ చేయబడి ఉంది. ఈ ఆలయం 1112 లో చాళుఖ్యుల సేనాపతి చేత నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలో చాళుఖ్యుల సేనాపతి తల్లితండ్రులైన మూర్తినారాయణ, చంద్రకేశ్వరిలకు ఉపాలయాలు ఉన్నాయి. .[4] హవేరి, సావనూర్, బైయాద్గి, మోటెబెన్నూర్, హంగల్ భూభాగంలో సోప్‌స్టోన్ విస్తారంగా లభిస్తుంది. ఆలయనిర్మాణానికి బాదామి చాళుక్యులు ఉపయోగించే గొప్ప ప్రాచీనమైనది ఇసుకరాయి బిల్డింగ్ బ్లాక్స్, చిన్న సోప్‌ స్టోన్ బ్లాక్లను ఉపయోగించారు.[5] ఈ మూలపదార్ధాలను ఉపయోగించి నిర్మించిన మొదటి ఆలయం దార్వాడ జిల్లాలో అన్నిగేరి వద్ద ఉన్న అమర్తేశ్వరాలయం. ఈ ఆలయం సా.శ. 1050లో నిర్మించబడింది. ఇతగి వద్ద మహాదేవ ఆలయం వంటి పలు ఆలయాలకు ఈ ఆలయం నమూనాగా ఉంది.[6] 11వ శతాబ్దం నుండి ఆలయాల నిర్మాణం అధికం అయింది. 12 వ శతాబ్దంలో కూడా ఆలయనిర్మాణ సంప్రదాయం అధికం అయింది. ఇందుకు ఇతగి వద్ద మహాదేవ ఆలయం, హవేరి వద్ద ఉన్న శిద్ధేశ్వర ఆలయం ఉదాహరణగా నిలిచాయి. అన్నెగేరి వద్ద ఉన్న అమర్తేశ్వర ఆలయంలా ఉన్నప్పటికీ మహాదేవఆలయ అలంకరణలలో కొన్ని మార్పులు ఉన్నాయి. సాలా పైకప్పు అద్భుతమైన నిర్మాణ వైభవం కలిగి ఉంది. ఆలయ ఆవరణలో పిలాస్టర్ సూక్ష్మరూప నిర్మాణం (మినియేచర్) ఉంది.[7]

 
కర్ణాటకలోని కుక్నూర్ లోని నవలింగ ఆలయంలో 9 వ శతాబ్దపు కన్నడ శాసనం

రెండు ఆలయాల నిర్మాణ కాలవ్యవధి 50 సంవత్సరాలు. మహాదేవ ఆలయంలో దృఢమైన నమూనాలు, అలంకరణలు కనిపిస్తుంటాయి. 11వశతాబ్ధానికి విలాసవంతమైన శిల్పాల స్థానంలో కొన్ని కొత్త శిల్పాలు చోటుచేసుకున్నాయి.[8]

కుకునూర్

మార్చు

కామతకలో అతి ప్రఖ్యాతి గాంచిన కాశివిశ్వనాథ ఆలయం [9], పట్టడకల్ వద్ద ఉన్న జైన్ నారాయణ ఆలయం రెండూ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.[10] ఇతర ఆలయాలలో కొన్నూరు వద్ద ఉన్న పరమేశ్వర ఆలయం, సవాడి వద్ద ఉన్న బ్రహ్మదేవుని ఆలయం, అయిహోల్ వద్ద ఉన్న సెత్తవ్వ, కొంటిగుడి, జదరగుడి, అంబిగెరగుడి మొదలైనవి ప్రధానమైనవి. రాన్ వద్ద ఉన్న మల్లికార్జునాలయం, హులి వద్ద ఉన్న అంధకేశ్వరాలయం, సోగల్ వద్ద ఉన్న సోమేశ్వరాలయం, లోకపురా వద్ద ఉన్న లోకేశ్వరాలయం, కుక్నూర్ వద్ద ఉన్న నవలింగ ఆలయం, సందూర్ వద్ద ఉన్న కుమారస్వామి ఆలయం, గుల్బర్గలో ఉన్న షిరివాల్ ఆలయాలు కల్యాణి చాళుఖులచేత అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ఆలయాల గురించిన పురాతత్వపరిశోధనలు ఈ ఆలయాలు పలుభాషలకు చెందిన వారిచే అభివృద్ధిచేయబడ్డాయని తెలియజేస్తున్నాయి. వీటిలో ( హొయశిల చెందిన బేలూరుకు, హళిబీడు ఆలయాలు ఉన్నాయి.[11] దక్కన్ పీఠభూమిలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు అత్యున్నత భారతీయ సాంస్కృతిక సంపన్నతకు చిహ్నాలుగా ఉన్నాయి. [12]

బాలక్రిష్ణహరి చపేకర్

మార్చు
 
కొప్పల్ జిల్లా ఇటాగి వద్ద మహాదేవ ఆలయంలో గృహ పైకప్పు

1897లో బాలకృష్ణ హరి చపేకర్ (చపేకర్ సోదరులలో ఒకరు)కు ర్యాండ్ కాల్చివేతలో సంబంధం ఉన్నకారణంగా పూనాలో ఖైదుచేయబడ్డాడు. [13] మిస్టర్. స్టెఫెంసన్ చేత రాయచూరులో ఖైదుచేయబడ్డాడు. ఈ ఖైదు కొరకు బాంబే ప్రభుత్వం నుండి హెరాబాద్ పోలీస్ అవార్డును అందుకున్నది. ఈ సందర్భంలో బాలకృష్ణహరి చపేకర్ కొప్పల్, గంగావతి కొండల మధ్య (అది అప్పుడు రాయచూరు జిల్లాలో ఉన్నాయి) దాదాపు ఆరు మాసాల కాలం అఙాతవాసం చేసాడు. ఈ సంఘటనలో బాలకృష్ణహరి చపేకర్ ప్రజలసానుభూతిని చూరగొన్నాడు. ఆయన ఆచూకీ కొరకు బాంబే ప్రొవింస్‌కు తరఫున హైదరాబాదు పోలీస్ తీవ్రమైన విచారణ సాగించింది. ఖైదు తరువాత బాలకృష్ణహరి చపేకర్ ఆచూకీ తెలియజేసిన వారి పేర్లు హైదరాబాదు పోలీస్ చేత రహస్యంగా ఉంచబడ్డాయి. ఈ సంఘటన తరువాత బాలకృష్ణహరి చపేకర్ పట్ల ప్రజలకు సానుభూతి అధికరించించింది. తరువాత అచూకీ తెలియజేసినవారు భయభ్రాంతులకు గురయ్యారు. 1898లో జరిగిన ఈ సంఘటన తరువాత మరాఠీప్రజల స్వాతంత్ర్య పోరాటం వెలుగులోకి వచ్చింది.

[14]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Chitnis, Krishnaji Nageshrao (1994). Glimpses of Maratha socio-economic history. New Delhi: Atlantic Publishers & Distributors. p. 155. ISBN 81-7156-347-3. Retrieved 2010-12-14.
  2. Western Chalukya architecture
  3. Kamath (2001),pp 117–118
  4. Rao, Kishan (2002-06-10). "Emperor of Temples' crying for attention". The Hindu. Archived from the original on 2007-11-28. Retrieved 2007-11-09.
  5. Cousens (1926), p 18
  6. Foekema (2003), p 49
  7. Foekema (2003), p 57
  8. Foekema (2003), p 56
  9. Rashtrakutas
  10. Vijapur, Raju S. "Reclaiming past glory". Deccan Herald. Spectrum. Archived from the original on 2011-10-07. Retrieved 2007-02-27.
  11. Sundara and Rajashekar, Arthikaje, Mangalore. "Society, Religion and Economic condition in the period of Rashtrakutas". 1998–2000 OurKarnataka.Com, Inc. Archived from the original on 2006-11-04. Retrieved 2006-12-20.
  12. Hardy, Adam. "Indian Temple Architecture: Form and Transformation, the Karnata Dravida Tradition, 7th to 13th Centuries". Artibus Asiae, Vol. 58, No. 3/4 (1999), pp. 358-362. JSTOR. Retrieved 2007-11-28.
  13. "THE REVOLUTIONARIES: CHAPEKAR BROTHERS" (PDF). maharashtra.gov.in/ Maharashtra Government Publication]. Retrieved July 8, 2009.
  14. "Nanded District Gazetteer". maharashtra.gov.in/ Maharashtra Government Publication]. Retrieved July 8, 2009.

వెలుపలి లింకులు

మార్చు