లోగో

(Logo నుండి దారిమార్పు చెందింది)

లోగో అనేది గ్రాఫిక్ చిహ్నం. ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందేందుకు ఉపయోగించే చిహ్నం. ఇది నైరూప్యం కావచ్చు లేదా అలంకారిక రూపకల్పన కావచ్చు లేదా పేరులో ఉండే వచనమే కావచ్చు.

వివిధ లోగోలు
Colored dice with white background
ఇస్రో లోగో (చిహ్నం, సంక్షిప్తంగా పేరు)
Colored dice with checkered background
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో (కేవలం చిహ్నం)

మాస్ కమ్యూనికేషన్ స్థాయిలోను, సాధారణ వాడుక లోనూ కంపెనీ లోగో నేడు దాని ట్రేడ్‌మార్క్ లేదా బ్రాండ్‌కి పర్యాయపదంగా ఉంటుంది. [1]

1840లలో ఫ్రెంచ్ ప్రింటింగ్ సంస్థ రౌచన్, 1850లలో న్యూయార్క్‌కు చెందిన జోసెఫ్ మోర్స్, 1870లలో ఇంగ్లండ్‌కు చెందిన ఫ్రెడరిక్ వాకర్, 1870లలో ఫ్రాన్స్‌కు చెందిన జూల్స్ చెరెట్ వంటి విజువల్ ఆర్ట్స్, లితోగ్రాఫిక్ ప్రక్రియలో ఆవిష్కర్తలు ఒక చిత్ర కళా శైలిని అభివృద్ధి చేశారు. ఇది టోనల్, ప్రాతినిధ్య కళను దాటి ప్రకాశవంతమైన, చదునైన రంగుల విభాగాలతో అలంకారిక చిత్రాల దిశగా మళ్లింది. [2] ఉల్లాసభరితమైన పిల్లల పుస్తకాలు, అధికార వార్తాపత్రికలు, సంభాషణ పత్రికలు ప్రత్యేకమైన, విస్తరిస్తున్న ప్రేక్షకుల కోసం వారి స్వంత దృశ్య, సంపాదకీయ శైలులను అభివృద్ధి చేసుకున్నాయి. ప్రింటింగ్ ఖర్చులు తగ్గడం, అక్షరాస్యత రేట్లు పెరగడం. దృశ్య శైలులు మారడంతో, విక్టోరియన్ అలంకార కళలు టైపోగ్రాఫిక్ శైలులు, వ్యాపారాలను సూచించే పద్ధతుల విస్తరణకు దారితీశాయి. [3]

ట్రేడ్‌మార్క్ చేయబడిన మొదటి లోగో 1876లో బాస్ రెడ్ ట్రయాంగిల్

విక్టోరియన్ టైపోగ్రఫీ యొక్క మితిమీరిన శైలికి పాక్షిక ప్రతిస్పందనగా, 19వ శతాబ్దపు చివరినాటి కళలు, చేతిపనుల ఉద్యమం ఆ కాలంలో భారీగా ఉత్పత్తి అవుతున్న వస్తువులకు హస్తకళ యొక్క నిజాయితీ భావాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. [4] నైపుణ్యం, నాణ్యతలపై ఆసక్తిని పునరుద్ధరించడం కళాకారులు, కంపెనీలకు శ్రేయస్సు నివ్వడంపై ఎక్కువ ఆసక్తి కలిగించింది. ఇది ప్రత్యేకమైన లోగోలు, చిహ్నాల సృష్టికి దారితీసింది.

1950ల నాటికి, యూరప్‌లో అవంత్-గార్డె కళాత్మక ఉద్యమం రూపంలో ఆధునికవాదం, దృష్టి సారించి, అంతర్జాతీయ, వాణిజ్యీకరించబడిన ఉద్యమంగా మారింది. ఓ కళాత్మక ఉద్యమంగా ఆధునికవాదం లోని విశిష్టమైన దృశ్య సరళత, భావనను ప్రదర్శించడం లోని స్పష్టత కొత్త తరం గ్రాఫిక్ డిజైనర్లకు శక్తివంతమైన పరికరాలయ్యాయి. వారు సృష్టించిన లోగోలు లుడ్విగ్ మీస్ వాన్ డెర్ రోహే చెప్పిన "తక్కువే ఎక్కువ" అనే భావనకు అనుగుణంగా ఉండేవి. టెలివిజన్, ప్రింటింగ్ టెక్నాలజీలలో వచ్చిన అభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలు మొదలైనవాటి ద్వారా మాస్ విజువల్ కమ్యూనికేషన్ యుగంలో ఆధునికవాద-ప్రేరేపిత లోగోలు విజయవంతమయ్యాయి.

సమకాలీన లోగోలు

మార్చు
 
రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ ల చిహ్నాలు

లోగో రూపకల్పన యొక్క ప్రస్తుత యుగం 1870లలో మొదటి నైరూప్య లోగో అయిన బాస్ రెడ్ ట్రయాంగిల్‌తో ప్రారంభమైంది. 2014 నాటికి అనేక సంస్థలు, ఉత్పత్తులు, బ్రాండ్‌లు, సేవలు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు ఒక ఐడియోగ్రామ్ (సంకేతం, చిహ్నం) లేదా ఎంబ్లెం, లేదా చిహ్నం ఎంబ్లెంల కలయికను లోగోగా ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా, చెలామణిలో ఉన్న వేల సంఖ్యలో ఐడియోగ్రామ్‌లలో పేరు లేకుండా ఉండేవి కొన్ని మాత్రమే. ప్రభావవంతమైన లోగోలో ఒక ప్రత్యేకమైన డిజైన్‌లో అక్షరాలు, రంగులు, అదనపు గ్రాఫిక్ మూలకాలను ఉపయోగించి చేసిన ఐడియోగ్రామ్, కంపెనీ పేరు (లోగోటైప్) రెండూ ఉంటాయి.

 
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ సంస్థ టాటా వారి లోగో

వ్రాతపూర్వక పేర్లు (లోగోటైప్‌లు) కంటే ఐడియోగ్రామ్‌లు, చిహ్నాలు మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు - ముఖ్యంగా ప్రపంచీకరణ మార్కెట్‌లలో అనేక వర్ణమాలలలోకి అనువదించబడిన లోగోల కోసం. ఉదాహరణకు, అరబిక్ లిపిలో వ్రాసిన పేరు యూరోపియన్ మార్కెట్‌లలో పెద్దగా ఆకర్షించకపోవచ్చు. దీనికి విరుద్ధంగా, ఐడియోగ్రామ్‌ లైతే రెండు మార్కెట్‌ల లోనూ ఉత్పత్తుల పట్ల ఒకే విధమైన స్పందన ఉంటుంది. లాభాపేక్ష లేని సంస్థల విషయంలో రెడ్‌క్రాస్ (ముస్లిం దేశాలలో రెడ్ క్రెసెంట్‌గా, ఇజ్రాయెల్‌లో డేవిడ్ యొక్క రెడ్ స్టార్‌), పేరు అవసరం లేని ప్రసిద్ధ చిహ్నానికి ఉదాహరణ. రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్‌లు ప్రపంచంలోనే అత్యుత్త్తమంగా గుర్తించే చిహ్నాలలో ఉన్నాయి. నేషనల్ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీలు, వాటి ఫెడరేషన్లు అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఈ చిహ్నాలను తమ లోగోలలో చేర్చుకున్నాయి.

లోగో డిజైన్

మార్చు

లోగో రంగు

మార్చు

లోగో రూపకల్పనలో రంగు కీలకమైన అంశం. బ్రాండ్ వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో రంగు ముఖ్యమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. రంగులు ప్రజల మనోభావాలపై అపారమైన పరిణామాలను కలిగిస్తాయి. రంగులకు ప్రజల దృక్కోణాలు, భావోద్వేగాలు, ప్రతిచర్యలను మార్చగలిగే స్థాయిలో అసాధారణమైన ప్రభావం ఉంటుంది. మానవ దృశ్యమాన అవగాహన యొక్క మెకానిక్స్ కారణంగా రంగుకు అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. లోగో లోని రంగు, కాంట్రాస్టులు దృశ్య వివరాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మానవులు సామాజిక, సాంస్కృతిక కండిషనింగ్ ద్వారా వివిధ రంగులకు అర్థాలు, రంగుల పట్ల అనుబంధాలను పొందుతారు. లోగో రంగును ఎలా అర్థంచేసుకుంటాము, మూల్యాంకనం చేస్తాము అనే దానిలో ఇవి పాత్ర పోషిస్తాయి. బ్రాండ్ గుర్తింపు, లోగో రూపకల్పనకు రంగు ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇది లోగో లక్ష్యంతో విభేదించకూడదు. రంగుల అర్థాలు, వాటి పట్ల ఉండే అనుబంధాలు అన్ని సామాజిక, సాంస్కృతిక సమూహాలలో స్థిరంగా ఉండవని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, అమెరికాలో దేశభక్తి భావాలను ప్రదర్శించాలనుకునే కంపెనీల లోగోలలో ఎరుపు, తెలుపు, నీలం తరచుగా ఉపయోగిస్తారు. అలాగే వివిధ దేశాల్లో జాతీయ భావాన్ని రేకెత్తించేందుకు విభిన్న రంగులు ఉంటాయి.

సంస్థ లోగోలో రంగును ఎంచుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రభావం, పోటీదారుల లోగోల మధ్య భేదాన్ని సృష్టించడంలో దాని పాత్ర కారణంగా అది ముఖ్యమైన నిర్ణయమౌతుంది. పరిశ్రమ రంగంలో సంభావ్య లోగో రంగులను గుర్తించడానికి ఒక పద్దతి "కలర్ మ్యాపింగ్". దీని ద్వారా ఇప్పటికే ఉన్న లోగోల రంగులను క్రమపద్ధతిలో గుర్తించి, మ్యాపింగు చేసి, మూల్యాంకనం చేస్తారు.

డైనమిక్ లోగోలు

మార్చు

1898లో, ఫ్రెంచ్ టైర్ల తయారీదారు మిచెలిన్, మిచెలిన్ మ్యాన్‌ను పరిచయం చేసింది. ఇది ఒకే రూపంలో కాకుండా తినడం, త్రాగడం, ఆడటం వంటి అనేక విభిన్న సందర్భాలలో వివిధ భంగిమల్లో ఉండే కార్టూన్ బొమ్మ. 21వ శతాబ్దం ప్రారంభంలో, MTV, నికెలోడియన్, గూగుల్, మోర్టన్ సాల్ట్, సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ వంటి పెద్ద సంస్థలు సందర్భాన్ని బట్టి మారే డైనమిక్ లోగోలను స్వీకరించాయి. [5]

ఇంటర్నెట్ అనుకూల లోగోలు

మార్చు

లోగోటైప్‌లను ఉపయోగించే కంపెనీ (వర్డ్‌మార్క్‌లు) సంస్థ యొక్క ఇంటర్నెట్ చిరునామాతో సరిపోలే లోగోను కోరవచ్చు. రెండు లేదా మూడు అక్షరాలతో కూడిన చిన్న లోగోటైప్‌ల కోసం, ఒకే అక్షరాలను ఉపయోగించే బహుళ కంపెనీలు కనుగొనబడ్డాయి. ఉదాహరణకు, "CA" లోగోను ఫ్రెంచ్ బ్యాంక్ క్రెడిట్ అగ్రికోల్, డచ్ దుస్తుల రిటైలర్ C&A, US సాఫ్ట్‌వేర్ కార్పొరేషన్ CA టెక్నాలజీస్ మూడూ ఉపయోగిస్తాయి. అయితే వీటిలో ఒక్కరికి మాత్రమే ఇంటర్నెట్ డొమైన్ పేరు CA.com ఉంటుంది.

నేటి డిజిటల్ ఇంటర్‌ఫేస్ అనుకూల ప్రపంచంలో, లోగోను పెద్ద మానిటర్‌ల నుండి చిన్న హ్యాండ్‌హెల్డ్ పరికరాల వరకు అన్నిటిలోనూ స్పష్టంగా కనబడేలా ఫార్మాట్ చేస్తారు. స్థిరమైన పరిమాణ మార్పు, రీ-ఫార్మాటింగ్‌తో, లోగో డిజైనర్లు మందపాటి లైన్‌లు, ఆకారాలు, నిండు రంగులతో మరింత బోల్డ్ గాను, సరళంగానూ ఉండే పద్ధతికి మారుతున్నారు. కొద్దిపాటి స్థలంలో ఇతర లోగోలతో కూడా కలిసి ఉన్నప్పుడూ, వివిధ మీడియాలకు అనుగుణంగా పరిమాణంలో మార్పులు చేసినప్పుడూ సందిగ్ధత తక్కువగా ఉంటుంది. Twitter, Facebook, LinkedIn, Google+ వంటి సోషల్ నెట్‌వర్క్‌లు అటువంటి లోగోలను ఉపయోగిస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. Wheeler, Alina. Designing Brand Identity © 2006 John Wiley & Sons, Inc. (page 4) ISBN 978-0-471-74684-3
  2. Meggs 1998, p. 148–155.
  3. Meggs 1998, pp. 159–161.
  4. Meggs 1998, pp. 162–167.
  5. Rawsthorn, Alice (2007-02-11). "The new corporate logo: Dynamic and changeable are all the rage". International Herald Tribune. Retrieved 2008-05-21.
"https://te.wikipedia.org/w/index.php?title=లోగో&oldid=3695061" నుండి వెలికితీశారు