బ్లాక్ (ఆవర్తన పట్టిక)

(P-బ్లాకు నుండి దారిమార్పు చెందింది)

ఆవర్తన పట్టికలో బ్లాక్ అనేది పరమాణు కక్ష్యల వాలెన్స్ ఎలక్ట్రాన్‌లను బట్టి సమూహపరచిన మూలకాల సమితి. [1] ఈ పదాన్ని మొదట చార్లెస్ జానెట్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. [2] ప్రతి బ్లాక్‌కు దాని లక్షణమైన కక్ష్య పేరిట s-బ్లాక్, p-బ్లాక్, d-బ్లాక్, f-బ్లాక్ అనే పేర్లు పెట్టారు.

ఆవర్తన పట్టికలో s, f, d, p బ్లాక్‌లు

బ్లాక్ పేర్లు (s, p, d, f) స్పెక్ట్రోస్కోపిక్ సంజ్ఞామానం లోని ఎలక్ట్రాన్ అజిముతల్ క్వాంటం సంఖ్య విలువను బట్టి తీసుకున్నారు : షార్ప్ (0), ప్రిన్సిపల్(1), డిఫ్యూస్ (2), ఫండమెంటల్(3). ఆ తరువాత వచ్చే బ్లాకుల లోని మూలకలాను ఇంకా కనుక్కోనప్పటికీ, ఆయా బ్లాకులకు పేర్లు g, h, అని అక్షర క్రమంలో పెట్టారు.

లక్షణాలు

మార్చు

ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చేసిన బ్లాకుల ఈ నామకరణం, ఆయా బ్లాకుల్లోని మూలకాల సెట్ల రసాయనిక ధర్మాల మధ్య సుమారుగా అనురూప్యం ఉంది. s-బ్లాక్, p-బ్లాక్‌లను కలిపి సాధారణంగా ప్రధాన-సమూహ మూలకాలు అని పరిగణిస్తారు. d-బ్లాకు ట్రాన్సిషన్ లోహాలకు అనుగుణంగా ఉంటుంది. f-బ్లాకులో దాదాపు అన్ని లాంతనైడ్‌లు ( లాంతనమ్ వంటివి), యాక్టినాయిడ్‌లు ( యాక్టీనియం వంటివి) ఉంటాయి. ఈ బ్లాకుల్లో ఉండే మూలకాల ఖచ్చితమైన సభ్యత్వాన్ని అందరూ అంగీకరించరు. ఉదాహరణకు, గ్రూపు 12 మూలకాలు జింక్, కాడ్మియం, పాదరసం లు ఇతర d-బ్లాక్ మూలకాల కంటే రసాయనికంగాను, భౌతికంగానూ p-బ్లాక్ మూలకాలతో సారూప్యంగా ఉంటాయి కాబట్టి వీటిని ట్రాన్సిషన్ సమూహంగా కాకుండా ప్రధాన సమూహంగా పరిగణిస్తారు. అవి గ్రూపు 3 మూలకాలకు s-బ్లాక్ మూలకాలతో ఉన్న సారూప్యత కారణంగా కొన్నిసార్లు వాటిని ప్రధాన సమూహ మూలకాలుగా పరిగణిస్తారు. f-బ్లాక్‌లోని గ్రూపులకు (నిలువు వరుసలు) (గ్రూప్‌లు 2, 3 మధ్య) సంఖ్యలు ఇవ్వలేదు.

s-బ్లాక్ మూలకమైన హీలియంకు దాని బాహ్య ఎలక్ట్రాన్‌లు 1s పరమాణు కక్ష్యలో ఉంటాయి. కానీ దాని రసాయన లక్షణాలు మాత్రం దాని పూర్తి షెల్ కారణంగా గ్రూపు 18లోని p-బ్లాక్ నోబుల్ వాయువులను పోలి ఉంటాయి.

s-బ్లాక్

మార్చు

s-బ్లాక్ లో s అనేది "షార్ప్" నుండి వచ్చింది. అజిముతల్ క్వాంటం సంఖ్య 0. సంప్రదాయ ఆవర్తన పట్టికలో ఇది ఎడమ వైపున ఉంటుంది. ఇందులో మొదటి రెండు నిలువు వరుసల మూలకాలతో పాటు కుడివైపు నిలువు వరుసలోని ఒక మూలకం, అలోహాలైన హైడ్రోజన్‌, హీలియంలు, క్షార లోహాలు (గ్రూప్ 1లో), క్షార మృత్తిక లోహాలు (గ్రూప్ 2) ఈ బ్లాకులో ఉంటాయి. వాటి సాధారణ వాలెన్స్ కాన్ఫిగరేషన్ n s 1–2 . హీలియం ఒక s-మూలకం అయినప్పటికీ, అది ఎల్లప్పుడూ కుడివైపున సమూహం 18 లో p-మూలకమైన నియాన్ పైన ఉంటుంది. పట్టికలోని ప్రతి అడ్డు వరుసలో రెండు s-మూలకాలు ఉంటాయి.

s-బ్లాక్ లోని లోహాలు (రెండవ కాలం నుండి) చాలావరకు మృదువుగా ఉంటాయి. సాధారణంగా వీటికి తక్కువ ద్రవీభవన, మరిగే స్థానాలు ఉంటాయి. మండినపుడు ఇవి మంటకు రంగును ఆపాదిస్తాయి.

రసాయనికంగా, హీలియం మినహా అన్ని s-మూలకాలు అధిక రియాక్టివ్‌గా ఉంటాయి. s-బ్లాక్ లోహాలు చాలా ఎలెక్ట్రోపోజిటివ్‌గా ఉంది, అలోహాలతో, ముఖ్యంగా అధిక ఎలక్ట్రోనెగటివ్ హాలోజన్ అలోహాలతో, తరచూ అయానిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.

p-బ్లాక్

మార్చు

p-బ్లాక్ లో p అనేది "ప్రిన్సిపల్" నుండి వచ్చింది. అజిముతల్ క్వాంటం నంబర్ 1. ప్రామాణిక ఆవర్తన పట్టికలో ఇది కుడి వైపున ఉంటుంది. ఇందులో గ్రూపు 13 నుండి గ్రూపు 18 వరకు ఉన్న మూలకాలు ఉంటాయి. వాటి సాధారణ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ n s 2 n p 1–6 . హీలియం, గ్రూపు 18లో మొదటి మూలకం అయినప్పటికీ, దాన్ని p-బ్లాక్‌లో చేర్చలేదు. పట్టికలోని ప్రతి అడ్డు వరుసలోను, మొదటి వరుస (అసలు ఆ వరుసలో మూలకాలేంఈ లేవు) మినహా, ఆరు p-మూలకాలకు చోటు ఉంటుంది.

ఈ బ్లాక్‌లో మాత్రమే మొత్తం మూడు రకాల మూలకాలూ ఉన్నాయి: లోహాలు, అలోహాలు, మెటలాయిడ్స్. p-బ్లాక్ మూలకాలను వాటి గ్రూపులను బట్టి ఇలా వర్ణించవచ్చు: గ్రూప్ 13 ఐకోసాజెన్స్ ; 14 -స్ఫటికాకారాలు; 15 నిక్టోజెన్‌లు ; 16చాల్కోజెన్లు ; 17 - హాలోజన్లు ; 18 - ఉత్కృష్ట వాయువులు, ఒగానెస్సన్‌ లతో కూడిన హీలియం గ్రూపు (హీలియం మినహా). మరో రకంగా, p-బ్లాక్‌లో పోస్ట్-ట్రాన్సిషన్ లోహాలు; మెటలోయిడ్స్; హాలోజన్లతో సహా రియాక్టివ్ నాన్మెటల్స్ ; నోబుల్ వాయువులు (హీలియం మినహా) ఉంటాయని చెప్పవచ్చు

p-బ్లాక్ మూలకాల్లో వాటి వాలెన్స్ ఎలక్ట్రాన్‌లు p కక్ష్యలో ఉండటం వాటికి ఉండే సామాన్య లక్షణం. p కక్ష్యలో ఒక కేంద్ర బిందువు నుండి సమానమైన కోణాల వద్ద ఉండే ఆరు లోబ్ ఆకారాలు ఉంటాయి. p కక్ష్యలో గరిష్టంగా ఆరు ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. అందువల్ల p-బ్లాక్‌లో ఆరు నిలువు వరుసలు ఉన్నాయి. p-బ్లాక్ యొక్క మొదటి నిలువు వరుస అయిన 13లోని మూలకాలలో ఒక p-ఆర్బిటల్ ఎలక్ట్రాన్‌ ఉంటుంది. p-బ్లాక్ యొక్క రెండవ నిలువు వరుస 14లోని మూలకాల్లో రెండు p-ఆర్బిటల్ ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. ఆరు p-ఆర్బిటల్ ఎలక్ట్రాన్‌లు ఉండే కాలమ్ 18 వరకు ఈ ట్రెండ్ ఈ విధంగా కొనసాగుతుంది.

ఈ బ్లాక్ లోని మొదటి వరుస ఆక్టెట్ నియమాన్ని బలంగా ప్రదర్శిస్తాయి. తదుపరి వరుసలలోని మూలకాలు తరచుగా హైపర్‌వాలెన్సీని ప్రదర్శిస్తాయి. p-బ్లాక్ మూలకాలు వివిధ ఆక్సీకరణ స్థితులను, సాధారణంగా రెండు గుణకాలతో విభిన్నంగా చూపుతాయి. సమూహంలోని మూలకాల ప్రతిచర్య సాధారణంగా క్రిందికి వచ్చేకొద్దీ తగ్గుతుంది. (హీలియం నియాన్ కంటే ఎక్కువ రియాక్టివ్‌గా ఉండటం ద్వారా గ్రూప్ 18లో ఈ ధోరణికి అడ్డుపడుతుంది. అయితే హీలియం నిజానికి s-బ్లాక్ మూలకం కాబట్టి, ట్రెండ్‌లోని p-బ్లాక్ భాగం చెక్కుచెదరకుండా ఉంటుంది.)

ఆక్సిజన్, హాలోజన్లు లోహాలతో మరింత అయానిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి; మిగిలిన రియాక్టివ్ అలోహాలు మరింత సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి, అయితే ఎలెక్ట్రోనెగటివిటీ వ్యత్యాసం తగినంతగా ఉన్నప్పుడు వీటిలో అయానిసిటీ సాధ్యమవుతుంది (ఉదా. [1]Li3N ). మెటాలాయిడ్లు సమయోజనీయ సమ్మేళనాలను గానీ, లోహాలతో మిశ్రలోహాలను గానీ ఏర్పరుస్తాయి.

d-బ్లాక్

మార్చు

d-బ్లాక్ లోని d "డిఫ్యూజ్" నుండి వచ్చింది. అజిముటల్ క్వాంటం నంబర్ 2. ఆవర్తన పట్టికలో ఇది మధ్యలో ఉంటుంది. ఇందులో గ్రూపు 3 నుండి 12 వరకు ఉండే గ్రూపుల్లోని మూలకాలు ఉంటాయి. ఇది 4వ నిలువు వరుసతో మొదలవుతుంది. 4 నుండి మొదలయ్యే పీరియడ్లలో పది డి-బ్లాక్ మూలకాల కోసం ఖాళీ ఉంటుంది. 1, 2 గ్రూపులలో ఉన్న బలమైన ఎలెక్ట్రోపోజిటివ్ లోహాలకూ 13 నుండి 16 గ్రూపులలో ఉన్న బలహీనమైన ఎలెక్ట్రోపోజిటివ్ లోహాలకూ మధ్య ఇవి ఉంటాయి కాబట్టి ఈ బ్లాకు లొణి మూలాకలన్నింటినీ లేదా చాలా వాటిని ట్రాన్సిషన్ లోహాలు అని కూడా పిలుస్తారు. గ్రూపు 3 లేదా గ్రూపు 12 లమ్ను d-బ్లాక్ లోహాలుగా పరిగణించినప్పటికీ, వీటిని కొన్నిసార్లు ట్రాన్సిషన్ లోహాలుగా పరిగణించరు - ఎందుకంటే అవి ట్రాన్సిషన్ లోహాలకు ఉండే రసాయన ధర్మాలను చూపించవు. ఉదాహరణకు, బహుళ ఆక్సీకరణ స్థితులు, రంగుల సమ్మేళనాలు.

d-బ్లాక్ లోని మూలకాలన్నీ లోహాలే. చాలా వరకు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రసాయనికంగా క్రియాశీలంగా ఉండే d-కక్ష్య ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. వివిధ డి-ఆర్బిటల్ ఎలక్ట్రాన్ల శక్తిలో సాపేక్షంగా చిన్న వ్యత్యాసం ఉన్నందున, రసాయన బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ల సంఖ్య మారవచ్చు. d-బ్లాక్ మూలకాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించే ధోరణిని కలిగి ఉంటాయి. అత్యంత సాధారణ ఆక్సీకరణ స్థితులు +2, +3. క్రోమియం, ఇనుము, మాలిబ్డినం, రుథేనియం, టంగ్‌స్టన్, ఓస్మియం ల ఆక్సీకరణ సంఖ్యలు −4 కంటే తక్కువగా ఉంటాయి; ఇరిడియం +9 ఆక్సీకరణ స్థితిని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

d-కక్ష్యలలో (నాలుగు-ఆకులు ఆకారంలో ఉండేవి నాలుగు, ఐదవది చుట్టూ రింగ్‌తో డంబెల్‌ లాగా ఉంటుంది) గరిష్టంగా ఐదు జతల ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

f-బ్లాక్

మార్చు

f-బ్లాక్adhi లోని f "ఫండమెంటల్" నుండి వచ్చింది. దీని అజిముటల్ క్వాంటం నంబర్ 3. ప్రామాణిక 18-నిలువు వరుసలుండే ఆవర్తన పట్టికలో ఇది ఫుట్‌నోట్‌గా కనిపిస్తుంది. 32-నిలువు వరుసలుండే పూర్తి వెడల్పు పట్టికలో మాత్రం మధ్యలో-ఎడమవైపున ఉంటుంది. 6 నుండి ఉండే పీరియడ్లలో పద్నాలుగు ఎఫ్-బ్లాక్ మూలకాలకు చోటు ఉంటుంది. ఈ మూలకాలను సాధారణంగా ఏ గ్రూపులోనూ భాగంగా పరిగణించనప్పటికీ, కొంతమంది రచయితలు వాటిని గ్రూపు 3లో భాగంగా భావిస్తారు. వాటిని కొన్నిసార్లు అంతర్గత ట్రాన్సిషన్ లోహాలు అని పిలుస్తారు - ఎందుకంటే అవి 6వ, 7వ వరుస (పీరియడ్)లో s-బ్లాక్, d-బ్లాక్‌ల మధ్య ట్రాన్సిషన్‌గా ఉంటాయి. s-బ్లాక్ p-బ్లాక్ లలో 4వ, 5వ వరుసలలో d-బ్లాక్ ట్రాన్సిషన్ లోహాలు వంతెన లాగా ఉన్నట్లే ఇది కూడా.

f-బ్లాక్ మూలకాలు 6, 7 నిలువు వరుసలలో రెండు శ్రేణుల్లో ఉంటాయి. ఇవి అన్నీ లోహాలే. f-బ్లాక్‌లో పీరియడ్ 6 లోని మూలకాల రసాయన ధర్మాల్లో f-కక్ష్య ఎలక్ట్రాన్లు తక్కువ చురుకుగా ఉంటాయి: ఇవి ఒకదానికొకటి సారూప్యంగా ఉంటాయి. f-బ్లాక్ పీరియడ్ 7 లోని తొలి మూలకాలలో అవి మరింత చురుకుగా ఉంటాయి; పర్యవసానంగా ఈ మూలకాలు వాటి పరివర్తన లోహాల వలె ఎక్కువ రసాయన వైవిధ్యాన్ని చూపుతాయి. f-బ్లాక్ లో తరువాత వచ్చే మూలకాలు కాలం 6 లోని మూలకాల వలె ప్రవర్తిస్తాయి.

f-బ్లాక్ మూలకాలలో ఎక్కువగా అంతర్గత f-కక్ష్యలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లు ఉండే సామాన్య లక్షణం ఉంటుంది. f-ఆర్బిటాళ్ళలో ఆరింటిలో ఒక్కొక్క దానిలో ఆరు లోబ్‌లు ఉంటాయి. ఏడవ దానిలో రెండు రింగులతో డోనట్‌తో డంబెల్ లాగా ఉంటుంది. అవి ఏడు జతల ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి కాబట్టి ఈ బ్లాక్ ఆవర్తన పట్టికలో పద్నాలుగు నిలువు వరుసలను ఆక్రమిస్తుంది. రెండు మూలకాలు మాత్రమే ఉండే "గ్రూపు"లో నిలువు ఆవర్తన ధోరణులను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి వాటికి గ్రూపు సంఖ్యలు ఇవ్వలేదు.

ఎఫ్-బ్లాక్ లో, పద్నాలుగేసి మూలకాలుండే రెండు వరుసలను కొన్నిసార్లు లాంతనైడ్‌లు, ఆక్టినైడ్‌లతో తికమక ఏర్పడుతుంది. లాంతనైడ్‌లు, ఆక్టినైడ్‌లు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ ను బట్టి కాక, రసాయన ధర్మాల ఆధారంగా వచ్చిన పేర్లు. లాంతనైడ్లు లాంతనమ్ నుండి లుటెటియం వరకు ఉన్న 15 మూలకాలు; ఆక్టినైడ్స్ అనేది ఆక్టినియం నుండి లారెన్షియం వరకు ఉన్న 15 మూలకాలు.

మూలాలు

మార్చు
  1. (21 March 2015). "The positions of lanthanum (actinium) and lutetium (lawrencium) in the periodic table: an update".
  2. Charles Janet, La classification hélicoïdale des éléments chimiques, Beauvais, 1928