పెగడపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం
(Pegadapally, Karimnagar నుండి దారిమార్పు చెందింది)

పెగడపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

పెగడపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, పెగడపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, పెగడపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, పెగడపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°48′32″N 79°04′58″E / 18.808818°N 79.082909°E / 18.808818; 79.082909
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం పెగడపల్లి
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 130 km² (50.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 47,981
 - పురుషులు 23,839
 - స్త్రీలు 24,142
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.88%
 - పురుషులు 56.81%
 - స్త్రీలు 31.23%
పిన్‌కోడ్ 505532

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం పెగడపల్లి.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 47,981 - పురుషులు 23,839 - స్త్రీలు 24,142

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 42,606. జనాభాలో పురుషులు 21,150 కాగా, స్త్రీల సంఖ్య 21,456. మండలంలో 11,280 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

మార్చు

లోగడ పెగడపల్లి గ్రామం/ మండలం జగిత్యాల జిల్లాలో, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెగడపల్లి మండలాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. పెగడపల్లి
  2. లింగాపూర్
  3. దేవికొండ
  4. లేగలమర్రి
  5. ఎల్లాపూర్
  6. నంచెర్ల
  7. వెంగళాయిపేట్
  8. బత్కేపల్లి
  9. ఆరవెల్లి
  10. ఐతుపల్లి
  11. నందగిరి
  12. కీసులాటపల్లి
  13. నామాపూర్
  14. నర్సింహునిపేట

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

మార్చు