పీకోమీటర్

(Picometre నుండి దారిమార్పు చెందింది)

పికోమీటర్ అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ( SI )లో 1×10−12 మీ. కి సమానం.1, లేదా ఒక మీటరులో లక్ష కోట్లవ వంతు లేదా మీటరులో ట్రిలియన్నవ వంతు. ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఉపయోగించే ఇంగ్లీషు స్పెల్లింగు picometre. దీని SI గుర్తు: pm. అమెరికన్ స్పెల్లింగులో దీన్ని picometer అని రాస్తారు.

పీకోమీటర్
Atom.svg
హీలియం పరమాణువు - 62 పీకోమీటర్ల వ్యాసం [1]
ప్రమాణం యొక్క సమాచారం
ప్రమాణ వ్యవస్థSI
ఏ బౌతికరాశికి ప్రమాణంపొడవు
గుర్తుpm 
ప్రమాణాల మధ్య సంబంధాలు
1 pm in ...... is equal to ...
   SI base units   1×10−12 మీ.
   Natural units   6.1877×1022 P
   1.8897×10−2 a0
   imperial/US units   3.9370×10−11 అం.

పికోమీటరు అంటే వెయ్యి ఫెమ్టోమీటర్లు, నానోమీటర్‌లో వెయ్యవ వంతు, మైక్రోమీటరులో 10 లక్షలవ వంతు, మిల్లీమీటరులో 100 కోట్లవ వంతు. [2] ఒకప్పుడు దీని చిహ్నం μμ గా ఉండేది.

వాడుకసవరించు

పికోమీటర్ పొడవు చాలా చాలా చిన్నది కాబట్టి దాని వాడుక దాదాపు పూర్తిగా కణ భౌతిక శాస్త్రం, క్వాంటం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ధ్వని శాస్త్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. పరమాణువుల వ్యాసాలు 62 - 520 pm ల మధ్య ఉంటాయి. కార్బన్-కార్బన్ సింగిల్ బాండ్ పొడవు 154 pm. హాడ్రాన్లు, ఫెర్మియాన్ల వంటి పరమాణువుల కంటే సూక్ష్మమైన కణాలను వివరించడానికి ఇంకా చిన్న యూనిట్లను ఉపయోగిస్తారు.

గురుత్వాకర్షణ తరంగాలను నేరుగా గుర్తించడానికి లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ స్పేస్ యాంటెన్నా (LISA) ప్రోబ్‌ను 2034 లో ప్రయోగించడానికి ప్రణాళిక చేసారు. ఇది 2.5 గిగామీటర్‌ల దూరంలోని సాపేక్ష స్థానభ్రంశాలను 20 పికోమీటర్‌ల రిజల్యూషన్‌తో కొలుస్తుంది.

మూలాలుసవరించు

  1. "Atomic radius". WebElements: the periodic table on the web.
  2. Deza, Elena; Deza, Michel Marie (2006). Dictionary of Distances. Elsevier. ISBN 0-444-52087-2.