రేడియం

రసాయన మూలకం
(Radium నుండి దారిమార్పు చెందింది)

రేడియం అనేది ఒక రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 88. ఆవర్తన పట్టికలో దీని యొక్క చిహ్నం Ra. దీనిని మేరీ క్యూరీ, పియరీ క్యూరీ 1898 లో రేడియం క్లోరైడ్ రూపంలో కనుగొన్నారు.[1] ఇది దాదాపు స్వచ్ఛమైన-తెలుపు రంగు గల క్షారమృత్తిక లోహము (ఆల్కలీన్ ఎర్త్ మెటల్), కానీ ఇది ఆక్సిజన్‌కు గురైనప్పుడు, ఇది త్వరగా నల్లగా మారుతుంది. రేడియం యొక్క అన్ని ఐసోటోపులు రేడియోధార్మికత కలిగివుంటాయి, ఈ కారణంగా ఇది మందమైన నీలం రంగులో మెరుస్తుంది. ఇది చీకటిలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది కనుక చీకటిలో కూడా సమయం కనిపించేందుకు గడియారంలోని అంకెలకు, ముళ్ళులకు దీనిని ఉపయోగించారు. ఇంకా టార్చ్‌లైట్ వంటి వాటికి కూడా దీనిని ఉపయోగించారు, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు రేడియంపూత ఉన్న టార్చ్‌లైట్ ఆపివున్నప్పటికి చీకటిలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది, కనుక చీకట్లో కూడా వెంటనే లైట్ వెలిగించుకొనుటకు ఆవకాశం ఉండేది. అయితే ఇవి ఇప్పుడు నిషేధించబడ్డాయి ఎందుకంటే ఇవి రేడియేషన్ విషానికి కారణమవుతాయి.

రేడియం యొక్క బాహ్యదృష్టి (Ra-226)

విస్తృత ఆవర్తన పట్టికలో రెండవ గ్రూపుగా ఉన్న క్షార మృత్తిక లోహాలలో రేడియం ఆరవది. (బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra))

మూలాలు

మార్చు
  1. "Radium". Royal Society of Chemistry. Archived from the original on 24 March 2016. Retrieved 5 July 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=రేడియం&oldid=3889266" నుండి వెలికితీశారు