అంగజాల రాజశేఖర్

భారతీయ వైద్యుడు, వికీమీడియన్

డాక్టర్ అంగజాల రాజశేఖర్ (ఆంగ్లం:Angajala Rajasekhar) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యులు. వీరు నేషనల్ పాథాలజీ లాబొరేటరీని హైదరాబాదులో స్థాపించారు.[1][2] ఆయన తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా సంస్థలో అధికారి.[3]

అంగజాల రాజశేఖర్
అంగజాల రాజశేఖర్ చిత్రం
జననం
అంగజాల రాజశేఖర్

1 జూలై 1961
సాలూరు,విజయనగరం జిల్లా
విద్యఎం.బి.బి.ఎస్, ఎం.డి(పాథాలజీ)
విద్యాసంస్థఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,న్యూఢిల్లీ
ఉద్యోగంనేషనల్ పాథాలజీ లేబొరేటరీ,హైదరాబాదు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వైద్యులు
జీవిత భాగస్వామిడా.పద్మకుమారి
పిల్లలుగౌతమీ ప్రియదర్శిని(కుమార్తె)
హేమంత్ కుమార్(కుమారుడు)
తల్లిదండ్రులుజగన్నాధయ్య
సావిత్రమ్మ

జీవిత విశేషాలు

మార్చు

అంగజాల రాజశేఖర్ గారు విజయనగరం జిల్లా సాలూరులో శ్రీమతి సావిత్రమ్మ, శ్రీ జగన్నాధయ్య దంపతులకు మూడవ కుమారునిగా జూలై 1 1961 న జన్మించారు. ఆయన తండ్రి సాలూరు పట్టణంలో వ్యాపారం చేసేవారు. జగన్నాధయ్య గారికి నలుగురు కుమారులు. వారు నాగేశ్వరరావు, మురళీకృష్ణ, రాజశేఖర్, రవికుమార్. రాజశేఖర్ తండ్రిగారు సెప్టెంబరు 29 1989 న పరమపదించారు.

 
జాతీయ సైటాలజీ సమావేశంలో నలినీబాయి థాకర్ బహుమతిను అందుకుంటున్న సందర్భంగా 1987.

రాజశేఖర్ ఆంధ్రా మెడికల్ కాలేజీ, విశాఖపట్నంలో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని పొందారు. ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ నుండి పాథాలజీలో ఎం.డి (1985-88) చేసారు.తరువాత నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడ్విన్ హాస్పటల్ లలో తన సేవలనందించారు. ఆయన హైదరాబాదులో నేషనల్ పాథాలజీ లేబొరేటరీని స్థాపించి దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆయన 1989లో శ్రీకాకుళం నకు చెందిన రెడ్లం శ్రీరాములు కుమార్తె అయిన డా.పద్మకుమారిని వివాహమాడారు. రాజశేఖర్ బలిజిపేట, సిగడాంలో గల బంధువులకు, ప్రజలకు వైద్యసేవలనందిస్తుంటారు. ఆయనకు ఒక కుమారుడు (హేమంత్ కుమార్), ఒక కుమార్తె (గౌతమీ ప్రియదర్శిని) ఉన్నారు. కుమార్తె ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాదులో ఎం.బి.బి.ఎస్ చేస్తున్నారు.[4]

తెలుగు వికీపీడియాలో సేవలు

మార్చు

రాజశేఖర్ తన వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఆయన వైవిధ్యభరితమైన వ్యాసాలను రాస్తున్నారు. వీరు జీవశాస్త్రం, సాధారణ తెలుగుపదాలు, సుప్రసిద్ధ ఆంధ్రులు, యోగా, మానవశరీర నిర్మాణం, వ్యాధులు, వ్యాధి నిర్ణయం, రహదారులు వంటి వ్యాసాలను అందించారు. వివాదాలకు దూరంగా ఉంటూ సహసభ్యుల పట్ల సౌజన్యం చూపడం వీరి ప్రత్యేకత. వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు (NWR2011) పొందారు.[5] 2010,2011 సంవత్సరాలలో వ్యాస, వ్యాసేతర అధికమార్పులు చేసినవారిలో 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకాలను అందుకోవడమే కాక గండ పెండేరం, జీవశాస్త్ర వ్యాసరచనలకు గుర్తింపు పతకం, 50,000 దిద్దుబాట్లు చేసినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి.[6]

రచనలు

మార్చు

ఆయన 1991 లో డయాగ్నాసిస్ సైటోపాథాలజీ అనే గ్రంథం పై భావి అధ్యయనాన్ని వ్రాసారు.[7] ఆయన కార్డియోమయోపతిలో అనువంశిక మజ్జాతంతువులను ఉద్రేకపరచు మందులు గూర్చి అధ్యయనం చేసారు.[8]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "National Pathology Laboratory". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-06.
  2. National Pathology (Dr Rajasekhar) Directions
  3. "వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961". వికీపీడియా. 2013-05-13.
  4. "Maddamasetty Savithramma". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-06.
  5. networthy wikimedian recognition
  6. తెలుగు వెలుగు, అంతర్జాలంలో తెలుగు (10 October 2018). "తెవికీ అక్షర సేనానులు". www.teluguvelugu.in. Archived from the original on 22 February 2021. Retrieved 22 February 2021.
  7. Diagnostic utility of fine-needle sampling without aspiration: A prospective study
  8. Catecholamine Cardiomyopathy: An Autopsy Study[permanent dead link]

ఇతర లింకులు

మార్చు