సాలూరు
సాలూరు, (వినండి: // ( listen)) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. నాగావళి ఉపనదైన వేగావతి ఒడ్డున చుట్టు కొండల మధ్యలో వుంది.
పట్టణం | |
Coordinates: 18°32′N 83°13′E / 18.53°N 83.22°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండలం | సాలూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 19.55 కి.మీ2 (7.55 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 49,500 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1061 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8964 ) |
పిన్(PIN) | 535591 |
Website |
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,05,389 - పురుషులు 51,107 - స్త్రీలు 54,282.
పరిపాలన
మార్చుసాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరంలో రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు.
రవాణా సౌకర్యాలు
మార్చుజిల్లా కేంద్రమైన పార్వతీపురం నుండి నైరుతి దిశలో 47 కి.మీ. దూరంలో ఈ ఊరున్నది. జాతీయ రహదారి 26 (భారతదేశం) ఈ పట్టణం గుండా పోతుంది. ఒడిశా రాష్ట్ర బస్సు సేవలున్నాయి. [2]
ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యాటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. మాతుమురు మీదుగా కొత్తగా వేస్తున్న మార్గంలో 54 కిలోమీటర్లు ప్రయాణము చేస్తే అరకు చేరుకోవచ్చు అలాగే ఒరిస్సా మీదుగా అరకు మార్గముకు సుంకి, రాళ్లగడ్డ మీదుగా 71 కిలోమీటర్లు దూరంలో చేరుకోవచ్చు.
విద్యా సౌకర్యాలు
మార్చుపట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. [ఆధారం చూపాలి]
విద్యా సౌకర్యాలు
మార్చుపట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. [ఆధారం చూపాలి]
ఉత్పత్తులు
మార్చుమల్లెపువ్వులు, గులాబీలు,వరి, చెరుకు, పొగాకు, అరటి
పరిశ్రమలు
మార్చుఅంతేకాక పట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. [ఆధారం చూపాలి]
పర్యాటక ఆకర్షణలు
మార్చుఈ ఊరిలో పురాతనమైన పంచముఖేశ్వర శివాలయం ఉంది. శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవత.
ఇక్కడకు దగ్గరలోనే శ్రీ శంబర పోలమాంబ దేవాలయం, పారమ్మకొండలాంటి పుణ్యతీర్దాలు ఉన్నాయి.సాలూరు చుట్టుపక్కల తొణాం, దండిగం, కూరుకుటి, దాలయువలస, కుంబిమడ, ఆలూరు, లోద్ద ప్రదేశాల వద్ద అందమైన జలపాతాలు ఉన్నాయి. పాచిపెంటడ్యాం, శంబరడ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి.
ప్రముఖులు
మార్చు- పురిపండా అప్పలస్వామి: బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయులు (1904-1982) సాలూరులో జన్మించాడు.
- సాలూరు రాజేశ్వరరావు - ప్రముఖ సంగీత దర్శకుడు పుట్టిన గ్రామం
- పట్రాయని సీతారామశాస్త్రి -సీతారామశాస్త్రి దగ్గర ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత విద్యను నేర్చుకున్నాడు .
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ DHS (2022). District Handbook of Statistics -Parvathipuram Manyam (PDF). p. 20.