బలిజిపేట (విజయనగరం జిల్లా)

విజయనగరం జిల్లా బలిజిపేట మండలం లోని గ్రామం

విశాఖపట్నం జిల్లా లోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం బలిజిపేట (విశాఖపట్నం జిల్లా) చూడండి.

బలిజిపేట
రెవెన్యూయేతరగ్రామం
బలిజిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాజీ విగ్రహం
బలిజిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాజీ విగ్రహం
బలిజిపేట is located in Andhra Pradesh
బలిజిపేట
బలిజిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో బలిజపేట స్థానం
బలిజిపేట is located in India
బలిజిపేట
బలిజిపేట
బలిజిపేట (India)
Coordinates: 18°36′47″N 83°31′46″E / 18.613061°N 83.529475°E / 18.613061; 83.529475
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
Government
 • Bodyస్థానిక స్వపరిపాలన సంస్థ
Elevation
76 మీ (249 అ.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
535557
వాహన నమోదుAP35 (పాత సంఖ్య)
AP39 (2019 జనవరి 30 నుండి )[1]

బలిజిపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామం, ఇది బలిజపేట మండల కేంద్రం. ఇది పలగర రెవెన్యూ గ్రామ పరిధిలోవుంది.

శాసనసభ నియోజకవర్గం

మార్చు

బలిజిపేట 1955, 1962లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజక వర్గం. తరువాత దీనిని ఉనుకూరు నియోజకవర్గంలో విలీనం చేశారు. ప్రస్తుతం పార్వతీపురం నియోజక వర్గంలో విలీనం చేశారు.

 • ఎన్నికైన శాసనసభ సభ్యులు:
 • 1955 - పెద్దింటి రామస్వామి నాయిడు.[2]
 • 1962 - వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయిడు.[3]

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం

మార్చు

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

విశేషాలు

మార్చు
 • చరిత్రకారుల పరిశీలనల రీత్యా, బలిజ శెట్టి జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు. కళింగ దేశంలో బలిజవారికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొన్ని వందల సంవత్సరాలనుండి బలిజిపేట ఉన్నది. తరతరాలుగా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, ధాన్యాలు, చింతపండు, తాళ్లు, దూది, ఆయుధాలు, నవరత్నాలు, ఏనుగులు, గుర్రాలు వంటివి శ్రీలంక, బర్మా, కాశ్మిరు, కాశీ, కర్ణాటక, గోలకొండ, చంద్రగిరి, విజయనగర, మలయాళ, తమిళనాడు, సింగపూరు వంటి స్వదేశ, పరదేశ, నానాదేశాలలోనూ సరుకులు రవాణాచేసి వాణిజ్యం చేస్తుండేవారు. పూర్వం వైశ్య వర్ణం గా గుర్తింపు కలిగి వాణిజ వైశ్యులు అని చెప్పబడేవారు. వణిజులే రానురాను బలిజలుగా మారింది. కుల పురాణ గ్రంధాలలో వ్రాయబడింది. మిరియాల, బండి, కూనిశెట్టి, ముత్యాల, పోలిశెట్టి, సింగంశెట్టి, బత్తుల, మద్దాల, చిమటా, గుమ్మళ్ల, మైగాపుల, గోపిశెట్టి, పగడాల, అల్లంశెట్టి, ఆకుల, ఆత్మకూరు, బాలుమూరి, అనిశెట్టి, బావిశెట్టి, చలవాది, దండు, దేవరశెట్టి, ఏనుగుల, కేతినీడి, తూము, అంగజాల, దంగుడుబియ్యం, గవర, వలవల, మారిశెట్టి, దేశంశెట్టి, రెడ్నం, చెలంకూరి, కటకంశెట్టి, పుప్పాల, మలిశెట్టి, నరహరిశెట్టి, నాగిరెడ్డి, డేగల, నల్లం, సూరిశెట్టి, పత్తి, గంధం, తిరుమలశెట్టి, కోలా, చోడిశెట్టి, మచ్చా, గునిశెట్టి, తెలగనీడి, కండి, గణపతి, కొత్తపల్లి, కత్తి, రాజనాల, గాజుల, ఉద్దండం, బరిగెడ, ఎర్రంశెట్టి, మద్దంశెట్టి, ఆదిమూలం, బండారు, యండమూరి, పసుపులేటి, పోతురెడ్డి, బలిజరెడ్డి, వెలిదే, ముప్పిడి, బైరిశెట్టి, ఇందుగుల, కమ్మిలి, తోట, ఆనాల, మహదాసు, బయ్యవరపు, చింతలపూడి వంటి బలిజశెట్టి కుటుంబాలు బొబ్బిలి వద్ద ఉండే ఈ బలిజపేటలో ఉంటూ రాష్ట్రమంతా బొబ్బిలి బలిజలని కళింగబలిజలని పేరుగడించారు. వీరిలో చాలామంది గొప్పగొప్ప వీరులు ఉన్నారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలలో కూడా వచ్చిన చాలామంది బలిజ వీరులను ఇక్కడే నిలిపేను. కొందరు 17వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందడం బలిజవీరుల వీరత్వానికి నిదర్శనం. బలిజవీరుల పేరుమీద పాత బొబ్బిలి కోటనందు ఒక బురుజుకు బలిజవారి బురుజు అని పేరుండేదని ఇప్పటికి పెద్దలు తెలుపుకోవడం ఉంది. వీరు తమకే అర్ధమయ్యే ప్రత్యేక భాషలో మాట్లాడుకునేవారు. ఈ బలిజశెట్టి కుటుంబాలవారు కులవృత్తి వ్యాపారములు చేసుకొనుచు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, బర్మా, సింగపూర్ వంటి ప్రాంతాలకు చేరారు. గౌరీదేవిని కులదైవంగా ఆరాధిస్తారు, గణపతి, తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారు గలదు. వీరి వివాహపద్దతులు కూడా స్థానికులకన్నా కొన్ని వైవిధ్యమైన పద్దతులలో ఉంటాయి.
 • శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 3 కి.మీ. దూరంలోని నారాయణపురం గ్రామంలో ఉంది. ఇది బహు పురాతనమైందిగా 10 వ శతాబ్దంలో కళింగ రాజులచే నిర్మించబడింది.[4]
 • ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కలదు.[5]
 • ఆంధ్రా బ్యాంకు శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంక్ శాఖ, తపాలా కచేరి ఇక్కడ ఉన్నాయి.

గ్రామంలో ప్రముఖులు

మార్చు

అంగజాల జగన్నాథయ్య

మార్చు

అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. ఇతని స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు.ఇతని తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య, ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు.ఇతని బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. చదవటం కోసం బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివాడు.1952 లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నాడు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అతని అన్న కృష్ణమూర్తి చనిపోవడంతో చదువు ఆపి, తండ్రి వ్యాపార విషయాలలో ఇతనుకేంద్రీకరించాడు. జగన్నాథయ్య బావమరుదులు మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య, భరతారావు కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం, కమిషన్ కోసం క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేసేవారు.

మూలాలు

మార్చు
 1. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
 2. "Election Commission of India-1955 results" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-01-16.
 3. "Election Commission of India-1962 results" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-01-16.
 4. Jistor:Narayanapuram-A Tenth Century site of Kalingas
 5. "School Information System of Department of School Education". Archived from the original on 2007-09-28. Retrieved 2008-01-16.

వెలుపలి లంకెలు

మార్చు