శ్రీహరి బొడ్డునుండి బ్రహ్మ జన్మించాడు.ఈ బ్రహ్మ కుమారుడు అంగీరసుడు. [1]ఇతను తండ్రి ఆదేశానుసారం తపస్సు ప్రారంభించాడు.అంగీరసుడు దివ్వ తేజోసంపన్నుడు. తపశ్శక్తిచే ఇంకనూ తేజస్సు సంపాదించాడు. అంగీరసునకు సర్వశక్తులు లభించాయి. అయినా నిగర్విగానే సంచరించాడు. అతడు లబ్ధుడు కాదు, సర్వసంగ పరిత్యాగి. త్యాగాలలోనే సంతోసముందని గ్రహించాడు.[2]

అంగీరిస మహర్షి
రాణి చోళాదేవి అంగీరస మహర్షితో ఉన్న చిత్రం]]
దేవనాగరిअंगिरो महर्षि
అనుబంధంహిందూ ఋషులు

జీవిత విశేషాలు

మార్చు

ఆ అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసుకున్నాడు. శ్రద్ధా అంగీరసులను దేవతాగణాలు ఆశీర్వదించాయి. అత్తమామల ఆశీస్సులు గొని ఈ నూతనదంపతులు తమ ఆశ్రమానికి వెళతారు.ప్రశాంతంగా గృహస్ధ జీవితాన్ని గడుపుతుంటారు. కాలక్రమంలో ఆ దంపతులు ఏడుగురు కుమారులకు, ఏడుగురు కుమార్తెలకు జన్మనిస్తారు. వారివల్ల అంగీరసుని వంశం పెరిగి విశ్వమంతా ప్రాకింది.[3]

ఇదిలా ఉండగా దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మాలు నిర్వర్తింపక రహస్యముగా ఏకాంత వాసం చేయసాగాడు.ఈ విషయమును దేవతలు బ్రహ్మకు తెలియజేస్తారు. బ్రహ్మ అంగీరసుని పిలిపించి అగ్నిహోత్రుని విధులను నిర్వహించమని ఆదేశిస్తాడు.తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి అంగీరసుడు అగ్నిదేవుని విధులు నిర్వర్తిస్తూ, అగ్ని లేని లోపం తీరుస్తున్నాడు. అగ్నిదేవుని మరచి అంగిరసుని పూజిస్తున్నారు. దేవతా గణాలు ఆ విషయం అగ్నిహోత్రునకు తెలియజేయగా తనకు నామరూపాలుండవని గ్రహించి అంగిరసుని వద్దకు వచ్చి తన పనులు తానే నిర్వహించగలనని పలుకుతాడు. అంగీరసుడు అంగీకరించి అగ్నిహోత్రునే ఆ విధులును తిరిగి నిర్వర్తించమంటాడు, అగ్ని సంతసించి అంగీరసునకు ద్వితీయాగ్ని స్ధానమిచ్చి సత్కరిస్తాడు. అంతే కాదు అంగీరసుని కుమారుడగు బృహసృతికి తృతేయాగ్ని స్దానం ఏర్పరిచాడు. అది అంగీరసుని ఘనతకు నిదర్శనం.

పూర్వకాలాన చిత్రకేతుడను రాజు ఉన్నాడు.అతడు శూరసేన దేశమును పాలిస్తుంటాడు. సర్వసంపదలు గల ఆ రాజుకు సంతానం లేదు. సంతానహీనుడైన ఆ రాజు శాంతిలేని జీవితం గడుపుతుంటాడు. ఒకనాడు అంగిరసుడు ఆ రాజు సందర్శనార్ధం వచ్చాడు. చిత్రకేతుడు ఆ మహర్షిని ఆదర్శపూర్వకంగా ఆహ్వానించి, భార్యవహితుడై సకల మర్యాదలతో సేవిస్తాడు. మహర్షి సంతసించి రాజు సంతానహీనుడని గ్రహించి పుత్రకామేష్టి చేయించి, పట్టమహిషియగు కృతద్యుతి గర్భం దాల్చునట్లు చేస్తాడు. రాజు పరమానందభరితుడైతాడు. మాసములు నిండగా ఆమె ఒక కుమారుని కంటది, కానీ తక్కిన రాణులు ఈర్ష్యతో ఆ బిడ్డకు విషమిచ్చి చంపుతారు రాజు దు:ఖం పెరిగింది.ఆ బిడ్డ మరణం దంపతులును మరింత దు:ఖంలోకి తీసుకువెళ్లింది.ఆ విషయం అంగీరసునకు తెలిసింది. అతను నారద మహర్షిని వెంటబెట్టుకుని చిత్రకేతుని వద్దకు వస్తాడు. పుత్రశోకంతో కుమిలిపోయే ఆ రాజదంపతులను సమీపించి చావు పుట్టకలు జీవికి సహజమని అందుకై విచారింపరాదని ధైర్యం చెప్పి తత్వభోద చేస్తాడు. అనంతరం రాజు వద్ద సెలవు తీసికొని తిన్నగా బ్రహ్మలోకం చేరుకుంటాడు. అంగిరసుడు ఒకప్పుడు కశ్యపమహర్షి వలన పుణ్యక్షేత్రాల మహిమ నెరిగి గౌతమమహర్షి వలన వాటి ప్రభావమును తెలిసికొని వరుసగా చంద్రభాగ, హిరణ్యబిందు, ఇంద్రతోయ, కరతోయ, అపాంహ్రదం, మహాశ్రయ, భృగుతుంగ, కన్యాకూప, సుందరికాహ్రద, వైమానిక, విపాశ, కాళాకాశ్రమం, ద్రోణశర్మ పదం, శరస్తంభం, దేవరారువనం, చిత్రకూటం, జన్మస్ధానం,శ్యామాశ్రం, కౌశికవాల, మతంగ వాపిక, నైమికం, ఉత్పలావనం, వైవస్వతి, లౌహిత్య, రామహ్రదం, మహాహ్రాద, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమం, కుల్య, ఆర్షి సేవశ్రమం, ధర్మారణ్యం, బ్రహ్మసరస్సు మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి వాటిని గురించి గౌతములకు తెలిపి అంగిరసుడు ఆనందిస్తాడు.

సప్తర్షి పత్నులకు శాపం

మార్చు

ఒకప్పుడు అగ్ని, సప్తర్షి పత్నులను మోహిస్తాడు.ఆ విషయం అంగీరసుడు గ్రహించి అగ్నిని, సప్తర్షి పత్నులను శపిస్తాడు.అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని, సప్తర్షిపత్నులను బ్రాహ్మణుల యింట సౌందర్యవతులై జన్మించమని శపించాడు.శౌనకుడు అంగిరసుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యను బోధించమని కోరగా అంగీరసుడు సవివరముగా ఉపదేశిస్తాడు.ఈ విషయములు ముండకోపనిషత్తునందు ప్రతిపాదింపడ్డాయి. అంగీరసుడు స్మతికర్తకారులో ఒకడుగా పరగణింపబడ్డాడు. అతను బోధించిన ధర్మవిషయాలు అంగిరస స్మృతియను పేర ప్రసిద్ధికెక్కింది. అంగీరసుని మహర్షులందరు స్తుతించారు. అంగిరసులు అధర్వణ వేదద్రష్టలు.వారు ధర్మ పూర్ణమాన యజ్ఞమును చేసి స్వర్గం పొందారు.వారి యజ్ఞఫలమును భూలోకకాసులకు ధారపోసారు. అంగిరసులు దేవతాతుల్యులు, ఆదిత్యులు. అంగీరసులకు భూమిని దానం చేశారు.బ్రహ్మసృష్టిలో మొదటివారు అంగిరసులు.వారు రాజులకు పురోహితులుగా ఉండేవారు.ఉపనిషత్తులలో అంగీరసుల ప్రస్థాపన గలదు. ఆత్మ అవినాశియని అంగీరసులు తెలియజేశారు. ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు అంగిరసులే.

మూలాలు

మార్చు
  1. Dalal, Roshen (2010). Hinduism: An Alphabetical Guide (in ఇంగ్లీష్). Penguin Books India. ISBN 978-0-14-341421-6.
  2. Inhabitants of the Worlds Mahanirvana Tantra, translated by Arthur Avalon, (Sir John Woodroffe), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other sapta-rshi. In the present manvantara the seven are Kashyapa, Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.
  3. Brough, John (2013-09-26). The Early Brahmanical System of Gotra and Pravara: A Translation of the Gotra-Pravara-Manjari of Purusottama-Pandita (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-1-107-62398-9.

ఇతర లింకులు

మార్చు