అంజలి అమీర్ (మలయాళం: അഞ്ജലി അമീർ; 1995 నవంబరు 4) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె 2016లో మమ్ముట్టి నటించిన పేరంబులో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది.[1] ఆమె భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్‌ హీరోయిన్‌.[2] ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ భాషల్లో నటిస్తుంది. అమ్ము (2022) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

అంజలి అమీర్
జననం
జంషీర్

1995 నవంబరు 4
తామరస్సేరి, కోజికోడ్‌
జాతీయతఇండియన్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం

బాల్యం, విద్య మార్చు

అంజలి అమీర్ కేరళ రాష్ట్రం కోజికోడ్ సమీపంలోని తామరస్సేరి అనే పట్టణంలో జన్మించింది. ఆమె జంషీర్ అనే అబ్బాయిగా పుట్టింది. అయితే ఆమె యుక్తవయసులో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిగా స్త్రీగా మారిపోయింది. తను హయ్యర్ సెకండరీ విద్యను తామరస్సేరిలోనే పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్ళింది. అక్కడ ఆమె బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ పట్టా పొందింది.

కెరీర్ మార్చు

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అంజలి అమీర్ తమిళ దర్శకుడు రామ్ దర్శకత్వం వహించిన పేరంబు (2018) చిత్రంతో సినీరంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన నటించి ఆమె మలయాళ, తమిళ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఈ చిత్రంతోపాటు సువర్ణ పురుషన్ (2018), అమ్ము (2022) చిత్రాలతోనూ ఆమె ప్రసిద్ధి చెందింది. అమ్ము సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైయింది.

అంతేకాకుండా అంజలి అమీర్ మలయాళ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో - మొదటి సీజన్ ద్వారా ప్రాచుర్యం పొందింది. ట్రాన్స్‌జెండర్ మోడల్ అయిన అంజలి అమీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి ప్రవేశించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఆమె దురదృష్టవశాత్తు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. షోలో పాల్గొనగలిగినందుకు తన కమ్యూనిటీకి దక్కిన గుర్తింపు అని షోలో ఆమె పేర్కొంది.

2022లో విడుదలకు సిద్ధంగా ఉన్న దేవప్రసాద్ నారాయణన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం బెర్నార్డ్ లో అంజలి అమీర్, అప్పని శరత్ సరసన నటించింది.

మూలాలు మార్చు

  1. Sakshi (18 May 2018). "షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పేరంబు". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  2. "101 India's video on first transgender actress Anjali Ameer - Sakshi". web.archive.org. 2022-11-24. Archived from the original on 2022-11-24. Retrieved 2022-11-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)