అమ్ము 2022లో తెలుగులో రూపొందుతున్న ఎమోషనల్ థ్రిల్లర్‌ సినిమా. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కల్యాణ్‌ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ సినిమాకు చారుకేష్‌ శేఖర్‌ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 6న, ట్రైలర్‌ను అక్టోబర్ 11న విడుదల చేసి[1] సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 19న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

అమ్ము
దర్శకత్వంచారుకేష్‌ శేఖర్‌
నిర్మాతకల్యాణ్‌ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం
తారాగణంనవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి, బాబీ సింహ
ఛాయాగ్రహణంఅపూర్వ అనిల్ శాలిగ్రాం
సంగీతంభరత్ శంకర్
నిర్మాణ
సంస్థ
స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2022 అక్టోబర్ 19 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రవి (నవీన్ చంద్ర) పోలీస్ ఆఫీసర్ అమ్ము (ఐశ్వర్య లక్ష్మి)తో వివాహం జరుగుతుంది. అమ్ము అతనితో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కలలు కంటుంది. కొన్నాళ్ల పాటు వాళ్లిదరు అన్యోన్యంగా కాపురం చేసినప్పటికీ కోపిష్ఠిన అయినా రవి కారణంగా గొడవలు మొదలై ఒక్కసారి అమ్ము పై చెయ్యి చేసుకోవడంతో రవి వైఖరితో విసిగిపోయిన అమ్ము తన భర్తపై తిరిగి పోరాడాలని నిర్ణయించుకుంటుంది. భ‌ర్త‌కు బుద్ధిచెప్పేందుకు స‌రైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న అమ్మ‌కు ప్ర‌భుదాస్‌తో (బాబీ సింహ‌) ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌భుదాస్ ఎవ‌రు? అమ్ముకు అత‌డు ఏ విధంగా స‌హాయ‌ప‌డ్డాడు? ఈ క్రమంలో అమ్ము ఎదుర్కొన్న పరిస్థితులేంటి ? తన భర్తకు గుణపాఠం చెప్పిందా లేదా ? ఆమె జీవిత పోరాటం ఎలా ముగిసింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
  • నిర్మాత: కల్యాణ్‌ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చారుకేష్‌ శేఖర్‌
  • సంగీతం: భరత్ శంకర్
  • సినిమాటోగ్రఫీ:అపూర్వ అనిల్ శాలిగ్రాం
  • మాటలు : పద్మావతి మల్లాది

మూలాలు మార్చు

  1. V6 Velugu (11 October 2022). "'అమ్ము' ట్రైలర్ విడుదల". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "అక్టోబర్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న 'అమ్ము'." 11 October 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
  3. "'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? సినిమా ఎలా ఉందంటే?". 19 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.