అంజలి ముఖర్జీ బయోఫిజిక్స్ శాస్త్రవేత్త. ఈమె పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీనదీతీరంలో ఉన్న చంద్రనగోర్ అనే ఫ్రెంచ్ టౌన్‌షిప్పులో జన్మించింది.

అంజలీ ముఖర్జీ
అంజలీ ముఖర్జీ
జననం
చంద్రనగోర్, పశ్చిమ బెంగాల్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

బాల్యం, విద్య

మార్చు

ఆమె భూస్వామ్యజమీందారి కుటుంబంలో జన్మించింది. నాయనామ్మ, పెదమ్మ, అమ్మ, సోదరుడు, ఇద్దరు సహోదరిలతో జీవితం సాగింది. ఆమె కుటుంబం విద్యకు ముఖ్యత్వం ఇచ్చిన కారణంగా ఆమె విద్యాభ్యాసం ఫ్రెంచ్ కాన్‌వెంట్ పాఠశాలలో సాగింది. ఆ పాఠశాల‌ ఆవరణలో ఇతర పలు పాఠశాలలు, కాలేజి, చర్చి, ఫ్రెంచ్ ప్రజలు ఉన్నారు. ఆమె సెయింట్. జోసెఫ్ కాన్వెంటులో జూనియర్, సీనియర్ కేంబ్రిడ్జ్ కోర్సులు పూర్తి చేసింది. జూనియర్ కోర్సులో ఆమె హిస్టరీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలతో గణితం, భౌతికం ప్రధానాంశాలుగా తీసుకుంది. గణితం, ఆరోగ్యసంరక్షణ, భౌతికశాస్త్రాల మిశ్రితాధ్యయనంలోఆమెకు అభిరుచి మెండు. ఆర్థమెడిక్, జామెంట్రీ సమస్యలను పరిష్కరించడాన్ని ఆమె అధికంగా ఇష్టపడింది.

చదువులో ఆటంకం

మార్చు

ఆమె తల్లికి 11 వ సంవత్సరం వివాహం అయింది. ఆమె తండ్రి ద్వారా మాతృభాషను నేచుకున్నది. ఆమె భర్తతాతగారి ప్రభావం ఆమె మీద ఉన్నదని ఆమె కథనాలద్వారా తెలుస్తుంది. ఆమె జూనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలకు ముందుగా ఆమెకు వివాహం జరగడంతో ఆమె జీవితంలో అలజడి రేగింది. వివాహానంతరం ఆమె నివాసం కొలకత్తాకు మారడం ఆమె విద్యకు ఆటంకం కలిగించింది. పిల్లలను కనడం, ఇతర విచారకరమైన పరిస్థితులు ఎదురుకావడం, కుటుంబజీవిత బాధ్యతల వలన చక్కగా సాగుతున్న ఆమెవిద్యాపయనంలో ఆటంకాలు కాలు ఎదురైయ్యాయి. అయినప్పటికీ మద్య కాలలో లభించిన 5-6 సంవత్సరాల కాలం వృధాచేయకుండా ఇంటివద్దనే పండిట్ శివప్రసాద్ భట్టాచార్య వద్ద సంస్కృతం అభ్యసించింది. సంస్కృతం ఆమెకు కొత్తలోకాల అద్భుత సౌందర్యద్వారాలను తెరిచింది. సంస్కృత అధ్యయనం ఆమెకు మహత్తర నిధిలా జీవితమంతా సహకరించింది.

విద్య కొనసాగింపు

మార్చు

ఆమె సోదరుడు ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్స్‌లో హానర్స్ చేయడానికి కొలకత్తా వచ్చి ఆమె ఇంట బసచేయడంతో ఆమెలోని విద్యాతృష్ణ తిరిగి మేల్కొన్నది. ఆమె హిస్టరీ (చరిత్ర), జాగ్రఫీ (భౌగోళికం), గణితం, ఆంగ్లం, బెంగాలీ, సంస్కృతం అంశాలతో ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పరీక్షలలో మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలైంది. ప్రెసిడెన్‌సీ కళాశాల స్త్రీలను ఇంటర్మీడియట్ తరగతిలో అనుమతించదు కనుక ఆమె ఫిజిక్స్ (భౌతికశాస్త్రం), కెమెస్ట్రీ (రసాయనిక శాస్త్రం), గణితం అరియు అదనంగా ఫ్రెంచ్ భాష ప్రధానాంశాలతో " లొరెటో కళాశాల "లో ఇంటర్మీడియట్‌లో చేరింది. కాలేజీలో ప్రయోగశాలలు (లబొరేటరీ) నిరాడంబరంగా ఉన్నా ఉపాద్యాయుల కృషి వలన ఆమెకు సైన్స్ ఇష్టాంశంగా అయింది. అమె సోదరుని సహకారంతో విశ్వవిద్యాలయం పరీక్షలలో మొదటితరగతిలో ఉత్తీర్ణురాలైంది. తరువాత ప్రెసిడెంసీ కాలేజులో విద్యను కొనసాగించడానికి ఆమెకు అనుమతి లభించింది. ఆమె కుంటుంబ బాధ్యతలను సమస్యలను పరిష్కరించుకుంటూనే విద్యాభ్యాసంలో ముందుకుసాగింది.

రీసెర్చ్, ఉద్యోగం

మార్చు

కాలేజీలో కె.సి.కర్, ఆర్.ఎల్. సేన్ గుప్తా, పి.సి. ముఖర్జీ, పి.సేన్, పి.సి. భట్టాచార్య, ఎస్.ఎన్.బోస్, ఎం.ఎన్ సాహా, బి.డి. నాగ్ చౌదరి, ఎస్.ఎన్. ఘోషల్ , ఇతరుల వంటి ఉన్నత స్థాయి ఉపాద్యాయుల వద్ద ఆభ్యసించడం అదృష్టమని ఆమె వ్రాతలద్వారా తెలుపింది. ఆమె ఎం.ఎస్.సి పూర్తిచేసిన సమయంలో ప్రొఫెసర్ బోస్ పదవీవిరమణ చేసాడు. ఎం.ఎస్.సి స్పెషల్ పేపర్లో ఆమె " న్యూక్లియర్ ఫిజిక్స్‌ను ఎంచుకున్నది. న్యూక్లియర్ ఎనర్జీ దుష్ప్రభావం గురించి శాస్త్రఙలు ఇతరులు జాగారూకతతో చర్చలు సాగిస్తున్న కాలమది.

1945లో హిరోషిమా, నాగసాకి ల మీద అణుబాంబు వేయబడింది. తరువాత బయో ఫిజిక్స్‌కు ప్రపంచమంటా ముఖ్యత్వం ఇచ్చిన కారణంగా ఇంస్టిట్యూట్‌లో సరికొత్తగా బయోఫిజిక్స్ అనే రీసెర్చ్ ఆంశం ప్రారంభించబడింది. " ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ "లో " బయోఫిజిక్స్ " విభాగం తెరవడానికి ప్రొఫెసర్ ఎం.ఎన్ గుప్తా ప్రయత్నించి విజయం సాధించారు. ఎన్.ఎన్ దాస్‌గుప్తా కాస్మిక్ రే విభాగానికి హెడ్‌గా నియమించబడ్డాడు. 1957లో దాస్‌గుప్తా పర్యవేక్షణలో ఆమె రీసెర్చ్ అధ్యయనం ఆరంభమైంది. టీచర్‌గా, శాస్త్రఙడుగా, మానవుడిగా దాస్‌గుప్తా మార్గదర్శకత్వం ఆమెను మరింత ప్రభావితం చేసింది. 1559లో ఆమె మొదటి పరిశోధనా పత్రం సమర్పించి విజయం సాధించింది. దాస్‌గుప్తాగారి మీద జీవితాంతం ఆమెకు కృతజ్నతాపూర్వక గౌరవం నిలిచిపోయింది.

రాక్‌ఫెల్లర్ ఇనిస్టిట్యూట్‌

మార్చు

1960లో ఆమె పి.హె.డి చేస్తూ భర్తతో (బయాలజిస్ట్ ప్రొఫెసర్ శివతోష్ ముఖర్జీ) రాక్‌ఫెల్లర్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్ళింది. తరువాత కొన్నిమాసాలకు ఆమె స్లోన్ కెటరింగ్ ఇనిస్టిట్యూట్‌కు కేన్సర్ రీసెర్చ్‌కు (బయోఫిజిక్స్‌లో అంతర్భాగం) వెళ్ళింది. వీసా సమస్యల కారణంగా రీసెర్చ్ కొంతకాలం ఆగిపోయింది. అయినా డాక్టర్ లాఫిన్ అక్కడిడేటా వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అది తరువాత ఆమె సాగించిన పరిశోధనలకు ఎంతగానో ఉపకరించింది. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె థిసీసును సమర్పించి డాక్టరేటు పొందింది. తరువాత ఆమె సహ ఇంస్టిట్యూట్ లో ఉద్యోగబాధ్యతలు స్వీకరించింది.

ఇతరత్రా కృషి

మార్చు

1972లో ఆమె భర్త ఢిల్లీలో ఉన్న జె.ఎన్.యు స్కూల్ ఆఫ్ సైన్సెస్ లో చేరాడు. ఆమె సహ ఇంస్టిట్యూట్ ఉద్యోగం కొనసాగిస్తూ జె.ఎన్.యు స్కూల్ ఆఫ్ సైన్సెస్ లో విజిటింగ్ ఫెలో గా బయోఫిజిక్స్ బోధించింది. 1974లో " స్కూల్ ఆఫ్ ఎంవిరాన్మెంటల్ సైంసెస్ " స్థాపించబడింది. డీన్ ప్రొఫెసర్ ఎస్.ఎన్ బిస్వాస్ మరికొందరు సహౌపాద్యాయులతో కొత్తగా స్థాపించబడిన స్కూలు పాఠ్యాంశాలు రూపొందించడానికి విశేషకృషి చేసింది. ఎస్.ఇ.సి సరైన మార్గంలోకి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఉద్యోగ బాధ్యతల వలన రీసెర్చ్ అధ్యయనం మద్యలో ఆగింది. తరువాత ఆమె రీసెర్చ్ డ్రగ్ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్స్ మీద కేంద్రీకృతమైంది. 1991లో జె.ఎన్.యు నుండి పదవీవిరమణ తరువాత ఆమె తిరిగి కొలకత్తాకు వెళ్ళింది. 1993లో ఆమె భర్తను కోల్పోయింది. తరువాత ఆమె అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ ఇంస్టిట్యూట్ లో అంతర్భాగమైన " శివతోష్ ముఖర్జీ సైన్స్ సెంటర్ " నిర్వహణాబాధ్యతను చేపట్టింది.

వెలుపలి లింకులు

మార్చు

ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి