పశ్చిమ బెంగాల్

భారతీయ రాష్ట్రం
(పశ్చిమ బెంగాల్‌ నుండి దారిమార్పు చెందింది)

పశ్చిమ బెంగాల్, భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం , వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

పశ్చిమ బెంగాల్
Howrah Pano 3.jpg
Kolkatatemple.jpgBiswa Bangla Gate.jpg
Tea garden in dooars.jpgHAZARDUARI - PALACE.jpg
Digha Sankarpur 2Arnab.jpgRoyal Bengal Tiger walking down Mangrove Island in Sundarbans 3.jpg
Darjeeling.jpg
పశ్చిమ బెంగాల్ ప్రదేశాలు (పై నుండి): కోల్‌కాతా స్కైలైన్,
కోల్‌కాతా సమిపంలో దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి,
డార్జిలింగ్
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉనికి
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉనికి
దేశం భారతదేశం
అవతరణ26 జనవరి 1950
రాజధానికోల్‌కాతా
  • అతిపెద్ద ఊరు
కోల్‌కాతా
జిల్లాలు
ప్రభుత్వం
 • గవర్నర్జగ్దిప్ ఢంకర్ (భారతీయ జనతా పార్టీ)[1]
 • ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్)
 • పశ్చిమ బెంగాల్ శాసనసభపశ్చిమ బెంగాల్ శాసనసభ (295)
 • ఉన్నత న్యాయస్థానంకోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం
 • ప్రధాన న్యాయమూర్తులుతొట్టతిలి బి. రాధకృష్ణన్
విస్తీర్ణం
 • మొత్తం88,752 km2 (34,267 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు13వ స్థానం
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం9,13,47,736
 • ర్యాంకు4 వ ర్యాంకు
 • సాంద్రత1,029/km2 (2,670/sq mi)
పిలువబడువిధం (ఏక)బెంగాలీ జనాభా
జి.డి.పి (2018–19)
 • మొత్తం11.77 లక్ష కోట్లు (US$150 billion)
 • తలసరి ఆదాయం1,09,491 (US$1,400)
భాష
 • అధికారిక
కాలమానంUTC+05:30 (ప్రామాణిక కాలమానం)
ISO 3166 కోడ్IN-WB
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుWB
HDI (2017)Increase 0.637 (medium) ·21 వ ర్యాంకు[5]
అక్షరాస్యత (2011)77.08%[6]
లింగ నిష్పత్తి (2011)(పురుషులు) 1000:950 (స్తీలు) [7]
జాలస్థలిఅధికారక వెబ్సైట్
^* 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు
Symbols of పశ్చిమ బెంగాల్
Emblem
Emblem of West Bengal.svg
అశోక స్తంభం, బెంగాలి అక్షరం
Language
Bengali.svg
బాంగ్లా & ఆంగ్లం
Bird
కింగ్ఫిషర్
కింగ్ఫిషర్
Flower
పారిజాతం
పారిజాతం పువ్వు
Tree
ఆల్స్టోనియా
ఆల్స్టోనియా
River
పశ్చిమ బెంగాల్ లొని, బల్లి పైన తీసిన హుగ్లీ నది యొక్క వైమానిక చిత్రం
హుగ్లీ నది,
Sport
కాల్బంతి
ఫుట్‌బాల్

చరిత్రసవరించు

సా.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దంనుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

 
1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

రాష్ట్రంసవరించు

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

వాతావరణంసవరించు

 
డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతంలో తీస్తా నది తీరం వెంట, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.

సంస్కృతిసవరించు

 
పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రంలోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
 
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

ప్రసిద్ధులైన వారుసవరించు

సాహితీ వేత్తలుసవరించు

సంగీతకారులుసవరించు

విజ్ఙాన వేత్తలుసవరించు

జాతీయోద్యమ నాయకులుసవరించు

రాజకీయ నాయకులుసవరించు

విప్లవనాయకులుసవరించు

సంఘసంస్కర్తలుసవరించు

తాత్వికులుసవరించు

ఆధ్యాత్మిక గురువులుసవరించు

కళాకారులుసవరించు

సినిమా కళాకారులుసవరించు

క్రీడాకారులుసవరించు

జనవిస్తరణసవరించు

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

విభాగాలుసవరించు

పశ్చిమ బెంగాల్ లో 2019 నాటికి 23 జిల్లాలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ జిల్లాలుసవరించు

క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AD అలిపురద్వార్ జిల్లా అలిపురద్వార్ 17,00,000 3,383 400
2 BN బంకురా జిల్లా బంకురా 35,96,292 6,882 523
3 BR పశ్చిమ బర్ధమాన్ జిల్లా అస‌న్‌సోల్ 28,82,031 1,603 1,100
4 BR పుర్బా బర్ధమాన్ జిల్లా బర్ధమాన్ 48,35,532 5,433 890
5 BI బీర్బం జిల్లా సూరి (బీర్బం జిల్లా) 35,02,387 4,545 771
6 KB కూచ్ బెహర్ జిల్లా కూచ్ బెహార్ 28,22,780 3,387 833
7 DD దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బాలూర్‌ఘాట్ 16,70,931 2,183 753
8 DA డార్జిలింగ్ జిల్లా డార్జిలింగ్ 18,42,034 3,149 585
9 HG హుగ్లీ జిల్లా హుగ్లీ-చుచురా 55,20,389 3,149 1,753
10 HR హౌరా జిల్లా హౌరా 48,41,638 1,467 3,300
11 JA జల్పైగురి జిల్లా జల్పైగురి 38,69,675 6,227 621
12 JH ఝర్‌గ్రామ్ జిల్లా ఝర్‌గ్రామ్ 11,36,548 3,038 370
13 KA కాలింపాంగ్ జిల్లా కాలింపాంగ్ 2,51,642 1,054 239
14 KO కోల్‌కతా జిల్లా కోల్‌కాతా 44,86,679 206.08 24,252
15 MA మల్దా జిల్లా ఇంగ్లీష్ బజార్ 39,97,970 3,733 1,071
16 MU ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపూర్ 71,02,430 5,324 1,334
17 NA నదియా జిల్లా కృష్ణానగర్ 51,68,488 3,927 1,316
18 PN ఉత్తర 24 పరగణాలు జిల్లా బరాసత్ 1,00,82,852 4,094 2,463
19 PM పశ్చిమ మేదినిపూర్ జిల్లా మిడ్నాపూర్ 50,94,238 9,345 1,076
20 PR పూర్భా మేదినిపూర్ జిల్లా తమ్లుక్ 44,17,377 4,736 923
21 PU పురూలియా జిల్లా పురూలియా 29,27,965 6,259 468
22 PS దక్షిణ 24 పరగణాల జిల్లా అలిపూర్ 81,53,176 9,960 819
23 UD ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్ 30,00,849 3,180 956

మూలాలుసవరించు

  1. PTI (20 July 2019). "Centre appoints four new Governors, Jagdeep Dhankar now in-charge of West Bengal". The Hindu (in Indian English). Archived from the original on 20 July 2019. Retrieved 20 July 2019.
  2. "Area, population, decennial growth rate and density for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Registrar General & Census Commissioner, India. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 26 జనవరి 2012.
  3. "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation, Government of India. 1 August 2019. Retrieved 16 September 2019.
  4. "Fact and Figures". www.wb.gov.in. Retrieved 30 March 2018.
  5. "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  6. "Sex ratio, 0–6 age population, literates and literacy rate by sex for 2001 and 2011 at a glance for West Bengal and the districts: provisional population totals paper 1 of 2011: West Bengal". Government of India:Ministry of Home Affairs. Archived from the original on 7 జనవరి 2012. Retrieved 29 జనవరి 2012.
  7. "Sex Ratio in West Bengal". Census of India 2011. Archived from the original on 27 ఫిబ్రవరి 2014. Retrieved 23 January 2020.

బయటి లంకెలుసవరించు