1974
1974 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1971 1972 1973 1974 1975 1976 1977 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
- ఆగష్టు 24: భారత రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ పదవిని చేపట్టాడు.
- సెప్టెంబర్ 1: ఏడవ ఆసియా క్రీడలు ఇరాన్ రాజధాని నగరం టెహరాన్‌లో ప్రారంభమయ్యాయి.
జననాలు
మార్చు- జనవరి 1: కట్టా శ్రీనివాసరావు, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
- జనవరి 27: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
- ఫిబ్రవరి 25: దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (మ.1993)
- ఏప్రిల్ 9: జెన్నా జేమ్సన్, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శృంగార తార.
- మే 25: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త.
- జూన్ 15: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (మ.2014)
- ఆగష్టు 5: కాజోల్, భారతీయ సినీ నటి.
- ఆగష్టు 13: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (మ.2024)
- ఆగష్టు 20: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.
- నవంబర్ 1: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.
- డిసెంబర్ 2: అపూర్వ, తెలుగు సినిమా నటి.
మరణాలు
మార్చు- జనవరి 4: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు, "భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
- ఫిబ్రవరి 4: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ బోస్
- ఫిబ్రవరి 11: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ. 1922)
- ఏప్రిల్ 18: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
- జూలై 18: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
- జూలై 24: జేమ్స్ చాడ్విక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఆగష్టు 7: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883)
- సెప్టెంబర్ 23: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
- అక్టోబర్ 2: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
- అక్టోబర్ 9: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
- నవంబర్ 11: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921)
- నవంబర్ 13: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
- నవంబర్ 25: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)
- నవంబర్ 27: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
- డిసెంబరు 15: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)