అంజాద్ సాబ్రి
అంజాద్ ఫరీద్ సాబ్రి (23 డిసెంబర్ 1970 – 22 జూన్ 2016) పాకిస్తానీ ఖవ్వాలీ సూఫీ గాయకుడు. సాబ్రి సోదరులు అన్న సూఫీ సంగీత బృందంలోని సభ్యుడైన గులాం ఫరీద్ సాబ్రి కుమారుడు. అంజాద్ సంగీత రంగంలోకి 12వ యేటనే అడుగుపెట్టి తండ్రితోపాటు ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. తన కెరీర్ లో, సాబ్రీ దక్షిణాసియాకు చెందిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఖవ్వాలీ కళాకారునిగా ఆవిర్బవించారు. ఆయన తరచుగా తన తండ్రి, తండ్రి సోదరుల ఖవ్వాలీ గీతాలను వినిపిస్తూండేవారు.[2] జూన్ 22, 2016న ఓ వ్యక్తి ఆయన లక్ష్యంగా చేసిన ఉగ్రవాద దాడిలో మరణించారు. అంజాద్ పాకిస్తానీ తాలిబాన్ గ్రూపు ఆయన హత్యను తామే చేశామని ప్రకటిస్తూ అందుకు దైవదూషణ కారణమని ఆరోపించింది.[3]
అంజాద్ ఫరీద్ సాబ్రి | |
---|---|
జననం | అంజాద్ ఫరీద్ సాబ్రి 1970 డిసెంబరు 23 [1] |
మరణం | 2016 జూన్ 22[1] లియాఖతాబాద్ పట్టణం, కరాచీ, పాకిస్తాన్ | (వయసు 45)
వృత్తి | ఖవ్వాలీ గాయకుడు, సంగీత కారుడు |
తల్లిదండ్రులు | గులాం ఫరీద్ సాబ్రి (తండ్రి) |
బంధువులు | మఖ్బూల్ అహ్మద్ సాబ్రి (బాబాయి) |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | సూఫీ సంగీతం |
వాయిద్యాలు |
|
సంబంధిత చర్యలు |
|
వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
జీవితం
మార్చు23 డిసెంబరు 1970న జన్మించిన అంజాద్ తన 9వ యేట తండ్రి వద్ద ఖవ్వాలీ సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. 1988లో తన 12వ ఏట వేదికపైన ప్రదర్శన చేయడం ప్రారంభించారు. భారత ఉపఖండంలోకెల్లా ప్రఖ్యాత ఖవ్వాలీ సంగీతకారునిగా పేరొందారు.
హత్య
మార్చు22 జూన్ 2016న అంజాద్ సాబ్రీని సాయుధులైన ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్ పై వచ్చి ఆయన లియాఖతాబాద్ పట్టణానికి ప్రయాణిస్తూండగా దాడిచేశారు. మోటారుసైక్లిస్టులు కాల్పులు ప్రారంభిండంతో సాబ్రి, ఆయన వద్ద పనిచేసే వ్యక్తి, ఆయన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సాబ్రిని తలపై రెండుసార్లు, చెవిపై మరోసారి కాల్చారు.[4][5] సాబ్రి సహా ముగ్గురు బాధితులను అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు.[6] ఆపైన కొద్దిసేపటికే సాబ్రి మరణించారు.
ప్రతిస్పందన
మార్చుటెలివిజన్, సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ఆయన హత్యపై ప్రతిస్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ - ప్రముఖ ఖవ్వాల్ అంజాద్ సాబ్రి, అతని సహచరులను కరాచీలో హత్యచేయడం దిగ్భ్రాంతికి గురించేసింది. ఇది శాంతి భద్రతలు, ఆదేశాల అమలు విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి వైఫల్యానికి ఫలితం అన్నారు. డాక్టర్ తాహిర్ ఉల్-ఖాద్రీ మాట్లాడుతూ అంజాద్ సాబ్రిపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా హృదయం బాధాతప్తులైన ఆయన కుటుంబంతో ఉంది అన్నారు. ఫఖార్-ఎ-ఆలం ఈ ఘటనపై స్పందిస్తూ అంజాద్ సాబ్రి తనకు, తన కుటుంబానికి రక్షణ కావాలని దరఖాస్తు చేసుకున్నా హోం శాఖ స్పందించలేదని ఆరోపించారు.[7] సమా టీవీ ప్రకారం లక్షలాది ప్రజలు సాబ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు [8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 అంజాద్ ఫరీద్ సాబ్రి
- ↑ Ali, Dawn.com | Imtiaz (2016-06-22). "Famed qawwal Amjad Sabri gunned down in Karachi". Retrieved 2016-06-23.
- ↑ "They killed him - The Express Tribune" (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-22. Retrieved 2016-06-23.
- ↑ Khan, Faraz (2015-05-03). "Amjad Sabri shot dead in Karachi - The Express Tribune". Tribune.com.pk. Retrieved 2016-06-23.
- ↑ "Renowned Pakistani singer Qawwal Amjad Sabri shot dead in Karachi". Firstpost. 2015-07-29. Retrieved 2016-06-23.
- ↑ "Renowned qawwali singer Amjad Sabri killed in Karachi gun attack: hospital sources". Dunya News. Retrieved 22 June 2016.
- ↑ Desk, Entertainment (2015-05-03). "Nation mourns Amjad Sabri's death - The Express Tribune". Tribune.com.pk. Retrieved 2016-06-23.
- ↑ "Amjad Sabri laid to rest amid sobs, tears". Samaa TV.