సూఫీ తత్వము

(సూఫీ నుండి దారిమార్పు చెందింది)

సూఫీ తత్వము (అరబ్బీ : تصوّف - తసవ్వుఫ్, పర్షియన్ భాష :صوفی‌گری సూఫీగరి, టర్కిష్ భాష : తసవ్వుఫ్, ఉర్దూ భాష : تصوف ) [1] : ఇస్లాం మతములో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[2] ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. భారతదేశంలోకి ఎందరో సూఫీ సన్యాసుల ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి మొదలైంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి సూఫీ వాదాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూఫీ శాఖలు (సిల్‌సిలాలు) భారతదేశంలో ప్రవేశించాయి. సాంస్కృతిక సమైక్యతకు సూఫీలు దోహద పడ్డారు.[3]

సూఫీ మతము

మార్చు

14 వ శతాబ్దములోని బాగ్దాదు రాజు ఆస్థానసభ్యులలో ఉస్మాన్ షా అనే ఆయన ఒకడుండేవాడు.ఇతడు లక్ష్మీపుత్రుడు, పండితుడు, జ్ఞాని. ఇతనికి భారతదేశం దర్సించాలని ఒక అవ్యక్త ప్రేరణ కలిగింది.వెంటనే తన రాజీనామా పత్రము తన ప్రభువు చేతికిచ్చాడు. రాజు నాయనా, భయాన పోవద్దని చెప్పారు. వినలేదు. సా.శ.1350లో భారతయాత్రకు ముగ్గురు మిత్రులతో పయానమైనాడు.స్నేహితులు కూడా ఇట్టి జ్ఞానమూర్తులే. మనము ఈశ్వర దర్శనార్ధము వెళ్తున్నాము మనకు ధనముతో పనిలేదు అని మన వెంట ఏమీ తీసుకు వెళ్ళద్దని నిర్ణయించారు.ఈవిధంగా వారంటా అరేబియా సముద్రంలో పడవలో బయలుదేరారు. కొంతదూరం వచ్చునప్పటికి పడవ మునుగుటకు సిద్ధమైనది. అప్పుడు ఉస్మాన్ షా మీలో ఎవరైనా డబ్బును దగ్గర ఉంచుకున్నారా అని ప్రశ్నించాడు. వారిలో ఒకడు నావద్ద ఒక బంగారు నాణెం ఉందని వాంకురిసే రోజు పనికివచ్చునని చెప్పగా దానిని ఉస్మాన్ షా పారివేయమని చెప్పగా అతను దానిని సముద్రంలోకి విసిరిన వెంటనే పడవ తేలడం మొదలయింది. ఈశ్వర సేవకులకు ఏశ్వరుడే ధనము. వాడే రక్షకుడు. ఈవిధంగా వారు అరేబియన్ సముద్రము దాటి సింధూ తీరం చేరారు.

సెహ్వాన్ అనే పట్టణంలో దిగారు. ఇక్కడి ముసల్మాన్ మతబోధకులు ఒక పాత్రనిండా పాలుపోసి వీరికి పంపారు. ఉస్మాన్ షా ఈపాత్ర తీసుకోక ఆపాలపైన ఒక పుష్పం ఉంచి తిప్పిపంపాడు.పాలవలె ఒకపాత్రలో మేముండే వాళ్ళము కామని జీవితప్రవాహమనే పాలమీద పుష్పం వలె తేలియాడే వారమని దీని మూలంగా ఉస్మాన్ షా తెలియపరిచాడు. ఇది సూఫీల మూల లక్ష్యం.సూఫీలకు సింధురాష్ట్రము పట్టుకొమ్మ.

సూఫీతత్వములకు ఉపనిషత్తు లభావములకు చాల దగ్గరపోలికలు ఉన్నాయి.ఉపనిషత్తుల ప్రభావమే వీరిని సూఫీలుగా మార్చిందని కొందరి అభిప్రాయము.సూఫీతత్వము పుట్టిన కాలంలో తెలుగుదేశంలో హరిహర మతములకు తీవ్ర కక్ష్య లేర్పడగా మహాజ్ఞాని అయిన తిక్కన హరిహర సమైక్యం బోధించాడు.సరిగా ఆకాలంలో ఉత్తర భారతభూమిలో హిందూ ముసల్మాన్ మతములకు తీవ్ర కక్ష్యలేర్పడినవి.అప్పుడు ఉన్నత జ్ఞానశిఖరములను అధిరోహించిన బ్రహ్మజ్ఞానులు సత్యమునకు అవధులులేవనీ ఈశ్వరుడు సమస్త మానవుల హృదయసీమలందు ఉన్నాడనీ బోధించారు.ఇట్టి వారిలో కబీరు ప్రముఖుడు.విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్కి సూఫీ మతంపై మిక్కిలి మక్కువ.ఉపనిషత్తులవలె సత్యాంవేషణకు ఏకత్వమునకు ప్రాధాన్యమిస్తుంది.

సూఫీ శబ్దము సఫానుండి పుట్టిందనీ, సఫా అనగా ఇంగ్లీషు శబ్దమైన సోఫా అనీ అర్ధము.ప్రవక్తలు జీవించిన రోజులలో మసీదుబైట ఉండే బల్లపైన కొందరు కూర్చొనేవారు.వీరు ముష్టికొరకు గాదు ఇట్లా కూర్చున్నది. అవధులులేని ఈశ్వరుని మసీదు నాలుగు గోడల మధ్య బంధిస్తునారని మౌనంగా నిరసన చూపించుట కట్లు కూర్చొనేవారు.వీరినే సూఫీలన్నారు. దీని భావమే కబీరు గానం చేసాడు.సఫా అనగా శుభ్రం చేయుట అని అర్ధము.హృదయమాలిన్యమును పరిసుభ్రము చేయుట.హిందూ మాతంలో (ఈశ్వరుడు)

గంధం బసవ శంకరరావు గారు చెప్పిన మాటలు

మార్చు
  • 'సూఫీ' అంటే 'కంబళి బట్ట' అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి 'సూఫీ' అని పేరొచ్చింది.'సూఫీ' అంటే- పవిత్రతకు, (భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం!

సూఫీ యోగి అంతర్దృష్టితో ధ్యానతత్పరుడై, సత్యాన్వేషకుడై ఉంటాడు.ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మలో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.ఆడంబరాలకూ దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలు.

సూఫీ తరీఖా

మార్చు
 
మౌలానా రూమి సమాధి, కోన్యా, టర్కీ
 
చైనా, కాష్గర్ లోని ఖోజా ఆఫాఖ్ సమాధి.

సూఫీ తరీఖాలు నాలుగు.

కొన్ని విశేషాలు

మార్చు
  • డబ్బు ముట్టుకోరాదు. పేదరికమే సుగుణం.
  • బ్రహ్మచర్యం తప్పనిసరి కాదు.ఆధ్యాత్మిక పురోగతికి, కుటుంబ జీవితం ఆటంకం కాదు.ప్రపంచాన్ని త్యజించి క్రియారాహిత్యంతో జీవించవద్దు. భౌతిక శ్రమతో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని అన్వేషించాలి. రైతులుగా, నేతపని వారుగా, కసాయి పనివారుగానైనా సరే శ్రమించాలి.
  • భగవంతుని పట్ల ప్రేమ, భక్తి ప్రపత్తులే మోక్షాన్ని ప్రసాదిస్తాయి.జీవాత్మ పరమాత్మతో సమైక్యమవ్వాలి. (వహదతుల్ వజూద్ ).
  • భగవంతునికి, మానవులకు మధ్య ప్రేమికుల సంబంధం కాకుండా యజమాని - బానిసల సంబంధం ఉండాలి. (వహదతుల్ షుద్ ) -- నక్షబందీ శాఖకు చెందిన షేక్ అహ్మద్ సర్హిందీ
  • మక్కా, గంగ మోక్షాన్ని ఇవ్వలేవు.అహాన్ని పరిత్యజించడమే మోక్ష మార్గము.-- బుల్లేషా .
  • శ్రీరాజ్ అనే హిందువును ముహమ్మద్ బిన్ తుగ్లక్ వజీరుగా నియమించాడు. మొఘలులు రాజపుత్రులను, మరాఠీలను ఉన్నత పదవుల్లో నియమించారు.
  • కాశ్మీర్‌ను పాలించిన ‘జైనులాబిదిన్ ’ హిందూ మతాన్ని ఆదరించాడు.
  • అక్బర్ అన్ని మతాలు సమానమే అన్నాడు.
  • హారతిని నిసర్ గా. దిష్టిని నజర్గా ముస్లింలు స్వీకరించారు. హిందువులను చూసి అత్యధిక ముస్లింలు బహుభార్యత్వాన్ని త్యజించి ఏకపత్నీవ్రతం అవలంబించారు.
  • జీవాత్మ, పరమాత్మ ఐక్యమవ్వాలనే అద్వైత భావనను సూఫీలు స్వీకరించారు. బెంగాల్‌లోని సూఫీ ముస్లింలు, సీతా, కాళీ వంటి హిందూ దేవతలను ఆరాధించారు.
  • సంస్కృతంలోని వైద్య రచనలను ‘తిబ్ - ఎ - సికిందరి’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
  • ముస్లింల నుంచి రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ‘జిచ్’ అనే క్యాలెండర్‌కు సంబంధించిన అంశాలను, ‘తాజిక్’ అని పిలిచే జ్యోతిష్య శాస్త్ర విభాగాన్ని హిందువులు స్వీకరించారు.
  • బదౌని రామాయణాన్ని పర్షియన్‌లోకి అనువదించగా, ముస్లిం పండితులు మహాభారతాన్ని ‘రమ్జానామా’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
  • అమీర్ ఖుస్రో భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తూ హిందీ భాషాభివృద్ధికి కృషి చేశాడు. కవిత్వంలో భారతీయ శైలి (సబక్ -ఇ - హింద్) ని ప్రోత్సహించాడు.పర్షియన్ సంగీత సంప్రదాయాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందింది. అమీర్ ఖుస్రో, జైపూర్ పాలకుడు హుసేన్ షా షర్కీ వంటి వారు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు.
  • ముస్లింలు భారతీయ వాస్తు కళలకు కమాన్, గుమ్మటం, మీనార్ (స్తంభాలు) లను జోడించారు. రంగురాళ్లను వినియోగించారు. ఉద్యాన కళను అభివృద్ధి చేశారు. బృందావనంలోని ఆలయాల్లో మొగల్ శైలి కనిపిస్తుంది. అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీలో హిందూ-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది.
  • ని ర్గుణ వాదుల్లో రామానందుడి శిష్యుల్లో కబీర్ ప్రసిద్ధుడు. ఆయన భగవంతుడిని రామ్, రహీమ్, అల్లా అన్నాడు..
  • కాశ్మీరులోలల్లా అనే శైవయోగిని ‘ఋషి’ ఉద్యమాన్ని నడిపారు. హిందువులు సూఫీ మహనీయుల సమాధులను దర్శించి నేటికీ ఆరాధిస్తున్నారు.
  • సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు. ‘అమృతకుండ’ అనే హర్షయోగ గ్రంథాన్ని పర్షియన్‌లోకి అనువదించుకున్నారు.నిజాముద్దీన్ ఔలియా యోగ సాధన చేసి సిద్ధుడు అయ్యాడు.
  • హృదయ ధ్యానమునకు ప్రార్థన, నామజపము, స్మరణ, మౌనము సాధనలు.నామజపంకన్నా స్మరణ చాలా శ్రేష్ఠమని వీరిభావన.మౌనము 2 రకాలు. 1.శారీరిక మౌనము 2. మానసికమౌనము. మౌనమునకుపాంగం ఏకాంతవాసం.శరీర మౌనము ప్రథమసోపానము.దీనికి మానసికమౌనమే గమ్యస్థానము.మౌనమే ఏశ్వరుని వాక్కు.
  • సూఫీముఖ్యులలో దర్యాఖాన్ ప్రముఖులు. వీరు మౌనము నుండి వాక్కు వస్తుందని అన్నారు.వాక్కు కన్నా శక్తి కలది మౌనమే అని వీరి అభిప్రాయము. మనస్సు బురద వంటిదని దానిని కదిలిస్తూ ఉంటే ఎప్పుడూ మలినంగానే ఉంటుంది.మనస్సు కదిలించకుండా ఉంటే, అది పరిశుభ్రమై ఆత్మజ్ఞాన సంపన్నమవుతుంది.అదే మౌనంగా ఉండడం.
  • వీరి మంత్రము ఓంకారము వలే ఉంటుంది. హూ అంటారు.దీనిని బ్రహ్మాండాక్షరమని వక్రాక్షమనీ అంటారు.సూఫీలు ధ్యాన సాధనకు దీనినే ఉపయోగిస్తారు.ఇది చీకటిలో దీపం వలె వెలుగుతుందని వీరి నమ్మకము.
  • ఈశ్వరుడు శరీరంలో బందీయై ఉన్నాడు.ఇతనిని పొందుటకు శరీరబంధములనుండి విముక్తుని చేయాలి.అందువలన శరీరమునకు బాధ తప్పదు.బాధవల్ల భగవంతుడు సన్నిహితుడవుతాడు.
  • తాను పోగొట్టుకున్నదాని గురుంచి హృదయం ఏడుస్తుంటే తాను కన్నదాని గురుంచి ఆత్మ నవ్వుతుంది. తీవ్రావేదన లేనిదే భగవానుడు దగ్గరకురాడని వీరి నమ్మకము.
  • సూఫీలు భగవానుని ప్రియునిగా భావించి ఆరాధిస్తారు.
  • సూఫీలు మాంసాహారము భుజించరు. సూఫీలో షిరాజ్ వైన్ ను తాగుతారు.పునర్జన్మ ఉందని నమ్ముదురు.

షాలటీఫ్

మార్చు

సూఫీ భక్తులలో ప్రముఖుడు షాలటీఫ్. ఈయన 1693 సం.లో జన్మించాడు.తండ్రి విద్యాభ్యాసమునకితనిని గురువు వద్దకు పంపాడు.గురువు అలీఫ్ అక్షరమును దిద్దమని అతనిచేత అనిపించాడు. తర్వాత బే అక్షరము వ్రాసి ఉచ్చరించమని చెప్పాడు.అతడు మాట్లాడలేదు గురువుగారు నోరూ చేయి చేసుకున్నారు.అతడు మాట్లాడలేదు.ఆలీఫ్ తర్వాత అక్షరం చెప్పమంటే అనలెదని తండ్రికి చెప్పినాడు.అలీఫ్ అంటే అల్లా అని అర్ధమని అల్లా తర్వాత ఇంకొకటి లేదని తండ్రి కొ చెప్పనాడు.తర్వాత అతడు బడికి వెళ్ళడం మాని వెసాడుఇ. ప్రకృతి పాఠశాలలోనే జీవిత విద్యను అభ్యసించాడు.ఆదేశ పాలకినికి తండ్రి గృహవైద్యుడు.పాలకుని కుమార్తెకు జబ్బుచేసింది.తండ్రిని పిలిపించగా తండ్రికి బదులుగా కుమారుణ్ణి పంపాడు.లటిఫ్ వెళ్ళి రోగినాడి పరీక్షించి ఈశ్వరుని హస్తంలో ఉనావారికి ఎన్నటికీ అపాయం ఉండదని అన్నాడు.రోగి నవయొవ్వని. ఆమె సౌందర్యమునకు ముగ్ధుడైనాడు.ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయమన్నాడు.ఆమె తల్లితండ్రులు ఒప్పుకోలేదు.ఆమెపై ప్రేమ ఈతనిని పిచ్చివానిగా చేసింది.తన సర్వస్వం వదిలి దేశదిమ్మరి అయినాడు.కొంతకాలం తిరిగి తిరిగి హింగ్లాజ్ పట్టణమునకు చేరుకున్నాడు.అక్కడ మర్మయోగులనాశృఅయించాడు.గురువులు ప్రణవాక్షరాన్ని ప్రసాదించారు. ప్రణవమంత్రం చీకటిలో తనకు వెలుగుగా ప్రసాదించిదనాడు లటీఫ్.అనేక కష్టములను భరించి ఇంటికి చెరుకున్నాడు.ఆలోగా ప్రియురాలు తనలోనే ఉన్నదని గ్రహించాడు.ఆతని అనిష్కల్మష ప్రేమను గ్రహించి పాలకుడు ఆతని కుమార్తెను ఆతనికిచాడు.ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారు.లటీఫ్ అప్పటికే భగవామృతం పూర్తిగా సేవించాడు.

లటీఫ్ త్యాగరాజు, అన్నమాచార్యులవంటి భక్తుడు. నిత్య మధురగాన సంకీర్తనలలో గడిపేవాడు.1747లోనో 1752లోనో ఈతను ఈశ్వరుని దర్శించి పరమపదించాడని ఈతని సూఫీతత్వ శిష్యులందురు.

దస్త్రం:Dil.gif
మనసులో అల్లాహ్ పేరు ముద్రించి వుంటుందనే విషయాన్ని సూచించే చిత్రం. ఖాదిరి అల్-మున్‌తహీ తరీఖాకు చెందిన విశ్వాసం.

సూఫీ కవిత్వం

మార్చు
  • తనకటుగాని, ఇటుగాని సైతానుకి ఎవరన్నా పరిశుద్ధంగా కనిపిస్తే ఓర్వలేక జ్వరంతో మంచమెక్కుతాడు దుష్టుడైనా సరే తనగడ్డి వామి తగలబడితే, ఇంకవాడు ఎవడింట్లోనూ దీపం వెలిగేటందుకిష్టపడడు -- దీవి సుబ్బారావు
  • నీలో ఉన్న ప్రతి భాగానికి ఒక రహస్య భాష ఉంది. నీ చేతులు, కాళ్లు నువ్వేం చేశావో చెబుతాయి.-- మౌలానా రూమీ
  • దిగుడుబావి నుండి ఏతంతో నీళ్లను పైకి తోడినట్లు పరుపుతో నీ కళ్లను నీటితో ఉబికిపోనీ నీ హృదయపు మాగాణి పొలంలో పచ్చటి చివురులు మొలకెత్తనీ కన్నీరు కావలిస్తే కన్నీరు కార్చేవాళ్లతో దయగా వుండు దయ కావాలిస్తే నిస్సహాయుల పట్ల దయ చూపు -- మౌలానా రూమీ
  • అల్లాను ప్రేమిస్తున్నావా?' అంటే ఔను అహర్నిశలూ మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? లేదు, అందుకు సమయం ఎక్కడిది?-- రబియా
  • పంచవన్నెల పింఛమే నెమలికి శత్రువు/ చాలా మంది రాజులు తలలు పోగోట్టుకోటానికి కారణం/ వారు తాల్చిన రత్నఖచిత కిరీటాలు -- హాఫిజ్ షీరాజీ.
  • సూఫీయోగి ఈ క్షణానికి చెందిన వారు. 'రేపు' అనటం సుతరామూ గిట్టదు.... ఫరీదుద్దీన్ అత్తార్.
  • మధుర మోహన విగ్రహం నన్ను మభ్యపరిచింది! ఆతని మత్తెక్కిన నయనాలు నన్ను మాయ చేసినవి! ఆదొంగ నాలోనే ఉన్నాడు, తెలియక దేశాలు తిరిగాను, ఆ విచిత్ర తస్కరుడు పైబట్ట అపహరించాడు!
  • అడవులు కొండలు తిరిగినానే మనసా, ఆతనిని గుర్తించలేకపోతినే మనసా! ఆతనిని సామాన్యంగా గుర్తించలేనే ఓ మనసా, ఆతని హృదయ నేత్రంతో కనలేవే ఓ మనసా!
  • ప్రతి ఉదయము సాయంకాలములందు చేసిన పాపాలకు పరితపిస్తాను నేను.నాస్థితిని తలచి గుండె పగిలి సిగ్గుపడతాను నేను. వీటి ఫలితాలు ఎటు నెట్టినను వాని భావం లోనే వుంటాను నేను. నీ దయలేనిది నా కష్టాలు గట్టెక్కవు సంతత దుఃఖాలు నా హృదయ శాంతి నీయవు నాహృదయం పంట పండించు నీవు! శాంతి ధామం చేరునట్లు దయలచు నీవు! ఆతని దయా సముద్రం అంతులేనిది నోరు హృదయం విప్పి చెప్పలేనిది. పాపాలు గంపలతో ఉన్నా పాపసాగరంలో తేలియాడుతున్నా ఆతడు చేయును పాపముల నన్నిటి సున్నా!
  • కరకు కరవాలమైనా మిత్రుడు వచ్చాడు.
  • ప్రపంచ దుఃఖపాల పడవద్దని చెప్పితిగా మనసా. అడవులు కొండలు విహారములు ఆనందించవద్దంటిని గదా మనసా! ప్రపంచమంతా ఏమిలేదు, ఎండమావి చెప్పితిగదా మనసా! సంసారం సముద్రంమీద తేలే బుగ్గని అంటినిగదా మనసా!
  • అత్యాశాపరులనుండి బైట పడలేవు నీవు, అశాంతినుండి బైటపడనివ్వరు వారు!
  • వూలు వస్త్రం లోపల సమస్త పాపములు దాగి వున్నవి వంచన, కపటము, అపాయములు అందులో మూగి వున్నవి! తెలుసుకొనవే మనసా!
  • రాజులకు రాజును నేను, నీవంటి దిగంబరిని కాను నేను, ప్రతిభాగం పగిలిఉన్నా, పదిలంగానే ఉన్నాన్నేను, ప్రతిమారాధకుణ్ణి అవిశ్వాసిని నేను, ముసల్మాన్ కాకయే మసీదుకు వెళ్తాను నేను!
  • కాబాకు వెళ్ళినా, కాశీకి వెళ్ళినా అందులో ఉన్నవి వానివే, కాబాలో ఉన్న నల్లరాయీ వానిదే, కాశీలో ఉన్న విగ్రహము వానిదే, విశ్వమంతటా వ్యాపించి ఉన్నది వానిదే!
  • అంతటా భగ్గున మంటలు మండుట చూస్తిని, అదే అన్ని వైపులా వ్యాపించుట చూచితిని, వెలుగు నాటకం ఆడుట చూస్తిని, దాని మూలం వేరే ఉన్నట్లు చూస్తిని! ప్రియుని ప్రేమ పొందితి నేను, అర్హతనునట్టి ఆతని వాత్సల్యం పొందితి నేను, పుట్టిన మొక్క పెరిగి పంట పండగనే, ప్రేమారామంలో ప్రేమ పుష్పం పొందితి నేను!

సూఫీ తత్వ ఆచరణా విధానాలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

సూఫీల జాబితా

మార్చు
 
హజ్రత్ షంస్ తబ్రేజ్

మూలాలు

మార్చు
  1. Qamar-ul Huda (2003), Striving for Divine Union: Spiritual Exercises for Suhraward Sufis, RoutledgeCurzon, pp. 1–4
  2. Trimingham (1998), p.1
  3. See:
    • Esposito (2003), p.302
    • Malik (2006), p.3
    • B. S. Turner (1998), p.145
    • "Afghanistan: A Country Study". Country Studies. U. S. Library of Congress (Federal Research Division). p. 150. Retrieved 2007-04-18.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-30. Retrieved 2016-11-01.

బయటి లింకులు

మార్చు
  • Sufism Articals Downloads and many
  • Sufism's Many Paths
  • Sufism in a Nutshell: Introduction & Stations of Progress[permanent dead link]