అంతకు మించి (2018 సినిమా)

జానీ దర్శకత్వంలో 2018లో విడుదలైన తెలుగు రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ సినిమా.

అంతకు మించి , 2018 ఆగస్టు 24న విడుదలైన తెలుగు రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ సినిమా.[1][2] సతీష్ జై ఫిల్మ్స్, యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల‌లో జై, పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించాడు. ఇందులో రష్మి గౌతమ్, జై, అజయ్ ఘోష్, సూర్య, మధునందన్, రవిప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించగా, సునీల్ కశ్యప్ సంగీతం, బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు.

అంతకు మించి
అంతకు మించి సినిమా పోస్టర్
దర్శకత్వంజానీ
రచనజానీ
నిర్మాతజై
పద్మనాభ రెడ్డి
తారాగణంరష్మి గౌతమ్
జై
అజయ్ ఘోష్
ఛాయాగ్రహణంబాల్‌రెడ్డి
కూర్పుక్రాంతి
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థలు
సతీష్ జై ఫిల్మ్స్
యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీs
24 ఆగస్టు, 2018
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

మధ్య తరగతి యువకుడైన రాజు (జై) కష్టపడకుండా లక్షాధికారి కావాలని కలలు కంటూ ఉంటుంటాడు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలో పాల్గొని కోటీశ్వ‌రుడు అయిపోవాల‌నుకుని దానికి సంబంధించిన ప్రాసెస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. దెయ్యం ఉంద‌ని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తాన‌ని ఓ ప్రొఫెస‌ర్ ఇచ్చిన ఓ ప్ర‌క‌ట‌న‌ను చూసి, ద‌య్యాలున్నాయ‌ని నిరూపించి ఆ ఐదు కోట్టు కొట్టేయాల‌ని స్మ‌శానాల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్ర‌మంలో ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్న తన సోదరి ఇంటిలోనే కొన్ని విచిత్రమైన సంఘటనలను గమనించి, అక్కడ దెయ్యం ఉందని ఎలాగైనా ప్రూవ్ చెయ్యాలనుకుంటాడు. అదే సమయంలో మూడ‌న‌మ్మాకాలు నమ్మ‌ని బ్యాచ్ ఒక‌టి ఆ ఇంట్లోకి వ‌స్తారు. అందులో ఉన్న మ‌ధుప్రియ (ర‌ష్మి) అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్ట‌ప‌డ‌తాడు రాజు. దెయ్యం ఉందా? లేదా ? ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా, సినిమాలోని రెండు పాటలను కరుణాకర్ ఆదిగర్ల రాశాడు. 2018, ఆగస్టు 21న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేయబడ్డాయి.[3][4]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఊసులాడు మెల్లగా"కరుణాకర్ ఆదిగర్లనిఖితా గాంధీ4:10
2."పైసా లోకం"కరుణాకర్ ఆదిగర్లసునీల్ కశ్యప్4:06
Total length:8:16

మూలాలు మార్చు

  1. "Anthaku Minchi". 24 August 2018. Retrieved 24 February 2021.
  2. "Review by IndiaGlitz". www.Indiaglitz.com. 5 August 2018. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 24 February 2021.
  3. Jai, RashmiGautham; Satish, Jhony (23 August 2018). "Anthaku Minchi Full Songs Jukebox". youtube.com.
  4. "Anchor Rashmi Comments on YouTube Channets at Anthaku Minchi Audio launch | Friday Poster". youtube.com.

బయటి లింకులు మార్చు