అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్

ప్రతి సంవత్సరం గుజరాత్లో రెండు వేలకు పైగా పండుగలను జరుపుకుంటారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది.[1] గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉత్తరాయణం అనగా శీతాకాలం నుంచి వేసవి కాలానికి ప్రారంభ రోజు. రైతులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే పంట కోతల కాలం, సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు, ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు భారతదేశంలో ముఖ్యమైన పంట రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుజరాత్ లోని చాలా నగరాలు ఈ గాలి పటాల పోటీని నిర్వహిస్తున్నాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాల ప్రాంతంలో ఉత్తరాయాణాన్ని అత్యంత వేడుకగా నిర్వహించటం వలన భారతదేశంలో రెండు రోజులు ప్రభుత్వ సెలవులగా మారాయి.[2] ఈ పండుగ సందర్భంగా ఉందియు అనే స్థానిక ఆహారాన్ని జనసమూహానికి అందజేస్తారు[3][4] ఈ పండుగకు కొన్ని రోజులు ముందు ఇక్కడి మార్కెట్లు సరఫరాదారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. 2012లో జరిగిన గుజరాత్ అంతర్జాతీయ గాలిపటాల పండుగలో 42 దేశాలు పాల్గొన్నందున గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్ లో నమోదు కొరకు ప్రయత్నిస్తున్నారు.[5]

అంతర్జాతీయ గాలిపటాల పండుగ
ప్రక్రియగాలిపటాలు
తేదీలుప్రతి సంవత్సరం జనవరి14
ప్రదేశంగుజరాత్, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు1989— present
వెబ్‌సైటు
www.gujarattourism.com

సూచికలు

మార్చు
  1. Subhamoy, Das. "Uttarayan & the Kite Festival of Gujarat". Archived from the original on 12 జనవరి 2013. Retrieved 3 November 2012.
  2. Subhamoy, Das. "Uttarayan & the Kite Festival of Gujarat". about.com. Archived from the original on 12 జనవరి 2013. Retrieved 24 October 2012.
  3. Desai, Anjali (2007). India Guide Gujarat. India: India Guide Publication. p. 66. ISBN 9780978951702.
  4. "International Kite Festival Ahmedabad". Archived from the original on 6 నవంబరు 2012. Retrieved 3 November 2012.
  5. Sahu, Deepika. "Gujarat kite festival to go global". Archived from the original on 2014-01-17. Retrieved 3 November 2012.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు