అంబరీష్ వేదాంతం మూర్తి (1970/1971 - 2023 ఆగస్టు 7) భారతీయ వ్యవస్థాపకుడు, వ్యాపార కార్యనిర్వాహకుడు. ఆయన 2012లో ఆశిష్ షాతో కలిసి స్థాపించిన ఈ-కామర్స్ ఫర్నిచర్, గృహోపకరణాల సంస్థ పెప్పర్‌ఫ్రై(Pepperfry) సహ వ్యవస్థాపకుడుగానే కాక, ముఖ్య కార్యనిర్వాహకుడు (ceo)గా వ్యవహరిస్తున్నాడు.[1][2] పెప్పర్‌ఫ్రైని స్థాపించడానికి ముందు, ఆయన మార్చి 2008, జూన్ 2011 మధ్య ఈబె(eBay) ఇండియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో కంట్రీ మేనేజర్‌గా ఉన్నాడు.[3]

అంబరీష్ వేదాంతం మూర్తి
జననం1970/1971
మరణం (aged 51)
లేహ్, లడఖ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా
వృత్తిపెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పెప్పర్‌ఫ్రై, ఈబె (eBay, క్యాడ్‌బరీ, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI)

కెరీర్ మార్చు

ఆయన బి.ఇ. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కలకత్తా నుండి ఎంబిఎ చేశాడు. ఆయన తన గ్రాడ్యుయేషన్ సమయంలో XI, XII తరగతుల విద్యార్థులకు భౌతిక శాస్త్రం, గణితంలో ఇంటి-బోధన (home tuition) చేయడం అనే వ్యవస్థాపకతతో అతని కెరీర్ ప్రారంభమైంది.[4] ఆయన ట్యూటర్స్ బ్యూరో అనే చిన్న వ్యాపారాన్ని స్థాపించాడు, అది పాఠశాల విద్యార్థులతో ప్రతిభావంతులైన ట్యూటర్‌లను కనెక్ట్ చేసింది. ఆయన 1990ల ప్రారంభంలో రెండు సంవత్సరాలు వెంచర్‌ను నడిపాడు.[1]

2012లో, ఆయన ముంబైలో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రై ప్రధాన కార్యాలయం స్థాపించాడు.[5][6] పెప్పర్‌ఫ్రై విలువ $500 మిలియన్లు, 2020 నాటికి ఎనిమిది నిధుల రౌండ్లలో $244 మిలియన్ల పెట్టుబడితో ఉంది.[7] దాని పెట్టుబడిదారులలో గోల్డ్‌మన్ సాచ్స్, బెర్టెల్స్‌మాన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి.[8]

మరణం మార్చు

ఆయన 51 ఏళ్ల వయసులో గుండెపోటుతో 2023 ఆగస్టు 7న లేహ్ లో మరణించాడు.[9]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Pepperfry's Ambareesh Murty: The man in the golden chair". LiveMint (in ఇంగ్లీష్). 2021-03-26. Retrieved 2023-01-03.
  2. Zachariah, Reeba. "Pepperfry Rejigs Structure For Ipo | Mumbai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). No. 29 July 2022.
  3. "EBay India's Ambareesh Murty Resigns; New Country Manager Is Muralikrishnan B". Techcircle. 10 May 2011.
  4. "How Pepperfry become India's Largest Online Furniture Store: Success Story". Suger Mint (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-07. Retrieved 2023-01-03.
  5. Thomas, Dearton (7 March 2018). "State Street Global Advisors invests in furniture e-tailer PepperFry". VCCircle.
  6. Layak, Suman. "We have democratised furniture market: Ambareesh Murty, cofounder and CEO of Pepperfry". The Economic Times.
  7. "Exclusive: Thrasio's $500M India bet; Pepperfry assembling IPO". The Economic Times. 14 January 2022.
  8. "How Pepperfry become India's Largest Online Furniture Store: Success Story". Suger Mint (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-07. Retrieved 2023-01-03.
  9. "పెప్పర్‌ఫ్రై సీఈఓ అంబరీశ్‌ మూర్తి మృతి |". web.archive.org. 2023-08-09. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)