అంబాజీ జాదవ్ మార్చు

అంబాజీ జాదవ్ (1925,ఆగష్టు 03-1996,‌సెప్టెంబర్17) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తొలి ఖానాపూర్ శాసన సభ సభ్యులు.ఆంధ్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 1978,1983,లో వరుసగా రెండు సార్లు గెలిచి ఖానాపూర్ నియోజకవర్గం నుండి శాసన సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. సర్పంచ్ స్థాయి నుండిఎమ్మెల్యే‌ గా ఉన్నత స్థాయికి ఎదిగాడు[1][2][3].

అంబాజీ జాదవ్ మాజీ ఎమ్మెల్యే
 


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 -1983
ముందు ఎవరు లేరు, తొలి ఎమ్మెల్యే
నియోజకవర్గం ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1925-08-03) 1925 ఆగస్టు 3 (వయసు 98)
చిమానాయక్ తాండ, మండలం ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు చిమానాయక్, కెస్లి బాయి
జీవిత భాగస్వామి సేవంత బాయి,చాందిబాయి
సంతానం నలుగురు కుమారులు , ఎనిమిది మంది కుమార్తెలు
నివాసం చిమానాయక్ తాండ ఉట్నూరు, తెలంగాణ, భారతదేశం

జననం మార్చు

అంబాజీ జాదవ్ 1925,ఆగష్టు 03న తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఎక్స్ రోడ్ సమీపంలోని చిమా నాయక్ తాండలో జాదవ్ చిమానాయక్, కెస్లిబాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు.

వ్యక్తిగత జీవితం మార్చు

అంబాజీ జాదవ్ హయ్యర్ సెకండరీ స్కూల్ వరంగల్ యందు ఉర్దూ మాధ్యమంలో హెచ్ఎస్సి ఉత్తీర్ణులైనారు. ఆయనకు సేవంతబాయి,చాందిబాయి ఇద్దరు భార్యలు నలుగురు కుమారులు కొండల్ రావు,గోపాల్ రావు,సురేష్, రమణ,ఎనిమిది మంది అమ్మాయిలు నెహ్రూ,గాంధీ కుటుంబం పై అభిమానంతో తన కూతుర్ల పేర్లను వాళ్ళ పేర్లుగా పెట్టుకోవడం విశేషం.విజయలక్ష్మీ కెప్టన్ లక్ష్మీ,మాలబాయి నిర్మలా బాయి నెహ్రూబాయి,ఇందుమతి,భాగ్యలక్ష్మీ, ఎనిమిది మంది కుమార్తెలు.వీరి మొదటి కుమారుడు కొండల్ రావు జాదవ్ నాగాపూర్ సర్పంచిగా, రెండో కుమారుడు గోపాల్ రావు జాదవ్ 1995లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉట్నూరు జెడ్పీటీసీ గా ప్రస్తుతం నాగాపూర్ ఎంపీటిసీగా ఉన్నారు. వీరి పెద్ద కూతురు చౌహాన్ విజయలక్ష్మీ తెలంగాణ మలి దశ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఆమె ఉట్నూరు జడ్పీటీసీ గా ఐదు సంవత్సరాలు సేవలందించింది.

రాజకీయ జీవితం మార్చు

స్వాతంత్ర్య సమర యోధుడు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందు ఫౌజ్ యందు ఉట్నూరు డివిజన్ కు కమాండర్ గా వ్యవహరించారు.ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ)లో క్రీయాశీల నాయకుడిగా పని చేశారు.1952లో తొలి సారిగా నాగాపూర్ గ్రామ పంచాయితీకి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.1952 నుండి 1977 వరకు ఇరువై ఐదు సంవత్సరాలు సర్పంచిగా సేవలందించారు. 1969లోతెలంగాణ తొలి దశ ఉధ్యమంలో పాల్గొన్నారు. 1978[4] లో ఖానాపూర్ ఎస్టీ రిజర్వడ్ శాసనసభ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన తొలి ఖానాపూర్ శాసన సభ సభ్యుడుగా రికార్డు సృష్టించాడు.మళ్ళీ రెండో సారి 1983 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఖానాపూర్ శాసన సభ్యులుగా గెలుపొంది ఖానాపూర్ ప్రజలకు సేవలందించారు.1983 నుండి 1985 వరకు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైజరి కమిటీకి చైర్మన్ గా పనిచేశారు.

మరణం మార్చు

వృద్ధాప్యం తో అంబాజీ జాదవ్ తన స్వగృహం చిమానాయక్ తాండలో 1996 సెప్టెంబరు 17 న తుది శ్వాస విడిచారు.

మూలాలు మార్చు

  1. "Khanapur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2024-03-14.
  2. "Khanapur 1978 Assembly MLA Election Telangana | ENTRANCE INDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-09. Archived from the original on 2024-02-05. Retrieved 2024-03-14.
  3. "Khanapur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2024-03-14.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1978". Elections in India. Retrieved 2024-03-14.