అక్కడొకడుంటాడు
అక్కడొకడుంటాడు 2019లో తెలుగులో విడుదలైన సినిమా. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద విశ్వక్ దర్శకత్వం వహించాడు.[1] శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ, రామ్‌కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించగా సినిమా ఫిబ్రవరి 1న విడుదలైంది.[2]
అక్కడొకడుంటాడు | |
---|---|
దర్శకత్వం | శ్రీపాద విశ్వక్ |
నిర్మాత | కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎన్.రాజశేఖరన్ |
సంగీతం | సార్క్స్ |
నిర్మాణ సంస్థ | లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ |
విడుదల తేదీ | 2019 ఫిబ్రవరి 1 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకార్తీక్, వంశీ, నిత్య, ఆది, సత్య అనే ఐదుగురు స్నేహితులు కలిసి ఒక ప్రముఖ రాజకీయవేత్త కె.కె. (రవి బాబు) బ్లాక్ మనీని దోపిడీ చెయ్యాలనుకుంటారు. దోపిడీ చేసే క్రమంలో అంధుడైన యోగి (శివ కంఠంనేని) వాళ్ళను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో వాళ్ళు దోపిడీ చేసారా ? లేదా ? వాళ్ళ అక్కడ నుండి ఎలా బయట పడ్డారు ? అసలు యోగి ఎవరు ? ఎందుకు అతను కెకె బ్లాక్ మనీకి కాపాలా ఉన్నాడు ? చివరికి ఈ కేసు నుండి ఆ ఐదుగురు స్నేహితులు ఎలా తప్పించుకుంటారు? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- శివ కంఠంనేని[3]
- ‘అల్లరి’ రవిబాబు
- వినోద్ కుమార్
- ఇంద్రజ
- రామ్ కార్తీక్
- శివ హరీష్
- రసజ్ఞ దీపిక
- అలేఖ్య
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: లైట్‌హౌస్ సినీ మ్యాజిక్
- నిర్మాతలు: కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు
- సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద విశ్వక్
- సంగీతం: సార్క్స్
- సినిమాటోగ్రఫీ: ఎన్.రాజశేఖరన్
- ఎడిటర్ : సాయి జ్యోతి అవదుత
మూలాలు
మార్చు- ↑ Sakshi (24 December 2018). "మద్యం తాగి వాహనాలు నడిపితే?". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Sakshi (27 January 2019). "ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Andhra Bhoomi (8 February 2019). "నటనపైనే ఫోకస్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.