ఇంద్రజ

సినీ నటి

ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమా నటి.[1] ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.

ఇంద్రజ
Indraja.jpg
జననం
రాజాతి

30 జూన్ 1978
చెన్నై
వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1993-2007, 2014-ప్రస్తుతం

కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు.[2]

Indraja.jpg

పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.

పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథకు యాంకరుగా కూడా పనిచేసింది.[3] ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవి సీరియల్ వల్లిలో నటిస్తుంది.

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!". eenadu.net. Archived from the original on 13 March 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-07. Retrieved 2009-04-20.
  3. http://www.hindu.com/fr/2005/09/16/stories/2005091602460800.htm
  4. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16. CS1 maint: discouraged parameter (link)
  5. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రజ&oldid=3050181" నుండి వెలికితీశారు