అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
1996 సినిమా
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. ఇది కథానాయకుడిగా పవన్ కల్యాణ్ మొదటి సినిమా.[2] కథానాయిక సుప్రియకు కూడా ఇది మొదటి సినిమా. ఈమె అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు. నటుడు సుమంత్కు చెల్లెలు. ఈ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు పునర్నిర్మాణం.ఈ చిత్రంలోని పాటలు,కామెడీ,పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే చేసిన వళ్ళు గగుర్పాటుకు గురిచేసిన ఫైట్లు మంచి ఆదరణ పొందాయి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | ఇ. వి. వి. సత్యనారాయణ |
రచన | సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఇ. వి. వి. సత్యనారాయణ |
కథ | నాసిర్ హుస్సేన్ |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | పవన్ కల్యాణ్ సుప్రియ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాల రెడ్డి |
కూర్పు | వళ్ళ స్వామి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 11 అక్టోబరు 1996 |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 6o లక్షలు |
బాక్సాఫీసు | 90 లక్షలు |
తారాగణం
మార్చు- కల్యాణ్ గా పవన్ కల్యాణ్
- సుప్రియ
- నాజర్
- శరత్ బాబు
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- కోట శ్రీనివాసరావు
- చంద్రమోహన్
- ఎ.వి.ఎస్.
- మల్లికార్జునరావు
- కోవై సరళ
- రంభ
- ఊహ
పాటలు
మార్చుఈ సినిమాకు సాలూరి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రచించాడు. పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "టైం టైం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 4:52 |
2. | "బావా బావా" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:12 |
3. | "ప్రియ సఖి ఓం సఖి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ | 5:05 |
4. | "చలిగాలి ఝుమ్మంది" | మనో, కె. ఎస్. చిత్ర | 5:29 |
5. | "ప్రేమన్నా చిన్నమాటలోనే" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:58 |
6. | "ముద్దు ముద్దు పిల్లో" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:13 |
7. | "ఓ దైవమా" | ఎస్. జానకి | 5:10 |
మూలాలు
మార్చు- ↑ "Titles". Chithr.com.[permanent dead link]
- ↑ "Pawan Kalyan - Bio-graphy". idlebrain.com. Retrieved 24 February 2018.