అక్కన్న మాదన్న గుహాలయాలు

అక్కన్న మాదన్న గుహాలయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల కనక దుర్గమ్మ గుడికి దగ్గరలో గల హిందూ దేవాలయాల శిథిలాలు. ఇవి 17వ శతాబ్దంలో నిర్మించినవిగా తెలుస్తున్నది. ఈ గుహలు అంతకు ముందు 6వ శతాబ్ద కాలానికి చెందినవని చరిత్రకారులు చెబుతారు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందిన ఒక గుహ కూడా ఈ ఆలయాలకి సమీపంలో ఉంది. ఆ గుహలో బ్రహ్మ, విష్ణు, శివుడు - తిమూర్తులకూ ఆలయాలు ఉన్నాయి.

అక్కన్న మాదన్న గుహాలయాలు
అక్కన్న మాదన్న గుహాలయాలు
Map showing the location of అక్కన్న మాదన్న గుహాలయాలు
Map showing the location of అక్కన్న మాదన్న గుహాలయాలు
Geographic coordinates of cave
స్థలంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్,  India
అక్షాంశ రేఖాంశాలు16°30′49.5″N 80°36′23.7″E / 16.513750°N 80.606583°E / 16.513750; 80.606583
కనుగొన్నప్రాకారం కాలం అంచనా6వ, 7వ శతాబ్దాలు

భౌగోళిక స్థితి మార్చు

ఈ ఆలయాలు ఇంద్రకీలాద్రి కొండకి తూర్పు దిశగా కొండ కింద భాగంలో ఉంటాయి. హైదరాబాదు-విజయవాడ రహదారిని ఆనుకొని దర్గా అవతల కృష్ణా నది వైపు కాకుండా వేరే వైపుకి అర్జున వీధి ఉంటుంది. ఆ వీధి వెంబడి గోశాల వైపుకి వెళుతుంటే కొద్ది దూరంలోనే ఈ గుహాలయాలు ఎడమ వైపుకి కొండకు దిగువన కనిపిస్తాయి.

విశేషాలు మార్చు

ప్రస్తుతం ఈ గుహాలయాలు, పరిసరాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ గుహాలయాల గురించి ఎక్కువ వివరాలు తెలియవు. ఇవి 5-6 శతాబ్దాలకు చెందిన విష్ణు కుండినులు నిర్మించీ ఉండవచ్చని పురావస్తు శాఖ వారి అంచనా. నగరంలో ఉన్న మొఘల్ రాజ పురం గుహలు, కృష్ణా నదికి ఆ పక్క ఉన్న ఉండవల్లి గుహలు కూడా వారి కాలం లోనే నిర్మించినట్లుగా తెలుస్తోంది. విష్ణు కుండినులు స్వతహాగా శివారాధకులు. కొంత కాలం బౌద్ధం ఆచరించారని చరిత్ర కారుల అభిప్రాయము. ఆ కారణంగా ఈ గుహలు తొలుత బౌద్ధ బిక్షువుల ఆరామ కేంద్రాలుగా ఉండి తరువాత హిందూ గుహాలయాలుగా మారి ఉండవచ్చును అని అంటారు. అయిదో శతాబ్దంలో చెక్కిన గుహలకు పదిహేడో శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తానీషా దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేర్లు రావడానికి కారణం వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతొ పిలవడం ప్రారంభమై ఉండవచ్చును అని కూడా అంటుంటారు. దగ్గరలో ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలంటారు. ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోని ఒక దానిలోనే సదా శివుడు లింగ రూపంలో కనపడతాడు. మరొకటి ఖాళీగా ఉంటుంది. ద్వారపాలక విగ్రహాలు, విఘ్న నాయకుని రూపం గోడల పైన చెక్కబడ్డాయి. పక్కనే ఉన్న నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో బాటు తెలుగు శాసనంతో ఆకర్షిస్తుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభము మహేశ్వరుని వివిధ రూపాలలో చూపుతుంది. హనుమంతుని ఆశీర్వదిస్తున్న సీతా రాములను కూడా ఈ స్తంభం పైన చూడవచ్చును. చాలా సంవత్సరాల క్రిందట కొంతకాలం ఇక్కడ లైట్ అండ్ మ్యూజిక్ షో ఏర్పాటు చెయ్యడం జరిగింది. గుహల గురించిన పూర్తి సమాచారం కూడా అందుబాటలో లేక పోవడం భాధాకరం. ప్రస్తుతం ఎలాంటి యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు జరగడం లేదు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.