కనకదుర్గ ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ లోని ఇంద్రకీలాంద్రి పర్వతంపై ఉన్న ఒక ప్రసిద్ధ దేవస్థానం
(కనకదుర్గ గుడి నుండి దారిమార్పు చెందింది)

కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.[1] ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
కనకదుర్గ గుడి KANAKADURGA TEMPLE is located in ఆంధ్రప్రదేశ్
కనకదుర్గ గుడి KANAKADURGA TEMPLE
కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°30′58″N 80°36′58″E / 16.516°N 80.616°E / 16.516; 80.616
పేరు
ప్రధాన పేరు :కనక దుర్గ అమ్మవారి ఆలయం
దేవనాగరి :कनकदुर्ग अम्मवारि आलय
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కృష్ణా జిల్లా
ప్రదేశం:విజయవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:కనక దుర్గా దేవి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సమాచారం లేదు
సృష్టికర్త:సమాచారం లేదు
దుర్గ ఆలయం
Parking Place for Bhavani Dheeksha , B.R.T.S , Middle Road , Food junction

పేరువెనుక చరిత్ర

మార్చు

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

 
గుడి క్రింది భాగం

క్షేత్ర పురాణం

మార్చు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. [2]

నవరాత్రి ఉత్సవాలు

మార్చు

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

  • మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
  • రెండవ దినము బాల త్రిపురసుందరి దేవి
  • మూడవ దినము గాయత్రి దేవి
  • నాలుగవ దినము అన్నపూర్ణా దేవి.
  • ఐదవ దినము లలితా త్రిపురసుందరి దేవి
  • ఆరవ దినము సరస్వతి దేవి
  • ఏడవ దినము దుర్గాదేవి
  • ఎనిమిదవ దినము మహాలక్ష్మిదేవి
  • తొమ్మిదవ దినము మహిషాసురమర్దిని
  • పదవ దినము రాజరాజేశ్వరి దేవి

ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రం గా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Kanka Durga". Archived from the original on 2006-10-19. Retrieved 2006-08-20.
  2. "Devi Kanaka Durga, Vijayawada, Andhra Pradesh". Retrieved 2006-08-20.