అక్కా తమ్ముడు 1972 అక్టోబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఈ చిత్రంలో జయలలిత, ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, ఆర్.ఎస్.మనోహర్, అంజలీదేవి తదితరులు నటించారు. ఈ చిత్రంలో కథనాయకి జయలలిత, అనాథ బలౌడు మాస్టర్ శేఖర్ మధ్య ఉన్న బంధం కథాంశంగా ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని టి.కె.రామమూర్తి అందించాడు. ఈ చిత్రానికి కృష్ణన్-పంజు దర్శకత్వం వహించగా, ముత్తువెళ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా తమిళ సినిమా " అనాదై అనందన్"కు డబ్ చేసిన చిత్రం. అదే సమయంలో తమిళ సినిమా " అనాదై ఆనందన్", హిందీ చిత్రం " చందా ఔర్ బిజ్లీ" కూడా విడుదలైనాయి. వీటిలో 1969లో హిందీ సినిమా విడుదలైనది. వీటిలో తెలుగు సినిమా విజయవంతమైంది.

అక్కా తమ్ముడు
(1972 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ బాల సుబ్రమణియం & కంపెనీ
విడుదల తేదీ 6 అక్టోబరు 1972 (1972-10-06)
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • జయలలిత
  • ఎ.వి.ఎం.రాజన్
  • ఆర్.ముత్తురామన్
  • అంజలీదేవి
  • మాస్టర్ శేఖర్
  • పి.నాగయ్య (అతిథి పాత్ర)
  • నాగేష్
  • మనోహర్
  • డి.ఎ.కె.దేవర్
  • టి.కె.భగవతి
  • తేంగాయ్ శ్రీనివాసన్
  • రేణుక
  • విజయచంద్రిక
  • సీతాలక్ష్మి

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • అసహాయులకే వరములనిచ్చే కరుణాకరుడివే ప్రేమతో జగతి, రచన: అనిశెట్టి సుబ్బారావు, గానం. పిఠాపురం నాగేశ్వరరావు
  • ఆశించి మోహించి సౌఖ్యాల తేలించి మనసారా ఆడించుమా, రచన: అనిశెట్టి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఏమిటిది ఏమిటిది ఆహాహా దోబూచులాడకుమా, రచన: అనిశెట్టి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • జలకాలాడవమ్మా ఒడలే వణికేసుమా చక్కని చిలకమ్మా, రచన: అనిశెట్టి, గానం.పి సుశీల
  • జుమ్మున వస్తారోయీ సొమ్ములు గుప్పించేస్తారోయి అమ్మాయిల చూస్తే, రచన: అనిశెట్టి, గానం.పి సుశీల
  • లోకం వింతైన లోకం చెవులే ఊరించు పరువం పేదకు లోకమ్మే భారం, రచన: అనిశెట్టి, గానం.పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 16 మార్చి 2017. Retrieved 23 ఫిబ్రవరి 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు