అక్తర్ సర్ఫరాజ్
పాకిస్తానీ క్రికెటర్, క్రికెట్ కోచ్
అక్తర్ సర్ఫ్రాజ్ (1976, ఫిబ్రవరి 20 - 2019 జూన్ 10)[2] పాకిస్తానీ క్రికెటర్, క్రికెట్ కోచ్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. 2018 - 2019 మధ్య పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు సెలెక్టర్ గా ఉన్నాడు.[3]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | పెషావర్, పాకిస్తాన్ | 1976 ఫిబ్రవరి 20
మరణించిన తేదీ | 2019 జూన్ 10 పెషావర్, పాకిస్తాన్ | (వయసు 43)
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ |
బంధువులు | జాఫర్ సర్ఫరాజ్ (సోదరుడు)[1] |
మూలం: Cricinfo, 2019 జూన్ 10 |
జననం
మార్చుఅక్తర్ సర్ఫ్రాజ్ 1976, ఫిబ్రవరి 20న పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించాడు.[4]
క్రికెట్ రంగం
మార్చు1997 - 1998 మధ్య నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[5] 13 సంవత్సరాలపాటు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[6] అందులో 118 మ్యాచ్‌ల్లో 5,720 పరుగులు చేశాడు.[7]
మరణం
మార్చుతన 43 సంవత్సరాల వయస్సులో పెద్దప్రేగు క్యాన్సర్ కారణంగా 2019 జూన్ 10న లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో మరణించాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "Former Pakistan First-class Cricketer Zafar Sarfraz Dies of Coronavirus". Network18 Media and Investments Ltd. Retrieved 14 April 2020.
- ↑ "Former Pakistan batsman Akhtar Sarfraz dies aged 43". ESPN Cricinfo. Retrieved 10 June 2019.
- ↑ "Akhtar Sarfraz Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Akhtar Sarfraz Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "WI vs PAK, Akai-Singer Champions Trophy 1997/98, 2nd Match at Sharjah, December 12, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Urban vs PeshP, Quaid-e-Azam Trophy 2006/07, Gold League at Karachi, January 12 - 15, 2007 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "PCB shocked at the news of Akhtar Sarfaraz's passing". Pakistan Cricket Board. Retrieved 2023-09-05.
- ↑ "Former Cricketer Akhtar Sarfraz Passes Away". UrduPoint. Retrieved 2023-09-05.