అక్షరాభ్యాసం

మాఘ శుద్ధ పంచమి నాడు వచ్చే వసంతపంచమి నాడు జరిపే విద్యారంభ కార్యక్రమం

అక్షరాభ్యాసం లేదా విద్యారంభం లేదా అక్షరారంభం అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వచ్చే వసంతపంచమి నాడు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యాదీక్ష ఇవ్వబడుతుంది, తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడు. ఈ ఆచారంలో సరస్వతీ దేవి పూజ చేస్తారు.[1]

అక్షరాభ్యాసం
అక్షరాభ్యాసం
సరస్వతి శిశుమందిర్, నారాయణ పేటలో అక్షరాభ్యాస కార్యక్రమం
యితర పేర్లువిద్యారంభం లేదా అక్షరారంభం
జరుపుకొనేవారుహిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు
రకంభారతదేశం, సంస్కృతి
2023 లో జరిగిన తేది26 జనవరి (గురువారం)
2024 లో జరిపే తేదీ14 ఫిబ్రవరి (బుధవారం)
ఉత్సవాలుఅక్షర అభ్యాసం, ఓం రాయటం, సరస్వతీ దేవి పూజ

వివరణ, పద్దతి మార్చు

ఈ కార్యక్రమం కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని హిందూ కుటుంబాలలో సర్వసాధారణంగా జరుపుతారు. అక్షరం అంటే నశించనిది (వర్ణమాల) అని, అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వాటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం. ఈ వేడుకను తల్లి లేదా తండ్రి లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో పురోహితుని ద్వారా పిల్లల కుడి చేతితో బిడ్డను తన ఒడిలో ఉంచుకుని, పంచాక్షరీ మంత్రంతో పాటు ఓంను వ్రాస్తూ అక్షరం దిద్దిస్తారు.[2]

బాసరలో మార్చు

ఓం చిహ్నాన్ని బీజాక్షరిగా వ్యవహరిస్తారు (సంస్కృతంలో బీజ అంటే మూలం). తెలంగాణలోని బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో ఇటువంటి వేడుకలు పెద్ద సంఖ్యలో జరుగుతాయి.[3][4]

శిశు మందిరాల్లో మార్చు

దేశ వ్యాప్తంగా విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని సామూహిక అక్షరాభ్యాసాలు పేరుతో ప్రతి సంవత్సరం వసంతపంచమి నాడు నిర్వహించి, పిల్లలకు అక్షర పరిచయం చేస్తారు.[5][6]

మూలాలు మార్చు

  1. "Shopping month is here". The Hindu. 2009-07-13. Archived from the original on 17 July 2009. Retrieved 6 February 2012.
  2. P. Ram Mohan (2008-02-12). "Devotees put to hardship at Basar". The Hindu. Archived from the original on 16 February 2008. Retrieved 6 February 2012.
  3. "`Aksharabhyasam' launched". The Hindu. 2007-01-24. Archived from the original on 21 January 2008. Retrieved 6 February 2012.
  4. "Pilgrims throng Basar on Vasantha Panchami". The Times of India. Archived from the original on 16 July 2012. Retrieved 6 February 2012.
  5. "ఘనంగా వసంత పంచమి". sakshi.com news telangana. Archived from the original on 2018-01-23. Retrieved 2018-01-23.
  6. "శిశుమందిర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం". telugu.getlokalapp.com. 2021-02-16. Archived from the original on 2022-01-31. Retrieved 2021-02-16.