ప్రధాన మెనూను తెరువు

బాసర

తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రం

బాసర (బాసర), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసర మండలానికి చెందిన గ్రామం.[1]

Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
Gnana Saraswati Temple శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము is located in Telangana
Gnana Saraswati Temple శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
Location in Telangana
భౌగోళికాంశాలు:18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639Coordinates: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
పేరు
స్థానిక పేరు:Shri Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
స్థానము
దేశము:భారతదేశం
రాష్ట్రము:తెలంగాణ
ప్రదేశము:బాసర
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం:సరస్వతి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ.,నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1362 ఇళ్లతో, 5865 జనాభాతో 2806 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2868, ఆడవారి సంఖ్య 2997. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 641 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 208. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570264[2].

బాసర
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం బాసర
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,865
 - పురుషుల సంఖ్య 2,868
 - స్త్రీల సంఖ్య 2,997
 - గృహాల సంఖ్య 1,362
పిన్ కోడ్ 504101
ఎస్.టి.డి కోడ్

సరస్వతి అమ్మవారి క్షేత్రము.సవరించు

భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతిదేవి ఆలయాలలో ఇది ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్ము కాశ్మీర్ లో ఉంది. హిందూ మతం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ముధోల్లోను, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఆదిలాబాద్లోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నిర్మల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నిజామాబాద్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

బాసరలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యంసవరించు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

బాసరలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

బాసరలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 650 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 778 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1053 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 324 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1200 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 178 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

బాసరలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 178 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

బాసరలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి

చూడదగిన స్థలాలుసవరించు

జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకోప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

ముఖ్యమైన ఉత్సవాలుసవరించు

మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాసపూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీ పంచమిసవరించు

మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.

మహా శివరాత్రిసవరించు

మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

మాధుకరంసవరించు

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరం అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

వసతులుసవరించు

ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిథి గృహం, వేములవాడ దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధిగృహం మాత్రమే ముఖ్య వసతులు. ప్రస్తుతం అనేక లాడ్జీలు నడుపబడుతున్నాయి. ఎపి పర్యాటకం బస్ టిక్కెట్స్ వద్ద టిక్కెట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఛాయాచిత్రాలను చూడ వచ్చు.

వసతి గృహములు :- లగ్జరీ అకామిడేషన్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, బెస్ట్ ఎకనమీ అకామిడేషన్ లాంటి వసతి గృహాలు భక్తులకు ఇక్కడ ఉండడానికి తగిన వసతులు కల్పిస్తున్నాయి.

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం లభిస్తూ ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 35 కి.మీ. దూరం.

చిత్రమాలికసవరించు

వనరులుసవరించు

మూలాలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బాసర&oldid=2683488" నుండి వెలికితీశారు