అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి (ఎయిమ్స్ మంగళగిరి లేదా ఎయిమ్స్-ఎం) అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ.[1]వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉంది.

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి
ఎయిమ్స్, మంగళగిరి
రకంపబ్లిక్
స్థాపితం2018 (2018)
అధ్యక్షుడుటి.ఎస్. రవి కుమార్
డైరక్టరుముఖేష్ త్రిపాఠి
స్థానంమంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
16°26′N 80°33′E / 16.43°N 80.55°E / 16.43; 80.55
జాలగూడుwww.aiimsmangalagiri.edu.in
మంగళగిరిలో ఎయిమ్స్‌కు పునాదిరాయి వేయడానికి జె.పి.నాడ్డా, కేంద్ర మంత్రి ఫలకాన్ని ఆవిష్కరించారు

పాలక వర్గంసవరించు

ఎంపిక కమిటి సిపార్సుల మేరకు ముఖేశ్ త్రిపాటి సంస్థ డైరెక్టరుగా నియించబడ్డాడు.[2] టి.ఎస్.రవికుమార్ వైస్ చాన్సలర్ గా నియమించబడ్డాడు.[3]

చరిత్రసవరించు

2014-15 బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 జూలైలో ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు కొత్త ఎయిమ్స్ ఏర్పాటు కోసం, 500 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్, రాష్ట్రంలోని కళ్యాణి, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతం "ఫేజ్- IV" ఇన్స్టిట్యూట్స్ అని పిలవబడేవి.వీటిలో 2015 అక్టోబరులో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటుకు 1,618 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదించింది. శాశ్వత ప్రాంగణంలో నిర్మాణ పనులు 2017 సెప్టెంబరులో ప్రారంభమయ్యాయి.ఇంతలో ఎయిమ్స్ మంగళగిరి 2018-19 విద్యా సంవత్సరాన్ని సిద్ధార్థ వైద్య కళాశాలలో తాత్కాలిక ప్రాంగణం నుండి ప్రారంభించారు.[1] శాశ్వత క్యాంపస్‌లోని అవుట్‌ పేషెంట్ విభాగం (ఒపిడి) 2019 మార్చి నుండి పనిచేయడం ప్రారంభించింది.

10 రూపాయలకే ఓపీ సేవలుసవరించు

ఇక్కడ వైద్యం రూ.10కే అందడం కాక వైద్య పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులు ఇలా ఉన్నాయి.[4][5]

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ రూ.135

ఫాస్టింగ్‌ అండ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ రూ.24+24

లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225

కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225

లిపిడ్‌ ప్రొఫైల్‌ రూ.200

థైరాయిడ్‌ ప్రొఫైల్‌ రూ.200

ఈసీజీ రూ.50

ఛాతి ఎక్స్‌రే రూ.60

మామోగ్రఫీ రూ.630

అలా్ట్రసోనోగ్రఫీ రూ.323

యూరిన్‌ ఎనాలిసిస్‌ రూ.35

హెచ్‌ఐవీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.150

హెచ్‌బియస్‌ ఏజీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.28

మూలాలుసవరించు

  1. 1.0 1.1 https://www.aiimsmangalagiri.edu.in/institution/about-us/
  2. https://web.archive.org/web/20181112021517/https://indianmandarins.com/blog-details?i=16902&appointment-of-director,-aiims-cleared
  3. "Professor TS Ravikumar takes charge as president of AIIMS Mangalagiri - Times of India". The Times of India. Retrieved 2020-04-18.
  4. "మంగళగిరిలో ఎయిమ్స్‌లో రూ.10కే వైద్యం!". andhrajyothy. Retrieved 2022-01-10.
  5. "AIIMS మంగళగిరి ఎయిమ్స్‌లో అతితక్కువ ధరకే వైద్యసేవలు". EENADU. Retrieved 2022-01-10.

వెలుపలి లంకెలుసవరించు