అగాథా సంగ్మా

భారతీయ రాజకీయవేత్త

అగాథా సంగ్మా (జననం. జూలై 24 1980) భారత దేశంలో 15వ లోక్‌సభకు చెందిన పార్లమెంట్ సభ్యులు. ఈమె మేఘాలయ లోని "తుర" పార్లమెంట్ నియోజకరవర్గం నుండి 2009 పార్లమెంట్ ఎన్నికలలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) నుండి ఎన్నికైనారు. ఈమె అతిపిన్న వయసులో లోక్సభ సభ్యురాలయిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె యు.పి.ఎ-2 ప్రభుత్వం లో అతి పిన్నవయస్కురాలైన మంత్రిణిగా యున్నారు.[2]

అగాథా కె సంగ్మా
అగాథా సంగ్మా


పార్లమెంట్ సభ్యులు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 2009
ముందు పి.ఎ.సంగ్మా
నియోజకవర్గం తుర

స్టేట్ మంత్రిణి. గ్రామీణాభివృద్ధి శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మె 2009 - అక్టోబరు 2012

వ్యక్తిగత వివరాలు

జననం (1980-07-24) 1980 జూలై 24 (వయసు 44)
న్యూఢిల్లీ, ఇండియా.[1]
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం పశ్చిమ గరో హిల్స్
పూర్వ విద్యార్థి పూణె విశ్వవిద్యాలయం
నాట్టింగం విస్వవిద్యాలయం
వృత్తి లాయర్
మూలం biography

ప్రారంభ జీవితం

మార్చు

అగాథా సంగ్మా న్యూఢిల్లీ లో మాజీ లోక్‌సభ స్పీకర్ అయిన పి.ఎ.సంగ్మా, సొరదిని కె సంగ్మాలకు జన్మించింది. ఆమె మేఘాలయ లోని వెస్ట్ గారో హిల్స్ లో నివాసముంటున్నారు.[1][2] ఆమె సోదరుడు "కోన్రాడ్ సంగ్మా" మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ కి ప్రతిపక్ష నాయకునిగా యున్నారు.[3]

విద్య

మార్చు

ఈమె పూణె విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. ఆమె యు.కె లోని నొట్టింగం విశ్వవిద్యాలయ్ంలో ఎన్విరాన్‌మెంటాల్ మేనేజిమెంట్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[4]

కెరీర్

మార్చు

అగాథా సంగ్మా 2008 లో రీ పోలింగ్ లో 14 వ లోక్‌సభకు మొట్టమొదటిసారిగా ఎన్నికైనారు. ఆమె తండ్రి మాజీ లోక్‌సభ స్పీకర్ అయిన పి.ఎ.సంగ్మా రాష్ట్ర రాజకీయాలలో చేరేందుకు తన పదవికి రాజీనామా చేయడం ఫలితంగా జరిగిన రీ పోలింగ్ లో ఈమె గెలుపొందారు. ఆ తర్వాత 15 వ లోక్‌సభ ఎన్నికలలో కూడా ఎన్నికై అతి పిన్న వయసు గల పార్లమెంటు సభ్యులుగా యున్నారు.[5] తన 29 వ యేట 15వ లోక సభలో అతిపిన్న వయస్కురాలైన మంత్రిణిగా యున్నారు.[6] ఆమె రూరల్ డెవలప్ మెంట్ శాఖకు మాజీ మంత్రిణి. ఆమె ఆమె పదవిని అక్టోబరు 2012న రాజీనామా చేశారు.[7] అగర్థా సంగ్మా ఒక న్యాయవాది, పర్యావరణవేత్త, ఒక ఔత్సాహిక ఫోటోగ్రాఫర్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Fifteenth Lok Sabha: Members Bioprofile: Agatha Sangma Archived 2016-01-28 at the Wayback Machine Lok Sabha website.
  2. 2.0 2.1 "NCP retains Tura, Congress Shillong", The Hindu, Chennai, India, 2009-05-16, archived from the original on 2012-11-04, retrieved 2009-05-25, ... NCP candidate Agatha Sangma, daughter of former Lok Sabha Speaker P A Sangma, retained the Tura parliamentary seat in Meghalaya and Congress the Shillong seat. Ms. Agatha, who is the sitting MP, polled 1,54,476 votes compared to 1,36,531 votes by closest rival Deborah Marak of the Congress. ...
  3. "Sangma meets Sonia, first time in a decade". The Times Of India. 2009-06-02. Archived from the original on 2012-10-24. Retrieved 2014-03-19.
  4. "Sangma dynasty gains momentum in Meghalaya". Rediff.com News. April 23, 2008.
  5. "Agatha K. Sangma: India's Youngest MP profile & Bio", Samaw.com, retrieved 2009-05-25, ... Agatha K. Sangma, the youngest India's Parliamentarian from Meghalaya ... Date of Birth 24.07.1980 ...
  6. "Agatha Sangma youngest minister in Manmohan ministry", economictimes.com, 2009-05-27, archived from the original on 2012-10-23, retrieved 2009-05-27, ... P A Sangma, will be the youngest minister in the Manmohan Singh cabinet ...
  7. "Agatha Sangma and Vincent Pala step down". India today. Retrieved 28 October 2012.

ఇతర లింకులు

మార్చు