అగ్గిరాముడు (1954 సినిమా)

(అగ్గిరాముడు నుండి దారిమార్పు చెందింది)

అగ్గిరాముడు ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన 1954 నాటి తెలుగు చలన చిత్రం.

అగ్గిరాముడు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎమ్.శ్రీరాములు నాయుడు
తారాగణం ఎన్.టి.రామారావు,
భానుమతి,
రేలంగి,
ముక్కామల,
ఆర్. నాగేశ్వరరావు,
ఋష్యేంద్రమణి,
సంధ్య,
బాలసరస్వతి
సంగీతం ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు
నేపథ్య గానం ఎ.ఎమ్. రాజా,
భానుమతి,
టేకు అనసూయ
గీతరచన ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

నిర్మాణం సవరించు

అభివృద్ధి సవరించు

1954లో తమిళంలో ఎం.జి.రామచంద్రన్ కథానాయకునిగా మలై కల్లన్ సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో అగ్గిరాముడు సినిమా తీశారు.[1]

థీమ్స్, ప్రభావాలు సవరించు

బుర్రకథా పితామహునిగా పేరొందిన షేక్ నాజర్ ప్రదర్శించే బుర్రకథల్లో అల్లూరి సీతారామరాజు చాలా ప్రాచుర్యం పొందింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ బుర్రకథని అగ్గిరాముడు సినిమాలో చేర్చారు.[నోట్ 1]

ఈ చిత్రంలో వస్త్రధారణ జానపద ఫక్కిలో నడిచింది. అగ్గిరాముని అనుచరులు చేసే కత్తి సాము, మల్లయుద్ధం, నాట్యాలు ప్రేక్షకులను అలరించాయి. అత్రేయ మాటలు, పాటలు బాగున్నాయి.[2]

పాటలు సవరించు

  1. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
  2. ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
  3. కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
  4. కొండకోనల్లోన పండిన దొండపిండా - ఎ.మ్. రాజా
  5. పాలరేయోయి పసిరాకు చుక్క - టేకు అనసూయ బృందం
  6. రాణీరాజు రాణీరాజు రాగమంతా నీదేరాణి - పి. భానుమతి

వనరులు సవరించు

నోట్స్ సవరించు

  1. నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథ అంటే సామాన్య ప్రేక్షకుల్లో ఉన్న ఆకర్షణను దృష్టిలో ఉంచుకుని సినిమా పోస్టర్లలోనూ ప్రముఖంగా ఈ అంశాన్ని ముద్రించారు.

మూలాలు సవరించు

  1. ఎం.బి.ఎస్., ప్రసాద్. "తమిళ రాజకీయాలు - 46". గ్రేటాంధ్ర. Retrieved 25 November 2015.
  2. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్, ఆంధ్రపత్రిక. "అగ్గిరాముడు ప్రేక్షకుల అభిప్రాయాలు". www.pressacademyarchives.ap.nic.in. Retrieved 1 August 2017.[permanent dead link]