ముక్కామల కృష్ణమూర్తి
ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 - జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు.
ముక్కామల కృష్ణమూర్తి | |
---|---|
జననం | ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28 |
మరణం | 1987 జనవరి 10 | (వయసు 66)
జననం - కుటుంబం
మార్చుఈయన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. తల్లిదండ్రులు భార్య భారతి. కుమారుడు సుబ్బారావు. ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ.
సినీరంగం
మార్చుముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్.శర్మ ఎన్టీఆర్, జగ్గయ్య లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్, నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరక్టర్గా చేరి, ' మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్నాథ్గా సినీ నటన ప్రారంభించారు. 'లైలా మజ్ను'లో భానుమతి తండ్రిగా నటించారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'మరదలుపెళ్ళీ,'ఋష్యశృంగ' చిత్రాలకు దర్శకత్వం వహించారు.కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్ వేయడం ముక్కామల హాబీలు.
చిత్ర సమాహారం
మార్చునటుడిగా
మార్చు- ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) .... సయ్యద్ మేనమామ
- కొండవీటి సింహం (1981)
- వంశవృక్షం (1980)
- మదన మంజరి (1980)
- గంధర్వ కన్య (1979)
- డ్రైవర్ రాముడు (1979)
- జగన్మోహిని (1978)
- నాయుడుబావ (1978)
- ఉత్తమురాలు (1976)
- రామాయణంలో పిడకలవేట (1976)
- భక్త కన్నప్ప (1976) .... పెదవేమారెడ్డి
- సీతా కళ్యాణం (1976) .... విశ్వామిత్ర మహర్షి
- సీతా స్వయం వరం (1976) .... వశిష్ఠుడు
- ముత్యాల ముగ్గు (1975) .... సోమరాజు (కథానాయకుని మేనమామ)
- శ్రీరామాంజనేయ యుద్ధం .... విశ్వామిత్ర మహర్షి
- విచిత్ర వివాహం (1973)
- అప్నాదేశ్ (హిందీ) (1972)
- జేమ్స్ బాండ్ 777 (1971)
- బొమ్మా బొరుసా (1971)
- నిర్దోషి (1967) .... లక్ష్మి తండ్రి
- భామా విజయం (1967)
- గూఢచారి 116 (1967)
- శ్రీకృష్ణావతారం (1967) .... కంసుడు
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) .... మహారాజు
- పరమానందయ్య శిష్యుల కథ (1966) .... మంత్రి శివానందం
- బభృవాహన (1964)
- బొబ్బిలి యుద్ధం (1964) .... జనరల్ బుస్సీ
- నర్తనశాల (1963) .... విరాటరాజు
- శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) .... దుర్యోధనుడు
- మహామంత్రి తిమ్మరుసు (1962)
- జగదేకవీరుని కథ (1961) .... మహారాజు
- ఉషా పరిణయం (1961)
- జయభేరి (1959) .... ధర్మాధికారి
- రాజ మకుటం (1959)
- అప్పుచేసి పప్పుకూడు (1958) .... రావుబహుద్దూర్ రామదాసు తండ్రి
- మాయా బజార్ (1957) .... దుర్యోధనుడు
- సారంగధర (1957)
- తెనాలి రామకృష్ణ (1956) .... తాతాచార్యులు
- రాణి రత్నప్రభ (1955)
- రేచుక్క (1955)
- ధర్మదేవత (1952) .... రఘునాథవర్మ
- ప్రేమ (1952) .... పరశురాం
- నిర్దోషి (1951) .... విజయ్
- స్వప్న సుందరి (1950)
- లైలా మజ్ను (1949) మొదటి చిత్రం
దర్శకునిగా
మార్చు- మరదలు పెళ్ళి (1952)
- ఋష్యశృంగ (1961)
మరణం
మార్చుఈయన 1987లో మరణించారు.
మూలాలు
మార్చు