అచ్చంపేట(రాచర్ల)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

అచ్చంపేట ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°32′N 78°57′E / 15.54°N 78.95°E / 15.54; 78.95
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
Area
 • మొత్తం191.17 km2 (73.81 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం55,722
 • Density290/km2 (750/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి962
Area code+91 ( 08541 Edit this on Wikidata )
పిన్‌కోడ్523368 Edit this on Wikidata


గ్రామంలోని దేవాలయాలు మార్చు

శ్రీ పట్టాభిరామచంద్రస్వామివారి ఆలయం మార్చు

అచ్చంపేట గ్రామమునకు పడమర వైపున, గ్రామస్థులు, దాతల సహకారంతో, రు. 22 లక్షల వ్యయంతో, శిథిలమైన పురాతన ఆలయం తొలగించి, రామాలయం, పోలేరమ్మ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి, పోలేరమ్మల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాకార్యక్రమాలు, 2014,జూన్-7, శనివారం ఉదయం వేదపండితులు, ఉభయదాతల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు మహాగణపతి పూజ, అఖండదీపస్థాపన, యాగశాల ప్రవేశం, దీక్షాహోమం, వేదపారాయణం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం కులుకు భజన, గుండు పందెంనిర్వహించారు. ఆరోజు సాయంత్రం, విజేతలకు బహుమతి ప్రదానం చేసారు. ఆదివారం ఉదయం, అభిషేకం, హోమం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. తరువాత విష్ణుసహస్రనామ పారాయణం, విగ్రహాలకు ధాన్యాధివాసం, పుష్పాధివాసం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. జూన్-9, సోమవారం నాడు, ఉదయం మేలుకొలుపు అనంతరం, విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. విశేషపూజల అనంతరం, శ్రీ సీతారామచంద్రస్వామి, పోలేరమ్మ యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ, కూష్మాండబలి, గోదర్శనం, సర్వదర్శనం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి లీలా కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. మహామంగళహారతి తరువాత, భక్తులకు తీర్ధ,ప్రసాదాలు పంచిపెట్టినారు. విగ్రహప్రతిష్ఠ సందర్భంగా, శనివారం నుండి సోమవారం వరకు, మూడురోజులూ, భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి పౌరాణిక నాటకాలు ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. [1]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,జూన్-8వ తేదీ సోమవారంనాడు, ఉదయం గణపతిపూజ, అభిషేకాలు, నిర్వహించారు. సాయంత్రం దీక్షాహోమం, విష్ణుసహస్రనామ పారాయణం చేసారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాల వితరణ నిర్వహించారు. 9వ తేదీ మంగళవారంనాడు, ఉదయం వేదపండితులు, మూలవిరాట్టులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వేదమంత్రాలతో లీలాకళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందనాడు, ఉదయం వేదపండితులు, మూలవిరాట్టులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వేదమంత్రాలతో లీలాకళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. ఈ సందర్భంగా 2015,జూన్-8వ తేదీ సోమవారంనాడు, గ్రామములో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు.

అవధూత శ్రీ పొట్లపాడు రామయోగి తాత ఆలయం మార్చు

ఈ ఆలయంలో 2017,జనవరి-22వతేదీ ఆదివారంనాడు, వార్షిక తిరునాళ్ళు నిర్వహించెదరు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సాయంత్రం భజనలు, రాత్రికి ప్రభ ఏర్పాటు, గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా యువకులకు కబడ్డీ పోటీలు, గ్రామస్థుల ఊరు గుండు పందెం మొదలగు క్రీడా కార్యక్రమాలు గూడా నిర్వహించెదరు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.