అచ్చమ్మకుంటతండా
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం
అచ్చమ్మకుంటతండా పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అచ్చమ్మకుంటతండా | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522426 |
ఎస్.టి.డి కోడ్ |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ తుల్జాభవానీ అలయం:- గ్రామంలో ఈ ఆలయ నిర్మాణానికి 2015, నవంబరు-30వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు.
ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చు- ఈ కృష్ణా నదీతీరంలోని నల్లమల తండాలో, మొదట మద్యానికి బానిసలైన గ్రామస్తులను చూసిన ఈ గ్రామయువకులు కొందరు, పట్టుదలతో మద్యంపై పోరుకు స్వీకారం చుట్టి మద్యనిషేధం అమలు చేశారు. పోలీసులు గూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా చేశారు. గురజాలకు చెందిన డా.చల్లగుండ్ల శ్రీనివాస్ తన ఫౌండేషన్ క్రింద చేయూతనిస్తున్నారు.
- కృష్ణా నదీతీరాన ఉండే ఈ తండాకు రెండేళ్ళ క్రిందటివరకూ రాకపోకలు సాగించేటందుకు సరైన బాట లేదు. తండావాసులలో అక్షరాస్యత గూడా అంతంతే. రెక్కడితేగానీ డొక్కడని పరిస్థితులు. ఇంతటి దయనీయమైన పరిస్తితులలో, ఈ తండాకు చెందిన 5గురు విద్యార్థులు, ప్రభుత్వ బడులలో విద్య నభ్యసించి, వసతి గృహాలలో భోజనం చేసి, ఆర్థిక ఇబ్బందులనధిగమించి, వైద్యవిద్యలో పట్టభద్రులైనారు.