అటునుండి నరుక్కు రా

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు 'అటు నుండి నరుక్కు రా' అంటే 'కాదు అటు నుండే రా' అని ఆయనను ప్రాధేయ పడ్డారు. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ. ఆ విధంగా ఈ సామెత పుట్టింది.[1]

మెకంజీ కైఫీయత్తుల ప్రకారం వేంకటాద్రి నాయుడు చంపించిన దోపిడీ దొంగల సంఖ్య 150. వెంకటాద్రినాయుడు వారిని భోజనానికి పిలిచి చంపివేసినట్టు ఉంది.[1] సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథలు పుస్తకంలో కూడా పై కథనం ఉంది.

Raja Venktadri Naidu. Patriot at Mangalagiri Temple main entrance
రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము. స్వంతి కృతి

ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "అట్నుంచి నరుక్కు రండి". m.andhrajyothy.com. Archived from the original on 2020-05-13. Retrieved 2020-05-13.

వెలుపలి లంకెలు

మార్చు