భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


అక్షర క్రమంలో పొడుపు కథలు

- - - - - - - - - - - - - అం - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - క్ష

తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు.

చాప చుట్టగ లేము.. రూక లెంచగ లేము | ఆకాశంలో నక్షత్రాలు

ఆలోచనా శక్తిని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టాలి. సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలనె కాకుంటే ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొదుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి. పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి.

పొడుపు కథలను తయారు చేయటం కష్టం కాదు. పొడుపు కథలో లయ, ప్రాస, రాగం, వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవటానికి అనువైన పద వాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు. చాలా సులభంగా ఉండకూడదు. కొద్ది సేపు ఆలోచించగానే అర్థమత్తేటట్లు ఉన్నప్పుడే ఆసక్తి కలుగుతుంది. మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు.

ఎలా తయారు చేయాలి

మార్చు

ముందుగా ఏ విషయం పై పొడుపు కథ తయారు చేయాలనుకుంటామో దాని గుణగణాల గురించి నాలుగు వాక్యాలు రాసుకోవాలి. ఆ వాక్యాలను లయ బద్దంగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి. ఒక వాక్యం లోనూ రెండు, మూడు వాక్యాలలోను ఉండవచ్చు. పేనా, చాక్లెట్, టీచర్, సైకిల్, సినిమా, రేడియో, టి.వి.టెలిఫోన్, ఇలాంటి వాటిపై పొడుపు కథలు పిల్లలలు సన్నిహితంగా ఉంటాయి.

ఉదాహరణ

మార్చు

"కలం" పై పొడుపు కథ తయారు చేయాలంటే, దాని లక్షణాలను ఈ క్రింది విధంగా రాసుకోవాలి.

  1. చిన్న కర్రపుల్లలా ఉంటుంది.
  2. లోన డొల్లగా ఉంటుంది.
  3. లోన రంగు ద్రవం ఉంటుంది.
  4. చివర నాలుక ఉంటుంది.
  5. కాగితంపై కదిలిస్తూ ఉంటె రాస్తుంది.
  6. కవులు ఉపయోగించేది . కత్తి కంటే గొప్పది.

పొడుపు కథగా మారిస్తె,

కాగితంపై కదులుతుంది - కార్చుకుంటూ వెళుతుంది.
నాలుకతో చెప్పడం - నాలుకతో రాయటం
కవి పట్టే కత్తి- కథలల్లె కత్తి - కలకాలం నిలిచేకత్తి.

అనేక రూపాలలో పొడుపు కథలు

మార్చు

1.కానిది

మార్చు

ఇందులో ఒకటి రెండు అక్షరాలు అదనంగా చేర్చితే చాలు మనకు కావలసిన జవాబు దొరుకుతుంది. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఎక్కువ పద పరిచయం ఏర్పడుతుంది. కొన్నింటికి రెండు మూడు జవాబులు కూడా ఉండవచ్చు.

కాయ గాని కాయ - మెడకాయ, తలకాయ (అదనంగా పదం చేర్చటం) - ఇలాంటివి తయారు చేయటం చాలా సులభం.
దారం కాని దారం - మందారం మొదలగునవి.

2.ఆధారాలు

మార్చు

కొన్ని ఆధారాలు యిచ్చి దాని ఆధారంగా పొడుపు కథ విప్పటం

తెలిసేటట్లు పూస్తుంది. తెలియకుండా కాస్తుంది? - వేరుశెనగ.

3.వర్ణన

మార్చు

చాలా వివరంగా వర్ణించి పొడుపు కథను విప్పమని చెప్పటం

నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా - ఏనుగు

4.కాదు(నిషేధం)

మార్చు

మొదటి వాక్యంలో ఆథారం ఉంటుంది. రెండవ వాక్యంలో నిషేధం ఉంటుంది.

ఆకాశంలో ఎగురుతుంది - పక్షి కాదు (విమానం)
నీటిలో వెళ్ళుతుంది - చేప కాదు (పడవ)

అక్షర క్రమంలో వివిధ పొడుపు కథలు

మార్చు

పైన సూచించిన పట్టికలో మనకు ఏ అక్షరంతో ప్రారంభమైన పొడుపు కథ కావాలో ఆ అక్షరాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్రారంభ అక్షరంతో పొడుపు కథలను సులువుగా చూడవచ్చు.

Adavilo seetamma muggu vestundi

మార్చు

అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?

మార్చు

జవాబు:సూర్యుడు.

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది

మార్చు

జవాబు: చల్లకవ్వం

అడవిన పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.

మార్చు

జవాబు:బొగ్గు

అడ్డం కోస్తే చక్రం - నిలువు కోస్తే శంఖం

మార్చు

జవాబు:ఉల్లిపాయ

అన్నదమ్ములం ముగ్గురం మేము
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము;
అయితే బుద్ధులు వేరు -
నీళ్ళలో
మునిగే వాడొకడు
తేలే వాడొకడు
కరిగే వాడొకడు
అయితే మేమెవరం? జవాబు:ఆకు, వక్క, సున్నం

అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు

మార్చు

జవాబు: పెదవులు

అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి

మార్చు

జవాబు: పెదవులు

అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ

మార్చు

జవాబు: తేనె పట్టు

అరచేతిలో కుంకుమ - గోటిమీద కుంకుమ - బీరాకు కుంకుమ - అందాల కుంకుమ

మార్చు

జవాబు: గోరింటాకు

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుం ది.

మార్చు

జవాబు:గంధపుచెక్క

అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?

మార్చు

జవాబు:గడప

అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు?

మార్చు

జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు. కవ్వము

అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు --jbnj నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాడొకడు: అయితే మే మెవరం?

మార్చు

జవాబు: ఆకు, వక్క, సున్నం.

అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది? (ఊయల) పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది? (చిలుక) ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ? (వాసన) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు? (కోడి గుడ్డు ) మూతి వేలెడు, తోక బారెడు? (సూది, దారం) ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ? (వెలగ పండ్లు) ఆకు బారెడు తోక మూరెడు ? (మొగలి పువ్వు) ఆకు చిటికెడు కాయ మూరెడు? (మునగ కాయ) చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు? (అద్దం) అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. (ప్రమిద) ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన (రామచిలుక) మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి) కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట) కన్నులు ఎర్రగా ఉంటాయి, రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది, భూతం కాదు చరచర పాకుతుంది పాముకాదు ( రైలు ) కత్తులు లేని భీకర యుద్ధం, గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం) కతకత కంగు, మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు) పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక) అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను (పిడక) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిలాగుంది. (గడప) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (చల్లకవ్వం) అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు) సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం) ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు? (గడియారం ముళ్ళు)

ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు

మార్చు

జవాబు:విమానం

ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు

మార్చు

జవాబు: టెంకాయ

ఆకాశమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.

మార్చు

జవాబు: గానుగ

ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.

మార్చు

జవాబు:కల్లు

ఆకాశంలో చెట్టు - చెట్టు నిండా పువ్వులు ఎంత కొట్టినా రాలవు

మార్చు

జవాబు: నక్షత్రాలు

ఆకులోడు కాదమ్మా ఆకులుంటాయి
బాలింత కాదమ్మా పాలుంటాయి
సన్యాసోడు కాడమ్మా జడలుంటాయి

మార్చు

జవాబు:మర్రి చెట్టు

ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.

మార్చు

జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర మీ అమ్మ పడుకుంటే మా అమ్మ దాటి పాయే జవాబు :-గడప

ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది

మార్చు

జవాబు: చీపురు

ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.

మార్చు

జవాబు: మంగళ సూత్రం

ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.

మార్చు

జవాబు: తామలపాకు.

ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.

మార్చు

జవాబు: తాటిపండు.

ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.

మార్చు

జవాబు: సైకిలు

ఇక్కడ ఉంటుంది - అక్కడ ఉంటుంది -పిలిస్తె పలుకుతుంది - మనలాగే మాట్లాడుతుంది

మార్చు

జవాబు:టెలిఫోన్

ఉద్యోగం సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే

మార్చు

జవాబు: కుక్క

మార్చు

ఉదయం నాలుగు కాళ్లతో నడిచేది,మధ్యాన్నం రెండు కాళ్ల తో నడిచేది,సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది.

మార్చు

జవాబు: పసితనం లో నాలుగు కాళ్ళు, పెద్దయ్యాక రెండు కాళ్ళు, వృద్ధా ప్యం లో మూడు కాళ్ళు

ఉడికిందొకటి,ఉడకందొకటి,కాలిందొకటి,కాలందొకటి, ఏమిటది ?

మార్చు

జవాబు: వక్క,ఆకు,సున్నం,పొగాకు

ఊరంతకీ ఒక్కటే దుప్పటి

మార్చు

జవాబు: ఆకాశం

ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?

మార్చు

జవాబు: చెప్పులు

ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.

మార్చు

జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.

ఎర్రని రాజ్యం,నల్లని సింహాసనం,ఒక రాజు ఎక్కితే,ఒక రాజు దిగుతాడు,ఏమిటది? జవాబు: మిరపచెట్టు.

Edu kondalu ekina maa thata tirigi venakaku vachesadu

ఐదుగురు భర్తలు ఉంటారు కానీ ద్రౌపది కాదు?

మార్చు

ఐదుగిరిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు

మార్చు

జవాబు: చిటికెన వేలు

ఐదుగురు, ఐదుగురు, దొంగలు రెండు జట్లు గా పోయి ఒక జీవాన్ని తెచ్చారు.వెంటనే చంపారు.

మార్చు

జవాబు: పేను

ఐదు తంత్రాలు గలది.పిల్లలకు మహాఇష్టమైనది

మార్చు

జవాబు: పంచతంత్రం

==ఒళ్లంతా ముల్లులు వాసన గుమగుమ

Oka

ఓహోహో హాలయ్య - వల్లంతా గరుకయ్యా - కరకర కోస్తె కడుపంతా తీపయ్యా!

మార్చు

జవాబు: పనస పండు.

అంగడిలో పెట్టి అమ్మేది కాదు, తక్కెడలో పెట్టి తూచేది కాదు, ఆలోచించటానికి ఆధారమైనది. అది లేకుండా మనిషేకాదు

మార్చు

జవాబు: మెదడు.

[1]అందమైన గోపురం - మధ్య దూలం - మంచి గాలి లోనికెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు

మార్చు

జవాబు: ముక్కు

అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే

మార్చు

జవాబు: ఆకాశంలో నక్షత్రాలు

కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?

మార్చు

విప్పితే:కనురెప్పలు

కొండ మీద బండరాయి - రాతి మీద లోతు బావి - బావిలోపల ఊరే జల - ఆడే పాము

మార్చు

జవాబు: తల - నోరు ఉమ్ము - నాలుక

కొండల్లో పుట్టి కోనల్లో నడిచి, సముద్రంలో చేరే నెరజాణ

మార్చు

జవాబు:నది

Gattu kalaanga battalu endestharu

గట్టు కాలంగా బట్టలు అందిస్తారు

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం

మార్చు

జవాబు: తేనెపట్టు

చిత్రమైన చీరకట్టి - షికారుకెళ్ళె చిన్నది - పూసిన వారింటికే గాని - కాసిన వారింటికి పోదు

మార్చు

జవాబు:సీతాకోక చిలుక

చుట్టింటికి మొత్తే లేదు

మార్చు

జవాబు: కోడి గుడ్డు

చూస్తే సురాలోకం - పడితే నీటికుండ - పగిలితే పచ్చ బంగారం

మార్చు

జవాబు:తాటిపండు

చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు

మార్చు

జవాబు: అద్దం

చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.

మార్చు

జవాబు: టెంకాయ .

చొట్టల చొట్టల కుండ - బోనాలకుండ - సీతమ్మ పేరు చెప్పి మెల్లంగా దించుకో

మార్చు

జవాబు: సీతాఫలం

జేబులో తాను ఉంటే ఎవరిని ఉండనివ్వద

డబ్బా నిండ ముత్యాలు. ఏమిటది ?

మార్చు

జవాబు: దానిమ్మ కాయ.

తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.

మార్చు

జవాబు: పనసకాయ

తిత్తిలో నుండి తీయగలమేమో గాని, పొయ్యలెము

మార్చు

జవాబు:పాలు

తెలిసేటట్లు పూస్తుంది - తెలియకుండ కాస్తుంది

మార్చు

జవాబు:వేరుశెనగ

తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి

మార్చు

జవాబు: జాబిలి

తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు

మార్చు

జవాబు:అక్షరాలు

తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది

మార్చు

జవాబు:ఉత్తరం

తోకలో నిప్పు పెడితే ఆకాశానికి ఎగురుతుంది - అక్కడ పగులుతుంది, కింద పడుతుంది

మార్చు

జవాబు:తారాజువ్వ

tel laga vuntadi kani guddu kadu gundranga vntadi kani banthi kadu kalustharu kani tinaru?

దేశదేశాలకు ఇద్దరే రాజులు

మార్చు

జవాబు: సూర్యుడు, చంద్రుడు

Neneppudu Mee mundhuntaanukani naa gurinchi meeru telusukorunannu chudaleru

మార్చు

నల్ల బండ క్రింద నలుగురు దొంగలు

మార్చు

జవాబు: బర్రె (గేదె, ఎనుము) క్రింది పొదుగులు

నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?

మార్చు

జవాబు:పాపిడి.

నాలుగు రోళ్ళు నడవంగా - రెండు చేటలు చెరగంగా - నోటినుండి పాము వ్రేలాడంగా - అందమైన దొరలు ఊరేగంగా

మార్చు

జవాబు: ఏనుగు

నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు

మార్చు

జవాబు : ఆకాశములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు

నీటి ఒరుగు - రాతి బురద

మార్చు

జవాబు:ఉప్పు-సున్నం

నా చెట్టుకు ఎన్నో ఆకులు, ఆకు ఆకుకి ఎన్నో మాటలు, ఆరగిస్తే డబ్బుల మూటలు జవాబు: నెమలికి కన్నీళ్లు వేస్తే ముద్ద అన్నట్లు

పాకని పాము పడగ విప్పదు ఆకుల నడుమ వేలాడుతోంది

మార్చు

పలుకుగాని పలుకు :
ఎమిటది?

మార్చు

జవాబు:వక్క పలుకు

పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు

మార్చు

జవాబు: పనసపండు

పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?

మార్చు

జవాబు: మొగలిపువ్వు

పచ్చపచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు

మార్చు

జవాబు: మిరప పండ్లు

పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా

మార్చు

జవాబు: దీపం

పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.

మార్చు

జవాబు: దూరవాణి

పిఠాపురం చిన్నవాడా, పిట్టలకు వేటగాడా,బతికిన పిట్టను కొట్టా వద్దు,
చచ్చిన పిట్టను తేనూ వద్దు, కూరకు లేకుండా రానూ వద్దు

మార్చు

జవాబు:పక్షి గుడ్డు

పిల్లికి ముందు రెండు పిల్లులు - పిల్లికి వెనుక రెండు పిల్లులు - పిల్లికీ పిల్లికీ మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు?

మార్చు

జవాబు:మూడు

పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?

మార్చు

జవాబు:తన నీడ

ప్రవహిస్తుంది కాని నీరుకాదు, పట్టుకుంటె ప్రాణం పోతుంది

మార్చు

జవాబు:కరెంటు

పుట్టగానే పెరుగుతుంది కొమ్మలు రెమ్మలు చిమ్ముతుంది పూలల్లాగా మెరుస్తుంది

మార్చు

జవాబు : చిచ్చు బుడ్డీ (దీపావళి మతాబు)

బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.

మార్చు

జవాబు: దానిమ్మపండు.

భూమిలో పుట్టింది - భూమిలో పెరిగింది - రంగేసుకొచ్చింది రామచిలుక

మార్చు

జవాబు: ఉల్లిగడ

ముందుగా పలకరిస్తుంది మళ్ళీ తిడుతుంది తర్వాత మర్యాదగా అంటుంది

మార్చు

జవాబు: చందమామ!

మాట్లాడుతుంది కానీ మనిషి కాదు

మార్చు

జవాబు: రేడియో

మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?

మార్చు

జవాబు:తాటి ముంజ

మూడు కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు

మార్చు

జవాబు: కొబ్బరి కాయ.

మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు
చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !

మార్చు

జవాబు: నాగలిదున్నే రైతు

ముక్కుతో చూడగలం - కంటితో చూడలేము

మార్చు

జవాబు:వాసన

మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.

మార్చు

జవాబు:తుపాకి/తూట

మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.

మార్చు

జవాబు:చెప్పులు

రాతి శరీరం - మధ్యలో నోరు - తిరుగుతూ ఉంటుంది. తింటూ కక్కుతుంది

మార్చు

జవాబు: తిరగలి

రెక్కలు ముయ్యని పక్షి - రెప్పలు ముయ్యని జాణ

మార్చు

జవాబు: తూనీగ, చేప

యంత్రం కాని యంత్రం-కాదిది మంత్రం

మార్చు

జవాబు: సాయంత్రం

యర్రని రాజ్యం, నల్లని సింహాసనం,ఒక రాజు ఎక్కితే ఒకరాజు దిగుతాడు

మార్చు

జవాబు: అట్లు (దోసెలు)

మార్చు

యాదగిరి నా పేరు గుట్ట ను మాత్రం కాను,ఒక ముఖ్యమంత్రి నా మీద ప్రయానించే వాడు కాని కారు ను కాదు.మరినేనెవరిని ?

మార్చు

జవాబు: హెలికాప్టర్

లోకమంతటికి ఒకటే పందిరి-ఒకటే అరుగు

మార్చు

జవాబు: ఆకాశము-భూమి

లక్కబుడ్డి నిండా  లక్షల వరహాలు తినేవారే గాని,దాచి పెట్టుకొనేవారు లేరు.

మార్చు

జవాబు: దానిమ్మ కాయ

లక్ష్మి దేవి పుట్టకముందు ఆకు లేని పంట పండింది.ఇప్పటికీ ప్రతి ఇంట ఉంది.

మార్చు

జవాబు: ఉప్పు

వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు

మార్చు

జవాబు: పొలం గట్టు

వందమంది అన్నదమ్ములు - కట్టి పడేస్తే - కావలసినప్పుడు కదులుతారు - దుమ్ము ధూళీ దులుపుతారు

మార్చు

జవాబు : చీపురు కట్ట

వానొస్తే పడగ విప్పు - ఎండ వస్తే పడగ విప్పు - గాలి వేస్తే గడ గడ వణుకు

మార్చు

జవాబు: గొడుగు

వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !

మార్చు

జవాబు : గాలిపటం

శంకు లో పెంకు,పెంకు లో తీర్థం,తీర్థం లో మొగ్గ

మార్చు

జవాబు: టెంకాయ

శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప

మార్చు

జవాబు: పార

శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు

మార్చు

జవాబు: వేరుశనక్కాయ

మార్చు

శెల లో శెల్వరాజు, పట్నాన పచ్చ రాయి, పేలూరు తెల్ల రాయి, నెల్లూరు నల్ల రాయి, నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు,తొక్కగ కారింది రక్తం

మార్చు

జవాబు: తాంబూలం

సూది వెళ్ళింది చుక్కలాంటిది పొడుపు కథ జవాబు ఏంటి


హంస ముక్కు కీ ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది

మార్చు

జవాబు: ప్రమిద

హడవిడిగా తిరిగే రంగయ్య -అమ్దరి ఇండ్లు నీవేనయ్యా

మార్చు

జవాబు: కుక్క

హద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు

మార్చు

జవాబు: అబద్దం

హస్త ఆరు పాళ్ళు చిత్త మూడు పాళ్ళు

మార్చు

జవాబు: వర్షం

హుస్సేన్ సాబ్ ఉరకాలంటాడు ఖాదర్ సాబ్ కాదంటాడు

మార్చు

జవాబు: ఎనుముపగ్గం

హనుమంతరావు గారి పెండ్లాం గుణవమ్తురాలు.తెట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుకొన్నది.

మార్చు

జవాబు: జొన్నకంకి

మూలాలు

మార్చు
  1. నాగరాజు, బైరి. జాబిలి దిగి వచ్చిన వేళా. వరంగల్: నాగరాజు (బీ ఏన్ ఆర్). pp. singer.