అద్దిస్ అబాబా

(అడీస్ అబాబా నుండి దారిమార్పు చెందింది)

అద్దిస్ అబాబా ఇథియోపియా దేశ రాజధాని. దీన్ని ఫిన్‌ఫిన్నె అని కూడా పిలుస్తారు.[2] 2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551.[3]

అడీస్ అబాబా
አዲስ አበባ
Nickname(s): 
సిటీ ఆఫ్ హ్యూమన్స్, అదీసబా, షెగెర్, ఫిన్‌ఫిన్నె, అదు, అదు జెనెట్
దేశము Ethiopia
Chartered Cityఅడీస్ అబాబా
Chartered1886
Government
 • మేయరుకుమా దేమేక్ష
విస్తీర్ణం
 • రాజధాని527 కి.మీ2 (203 చ. మై)
 • Land527 కి.మీ2 (203 చ. మై)
 [1]
Elevation
2,355 మీ (7,726 అ.)
జనాభా
 (2008)
 • రాజధాని33,84,569
 • జనసాంద్రత5,165.1/కి.మీ2 (13,378/చ. మై.)
 • Urban
33,84,569
 • Metro
45,67,857
Time zoneUTC+3 (తూర్పు ఆఫ్రికా కాలము)
ప్రాంతపు కోడ్(+251) 11
Websitehttp://www.addisababacity.gov.et/

ఈ నగరం ఒరోమొయా రాష్ట్రానికి కూడా రాజధాని.[4] ఆఫ్రికా యూనియన్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది. దానికి ముందర ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఆప్రికన్ యూనిటీ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉండేది. ఐరాస వారి ఆఫ్రికా ఆర్థిక కమిషను ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అనేక ఇతర అంతర్జాతీయ, ఖండాతర్గత కార్యాలయాలు కూడా అద్దిస్ అబాబాలో ఉన్నాయి. దీని వల్ల అద్దిస్ అబాబాను ఆఫ్రికా రాజకీయ రాజధానిగా భావిస్తారు.[5] తూర్పు ఆఫ్రికా చీలిక నుండి పశ్చిమాన కొద్ది కిలోమీటర్ల దూరం లోనే నగరం ఉంది. ఈ చీలిక ఇథియోపియాను రెండుగా చీలుస్తోంది.[6]

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అద్దిస్ అబాబాలో నివాసముంటున్నారు. అద్దిస్ అబాబా విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది.

ఆర్థికం

మార్చు

అద్దిస్ అబాబాలో వైవిధ్యమైన ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 1,19,197 మంది వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. 113,977 మంది తయారీ, పరిశ్రమల రంగంలో, 80,391 మంది గృహ కార్యాలలో, 71,186 మంది పౌర పాలనలో, 50,538 iమంది రవాణా కమ్యూనికేషన్ల రంగంలో, 42,514 విద్యా, వైద్య రంగాల్లో, 32,685 iమంది హోటళ్ళ రంగంలోను, 16,602 మంది వ్యవసాయం లోనూ నిమగ్నమై ఉన్నారు. కొందరు పశువుల పెంపకం, తోటల పెంపకం లోనూ కూడా ఉన్నారు. 677 హెక్టార్లలో సాగుబడి ఉంది. ఏటా 12,998 టన్నుల దిగుబడి ఉంది. It is a relatively clean and safe city, with the most common crimes being pickpocketing, scams and minor burglary.[7] ఇటీవలి కాలంలో నగరంలో నిర్మాణ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వివిధ విలాస సౌకర్యాలు కూడా నగరంలో విరివిగా అందుబాటులో ఉన్నాయి. అద్దిస్ అబాబాను ఆఫ్రికా స్పా రాజధానిగా భావిస్తారు.[8]

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం అద్దిస్ అబాబాలోనే ఉంది.[9]

జనాభా వివరాలు

మార్చు

Languages of Addis Ababa as of 2007 Census[10]

  Oromo (10.7%)
  Gurage (8.37%)
  Tigrinya (3.60%)
  Silt'e (1.82%)
  Gamo (1.03%)
  Other (3.48%)

2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551. దేశ రాజధాని కావడం చేత ఇక్కడ వివిధ జాతుల తెగల ప్రజలు నివసిస్తూంటారు. వీరిలో అధికులు అంహారా (47.0%), ఒరోమో (19.5%), గురగే (16.3%), టిగ్రయాన్ (6.18%), సియైట్ (2.94%), గామో (1.68%) జాతులకు చెందిన ప్రజలు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలు అమ్హారీ (71.0%), అఫాన్ అరోమో (10.7%), గురగే (8.37%), టిగ్రిన్యా (3.60%), సియైట్ (1.82%) గామో (1.03%). ఇథియోపియన్ ఆర్థడాక్స్ మతావలంబికులు 74.7% ఉండగా 16.2% మంది ముస్లిములు, 7.77% ప్రొటెస్టంట్లు, 0.48% కాథలిక్కులూ ఉన్నారు.[11]





సూచికలు

మార్చు
  1. "2011 National Statistics". Archived from the original on 2013-03-30. Retrieved 2013-07-11.
  2. "Addis Ababa | national capital, Ethiopia". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2019-02-09.
  3. "Census 2007 Tables: Addis Abeba" Archived 14 నవంబరు 2010 at the Wayback Machine, Tables 2.1, 2.5, 3.1, 3.2 and 3.4. For Silt'e, the statistics of reported Shitagne speakers were used, on the assumption that this was a typographical error.
  4. "Oromia Regional State". Ethiopia. Archived from the original on 2017-07-28. Retrieved 2020-06-02.
  5. "United Nations Economic Commission for Africa". UNECA. Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 5 మే 2012.
  6. Gizaw, Berhanu. "The origin of high bicarbonate and fluoride concentrations in waters of the Main Ethiopian Rift Valley, East African Rift system." Journal of African Earth Sciences 22.4 (1996): 391–402.
  7. Overseas Security Advisory Council – Ethiopia 2007 Crime and Safety Report.
  8. Massages and manicures hit Addis Ababa Archived 15 జూన్ 2006 at the Wayback Machine by Tia Goldenberg. Retrieved 15 January 2010. IOL. 6 November 2007.
  9. "Company Profile Archived 5 అక్టోబరు 2012 at the Wayback Machine." Ethiopian Airlines. Retrieved on 3 October 2009.
  10. Central Statistical Agency. 2010. Population and Housing Census 2007 Report, National. [ONLINE] Available at: http://catalog.ihsn.org/index.php/catalog/3583/download/50086 Archived 4 మార్చి 2016 at the Wayback Machine. [Accessed 13 December 2016].
  11. "Census 2007 Tables: Addis Abeba" Archived 14 నవంబరు 2010 at the Wayback Machine, Tables 2.1, 2.5, 3.1, 3.2 and 3.4. For Silt'e, the statistics of reported Shitagne speakers were used, on the assumption that this was a typographical error.