ఇథియోపియన్ ఎయిర్ లైన్స్

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ (ఇ.ఎ.ఎల్.) ను గతంలో ఇథియోపియాన్ అని సంక్షిప్తంగా పిలిచేవారు. ఇది ఇథియోపియా‍‍ దేశ ప్రభుత్వానికి పూర్తిగా సొంతమైన ప్రధాన విమాన సంస్థ.[1] 1945 డిసెంబరు 21లో ఇది స్థాపించబడిగా, 1946 ఏప్రిల్ 8 నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1951 నుంచి అంతర్జాతీయంగా విమాన సేవలు విస్తరించారు. 1965లో ఇది వాటా కంపెనీగా మారిన తర్వాత ఇథియోపియన్ ఎయిర్ లైన్ గా పేరు మార్చారు. ఇది అంతర్జాతీయ ఎయిర్ రవాణా అసోసియేషన్ లో 1959 నుంచి, ఆప్రికన్ ఎయిర్ లైన్ అసోసియేషన్ (ఎ.ఎఫ్.ఆర్.ఎ.ఎ.) లో 1968 నుంచి సభ్యత్వం కలిగి ఉంది.[2] డిసెంబరు 2011 లో స్టార్ అలయెన్స్ లో ఇథియోపియాన్ సభ్యత్వం పొందింది.

చరిత్ర మార్చు

 
1974లో లాలిబెలా విమానాశ్రయం వద్ద ఇథియోపియా ఎయిర్ లైన్స్ డగ్లస్ DC-3

1940 తొలినాళ్లలో లిబరేషన్ ఆఫ్ ఇథియోపియాకు చక్రవర్తిగా ఉన్న హాయిలే సెలస్సీ ఐ తమ దేశాన్ని ఆధునీకరించడంలో భాగంగా ఈ సంస్థను స్థాపించాలని భావించారు. 1945లో ఇథియోపియన్ ప్రభుత్వం ట్రాన్స్ కాంటినెంటల్ విమాన రవాణా, వెస్ట్రన్ ఎయిర్ ఎక్స్ ప్రెస్ సంస్థలు రెండింటితో చర్చలు జరిపింది (ఆ తర్వాత ఇది టి.డబ్ల్యు.ఎ.గా విలీనమైంది). 1945 సెప్టెంబరు 8న అప్పటి ఇథియోపియా విదేశీ వ్యవహారాల సలహాదారు, అమెరికాకు చెందిన ప్రముఖ చరిత్ర కారుడైన జాన్ హెచ్.స్పెన్సర్స్ తో టి.డబ్ల్యు.ఎ. ఒక ఒప్పందం కుదుర్చుకుని ఇథియోపియాలో వ్యాపారపరమైన వైమానిక సంస్థను ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేసింది.[3] ఈ సంస్థ ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ (ఇ.ఎ.ఎల్.) అనే అసలు పేరుతో 1945 డిసెంబరు 21లో ఆవిర్భవించింది.[4] ఆ తర్వాత సంస్థలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. లుఫ్తాన్సా ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్టార్ అలయన్స్ లో ఈ విమాన సంస్థ 2011 డిసెంబరులో చేరింది. ఎయిర్ లైన్స్ ప్రస్తుత ప్రధాన కార్యాలయం బోల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అడ్డిస్ అబ్బాలో ఉంది.[5]

 
2006లో దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 767-200ER

గమ్యాలు మార్చు

ప్రధాన వ్యాసం: ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ గమ్యాలు సెప్టెంబరు 2014 నాటికి 83 అంతర్జాతీయ, 20 దేశీయ గమ్యాలకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానాలు నడిస్తున్నాయి. వీటిలో ఇథియోపియాతో పాటు ఆఫ్రికాలోని 49, యూరప్ లోని 13, అమెరికా, మధ్య తూర్పు ఆసియాలోని 21 నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. కార్గో నెట్ వర్క్ ద్వారా ఆఫ్రికా, మధ్య తూర్పు ఆసియా, యూరప్ దేశాల్లోని మొత్తం 24 నగరాల గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.[5]

విమానాలు మార్చు

జూన్ 2015 నాటికి[update] ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ నడిపిస్తున్న విమానాల వివరాలు:[6] ఎయిర్ బస్ ఎ350-900, బోయింగ్ 737–700, బోయింగ్ 737–800, బోయింగ్ 737 మ్యాక్స్ 8, బోయింగ్ 757–200, బోయింగ్ 767-300ఇఆర్, బోయింగ్ 777-200ఎల్.ఆర్., బోయింగ్ 777-300ఇ.ఆర్., బోయింగ్ 787–8, బాంబార్డియర్ డాష్ 8 క్యూ400. కార్గో విమానాలు: బోయింగ్ 757-200పిసిఎఫ్, బోయింగ్ 777ఎఫ్, మెక్ డొనెల్ డగ్లస్, ఎం.డి.11ఎఫ్

సేవలు మార్చు

క్లౌడ్ నైన్, సాధారణ తరగతి అనే రెండు రకాల సేవలు ఈ ఎయిర్ లైన్స్ విమానాల్లో అందుబాటులో ఉంటాయి. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ యొక్క వ్యాపార తరగతి ప్రయాణికులకు క్లౌడ్ నైన్ పేరుతో సేవలందిస్తోంది. ఈ తరగతిలో ప్రయాణించేవారికి విస్తృత ఆన్ బోర్డు సదుపాయాలు, వినోదం, విజ్ఞానం కోసం పుస్తకాలు అందిస్తోంది. బోయింగ్ 777-200ఎల్.ఆర్. విమానంలో నిద్రపోయేందుకు అనువైన సీట్లు, ఆన్ డిమాండ్ ఆడియో, విడియో సేవలు కల్పిస్తోంది. 85 ఛానళ్లతో కూడిన 15.4 అంగుళాల ఐ.ఎఫ్.ఇ. స్క్రీన్లు ఉంటాయి.సాధారణ (ఎకానమి) తరగతి ప్రయాణికులకు వివిధ రకాల భోజనాలు, తేలికపాటి స్నాక్స్ విమాన రకాన్ని బట్టి అందుబాటులో ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, ఆన్ డిమాండ్ ఆడియో, వీడియో సౌకర్యం, 80 ఛానళ్లతో కూడిన 8.9 అంగులాల స్ర్కీన్లు బోయింగ్ 777-200ఎల్.ఆర్.లో ఉంటాయి.[7]

ప్రమాదాలు-సంఘటనలు మార్చు

ప్రధాన వ్యాసం: ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ప్రమాదాలు, సంఘటనలు వైమానిక రక్షణ నెట్ వర్క్ అందించిన సమాచారం ప్రకారం ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో 1965 నుంచి 60 ప్రమాదాలు /సంఘటనలు జరిగినట్లు రికార్డులున్నాయి. ఇవి గాక మరో ఆరు గతంలో ఉన్న పాత ఇథియోపియాన్ ఎయిర్ లైన్స్ పేరిట నమోదయ్యాయి. జనవరి 2013 నాటికి ఈ సంస్థకు చెందిన వివిధ విమానాల ప్రమాదాల్లో దాదాపు 337 మంది చనిపోయారు. ఈ సంస్థ విమానాలు పలుమార్లు హైజాకింగ్ గురయ్యాయి.[8]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Ethiopian Airlines 2015 outlook: more rapid expansion as it becomes Africa's largest airline". CAPA Centre for Aviation. Retrieved 2015-07-23.
  2. "AFRAA Current Members – Ethiopian Airlines". African Airlines Association. Archived from the original on 2014-12-19. Retrieved 2015-07-23.
  3. Ofcansky, David H. Shinn, Thomas P.; David H. Shinn (2004). Historical Dictionary of Ethiopia (New ed.). Lanham: Rowman & Littlefield Pub. Group.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  4. "Ethiopian Airlines Established 1945". cleartrip.com. Archived from the original on 2015-02-16. Retrieved 2015-07-23.
  5. 5.0 5.1 "Company Profile". Ethiopian Airlines. Archived from the original on 2012-10-05. Retrieved 2015-07-23.
  6. "Ethiopian Airlines Current Fleet". Ethiopian Airlines. Archived from the original on 2019-03-31. Retrieved 2015-07-23.
  7. "Ethiopian – On Our 777-200LR". Ethiopian Airlines. Archived from the original on 2015-04-24. Retrieved 2015-07-23.
  8. "Accident record for Ethiopian Air Lines". Aviation Safety Network. 28 November 2004. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 2015-07-23.