అణ్వాయుధాలను ప్రయోగించడానికి మూడు రకాల పద్ధతు లున్నాయి. బాంబరు విమానాల ద్వారా, ఖండాంతర క్షిపణుల ద్వారా, జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల ద్వారా. ఈ మూడు రకాల ప్రయోగ వ్యవస్థలను (డెలివరీ సిస్టమ్స్) ను కలిపి అణుత్రయం (న్యూక్లియర్ ట్రయడ్) అంటారు. ఈ మూడు రకాల ప్రయోగ సామర్థ్యం కలిగి ఉన్న దేశంపై శత్రు దేశం తొలి దాడి చేసినా, మొత్తం అన్ని క్షిపణులనూ తొలిదాడి లోనే ధ్వంసం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శత్రు దేశంపై అణు ఎదురు దాడి (సెకండ్ స్ట్రైక్) చేసే అవకాశం ఈ దేశానికి ఉంటుంది. తద్వారా దేశం యొక్క అణ్వస్త్ర నిరోధక శక్తి (న్యూక్లియర్ డిటర్రెన్స్) పెరుగుతుంది.[1][2][3]

అణుత్రయంలో భాగాలు
బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
బాలిస్టిక్ మిసైల్ సబ్ మెరైన్

సాంప్రదాయిక భాగాలు మార్చు

సమర్థవంతమైన అణ్వస్త్ర నిరోధానికి అణుత్రయం ఉత్తమమైనదని తెలిసినప్పటికీ, పూర్తిస్థాయి అణుత్రయాన్ని నెలకొల్పి నిర్వహించడానికి అవసరమైన సైనిక బడ్జెట్టు చాలా అణ్వస్త్ర దేశాలకు లేదు. అణుయుగంలో చాలాకాలంపాటు అమెరికా రష్యాలు మాత్రమే అణుత్రయాన్ని నెలకొల్పుకోగలిగాయి.[3] ఆ రెండు దేశాల అణుత్రయం ఒకే ధోరణిలో ఉండేవి. దానిలో కింది భాగాలున్నాయి:

  1. అణు బాంబులు మోసుకుపోగలిగిన బాంబరు విమానాలు. ఇవి విమాన వాహక నౌకల నుండి గానీ, నేలపైనుండి గానీ ఎగురుతాయి. దూర పరిధి క్షిపణులు వీటికి అమర్చబడి ఉంటాయి.[1]
  2. నేలపైనుండి ప్రయోగించే క్షిపణులు (మధ్య పరిధి లేదా ఖండాంతర పరిధి).[1][3]
  3. బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు (SSBNs). ఓడలు లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించే అణ్వాయుధ క్షిపణులు.[1][3]

సరైన దాడి కోసం సరైన ఆయుధాన్ని వాడే వీలు కల్పించడమే కాకుండా, శత్రువు దాడి చేసినపుడు కొన్ని ఆయుధాలను పరిరక్షించుకుని ఎదురుదాడి చేసే అవకాశం ఈ అణుత్రయం వలన కలుగుతుంది:

  • ఖండాంతర క్షిపణుల ద్వారా లక్ష్యం నుండి దూరంగా, సురక్షిత స్థలం నుండి, దాడి చెయ్యవచ్చు.[4] వాటిని ప్రయోగించాక, వాటిని ఎదుర్కొనడం అంత తేలిక కాదు. కానీ వాటిని సైలోల వంటి స్థిర స్థానాల నుండి ప్రయోగించేట్లైతే, వాటిమీద తొలి దాడి చెయ్యడం శత్రువుకు తేలిక.[5][3] తక్కువ పరిధి క్షిపణులపై కూడా అణ్వాయుధాలను మోహరించి, శత్రు దేశాల సరిహద్దులకు దగ్గరలో ఉన్న దేశాల్లో మోహరించారు. అయితే అమెరికా రష్యాల ఆయుధాల నియంత్రణ ఒప్పందాల్లో భాగంగా ఇలా మోహరించడాన్ని నిషేధించారు.
  • జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులకు తొలిదాడి నుండి తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత వీటిని అణు ఎదురు దాడికి వాడుకోవచ్చు.[3][5] మొదట్లో జలాంతర్గామి నుండి ప్రయోగించే దూర పరిధి క్రూయిజ్ క్షిపణులను అణుత్రయంలో భాగంగా పరిగణించారు. బాలిస్టిక్ క్షిపణులు అందుబాటులోకి వచ్చాక వాటి స్థానంలోకి ప్రవేశించాయి. 
  • బాంబరు విమానాలు తొలిదాడి, ఎదురుదాడి రెంటికీ ఉపయోగపడతాయి. సురక్షిత స్థానాల్లో ఉంచిన బాంబర్లు, గాల్లోనే ఇంధనం విమానాలూ మొదలైన వాటిని కలిపి ఎదురుదాడి దళంఘా పరిగణించవచ్చు.[3][5] గాల్లోనే ఇంధనం నింపే విమానాల దళం ఖండాంతర వ్యూహాత్మక ఆపరేషన్లకు కూడా ఉపయోగపదతాయి; వీటి సహాయంతో బాంబర్లు రోజంతా గాల్లోనే ఎగురుతూ ఉంటాయి. వీటిని తొలి దాడిలో నిర్మూలించడం దాదాపు అసాధ్యం. ఇలా గాల్లోనే ఉంటూ పహారా కాస్తూండడం చాలా ఖర్చుతో కూడుకున్నది.[4]

అణుత్రయ శక్తులు మార్చు

కింది దేశాలను పూర్తి స్థాయి అణుత్రయ శక్తులుగా చెప్పవచ్చు. మూడు అంచెల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అణు ఎదురుదాడి చెయ్యగల సామర్థ్యం వీటికి ఉంది. తమ వాయు సేనను, నౌకా సేననూ నిఘా కోసం పంపించనూ గలవు.

అమెరికా మార్చు

రష్యా మార్చు

చైనా మార్చు

1964 నుండి చైనా అణు సామర్థ్యం కలిగిన దేశం. అమెరికా రష్యాల అణ్వాయుధాల ఒప్పందాల్లో భాగంగా వాటి అణ్వాయుధాల లెక్క తెలుస్తుంది కానీ చైనా విషయంలో ఆ నిబంధనలేమీ లేవు. ఆ దేశాల స్థాయిలో కాకున్నా, చైనాకు అణుత్రయం ఉంది. చైనా అణ్వాయుధ సంపత్తి ఫ్రాన్స్, ఇంగ్లాండులతో సమాన స్థాయిలో ఉంటుంది. ప్రధాన్ంగా ఇవి భూమిపై నుండి ప్రయోగించే ఖండాంతర, మధ్యంతర పరిధి క్షిపణులు, క్రూయిజ్ క్షిపణుల  రూపంలో ఉంది. చైనా ఈ క్షిపణులను భారీ సొరంగ  నిర్మాణాల్లో దాచి  ఉంచింది. ఈ సొరంగాలు 5,000 కిమీ పైబడి  పొడవుంటాయి. వీటిలో అణ్వాయుధాలను, బలగాలను తరలించడానికి వాడుతారు అని మైకెల్ టర్నర్ అనే అమెరికా రిప్రజెంటేటివ్ చెప్పాడు[6][7] చైనా సైన్యపు న్యూస్‌లెటర్ ఈ సొరంగాల వ్యవస్థను అండర్‌గ్రౌండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా వర్ణించింది.[8]

ప్రస్తుతం చైనా వద్ద టైప్ 092 జలాంతర్గామి ఒకటి ఉంది. దానిలో JL-1 జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి ఉంది. దాంతోపాటు 4 కొత్త టైప్ 094 జలాంతర్గాములు కూడా ఉన్నాయి. 2020 నాటికి ఇలాంటి మరో ఎనిమిదింటిని మోహరించనున్నారు. ఈ జలాంతర్గాములు JL-2 క్షిపణులను వాడుతాయి.

చైనా వద్ద Xian H-6 బాంబరు విమానాలు ఉన్నాయి. వీటితో పాటు మార్పులు చెసిన కొన్ని H-6 విమానాలనే ఇంధన విమానాలుగా కూడా వాడుతున్నారు. రష్యాకు చెందిన ఇల్యూషిన్ Il-78 ఇంధన విమాన ట్యాంకర్లు కూడా రానున్నాయి. కొత్తగా చేర్చిన H-6K విమానాల్లో దూర పరిధి క్రూయిజ్ క్షిపణి CJ-10 లు ఉన్నాయి. H-6 బాంబర్లతో పాటు, J-16, J-10, JH-7A and Su-30 వంటి అనేక వ్యూహాత్మక ఫైటర్లు, బాంబర్లూ కూడా చైనా వద్ద ఉన్నాయి.

భారతదేశం మార్చు

INS అరిహంత్‌తో భారత్ కూడా అణుత్రయాన్ని సాధించింది. 2016 ఆగస్టులో INS అరిహంత్‌ను భారత నౌకాదళంలో కమిషను చేసారు.[9] INS అరిహంత్ 750 కిమీ పరిధి గల సాగరిక క్షిపణులు 12  గానీ,  3500 కిమీ పరిధి గల 4 కె-4 క్షిపణులు నాలుగింటిని గానీ మోహరించగలదు. భారత్ అణు-మొదటి-దాడి చెయ్యను (నో-ఫస్ట్-యూస్) అనే విధానాన్ని అవలంబిస్తున్నది కాబట్టి, ఒక సమర్ధమైన అణ్వస్త్ర నిరోధక విధానంలో భాగంగా ఈ అణుత్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. భారత అణు కార్యక్రమంలో భూమి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు (అగ్ని2, అగ్ని-3) ఉన్నాయి. వీటికి తోడు, 5,000–8000 కిమీ పరిధి గల అగ్ని-5 ఖండాంతర క్షిపణి కూడా ఉంది. 2015 జనవరి 31 న దీన్ని మూడవసారి విజయవంతంగా పరీక్షించారు  ఇది 2016 లో సైనిక బలగాల్లో చేరనుంది. భారత్ వద్ద మిరాజ్ 2000H, సుఖోయ్ Su-30 MKI, మిగ్-29 SEPECAT జాగ్వార్ వంటి అణ్వాయుధాలు మోసుకుపోగలిగే  యుద్ధ విమానాలు ఉన్నాయి. భూతలం నుండి, గాలిలోనుండి దాడి చేయగలిగే పై వనరులు ఈసరికే వ్యూహాత్మక బలగాల కమాండ్  నియంత్రణలో ఉన్నాయి.ఈ కమాండ్  అణు నియంత్రణ అథారిటీలో భాగంగా ఉంది.

అంకురిస్తున్న అణుత్రయ శక్తులు మార్చు

మూడు వ్యవస్థల్లోనూ ఒకటి లేదా రెండిట్లో పరిమిత స్థాయి అణు సామర్థ్యం కలిగి ఉంటే దాన్ని ఆంకురిస్తున్న శక్తి అనవచ్చు. ఈ శక్తులకు ప్రయోగాత్మక దశలో ఉన్న వాహనాలు ఉండవచ్చు, కానీ అణ్వస్త్ర నిరోధక నిఘాకు ఇంకా సిద్ధంగా ఉండి ఉండదు.

మాజీ అణుత్రయ శక్తులు మార్చు

ఫ్రాన్స్ మార్చు

ఫ్రాన్స్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, డసాల్ట్ రఫేల్ విమానాలు అణ్వాయుధాలతో మోహరించి ఉన్నాయి. భూమిపై నుండి అణ్వాయుధాలు ప్రయోగించగల మంధ్యంతర పరిధి క్షిపనులు కూడా ఉండేవి. అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక, వీటిని తొలగించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ వద్ద భూమిపైనుండి ప్రయోగించే అణ్వాయుధాలు లేవు.

అణుత్రయం లేని అణ్వస్త్ర దేశాలు మార్చు

అణ్వస్త్ర దేశాలయ్యుండీ, అణుత్రయం లేని దేశాల జాబితా ఇది.

యునైటెడ్ కింగ్‌డమ్ మార్చు

ప్రస్తుతం చైనా వద్ద టైప్ 092 జలాంతర్గామి ఒకటి ఉంది. దానిలో JL-1 జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి ఉంది. దాంతోపాటు 4 కొత్త టైప్ 094 జలాంతర్గాములు కూడా ఉన్నాయి. 2020 నాటికి ఇలాంటి మరో ఎనిమిదింటిని మోహరించనున్నారు. ఈ జలాంతర్గాములు JL-2 క్షిపణులను వాడుతాయి.

చైనా వద్ద Xian H-6 బాంబరు విమానాలు ఉన్నాయి. వీటితో పాటు మార్పులు చెసిన కొన్ని H-6 విమానాలనే ఇంధన విమానాలుగా కూడా వాడుతున్నారు. రష్యాకు చెందిన ఇల్యూషిన్ Il-78 ఇంధన విమాన ట్యాంకర్లు కూడా రానున్నాయి. కొత్తగా చేర్చిన H-6K విమానాల్లో దూర పరిధి క్రూయిజ్ క్షిపణి CJ-10 లు ఉన్నాయి. H-6 బాంబర్లతో పాటు, J-16, J-10, JH-7A and Su-30 వంటి అనేక వ్యూహాత్మక ఫైటర్లు, బాంబర్లూ కూడా చైనా వద్ద ఉన్నాయి.

పాకిస్తాన్ మార్చు

పాకిస్తాన్ అణ్వాయుధాలు ముఖ్యంగా భూమిపై నుండి ప్రయోగించేవే. పాకిస్తాన్ అణు కార్యక్రమం కనీస అణ్వస్త్ర నిరోధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంపై ఆధారపడి ఉంది.[10] కానీ పూర్తి స్థాయి యుద్ధంలో, అణ్వాయుధ ప్రయోగ డాక్ట్రిన్‌లో చెప్పిన నిబంధనలను అతిక్రమించిన సందర్భంలో అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది.[11] కార్నెగీ ఎండోమెంట్స్ కు చెందిన ఇస్కందర్ రెహ్‌మాన్ చెప్పాడు "..పాకిస్తాన్ తన నౌకా దళంలోకి అణ్వాయుధాలను మోహరించే సమయం ఎంతో దూరంలో లేదు"[12]

పాకిస్తాన్ వద్ద ఉన్న షహీన్-1ఎ (900 కిమీ పరిధి), షహీన్-2 (2000 కిమీ పరిధి) క్షిపణులు అణ్వాయుధాలను మోసుకుపోగలవు.[13] 

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వద్ద రెండు స్క్వాడ్రన్ల (No. 16 బ్లాక్ పాంథర్స్No. 26 బ్లాక్ స్పైడర్స్) అణ్వాయుధాలను మోసుకుపోగలిగే JF-17 థండర్ విమానాలున్నాయి.[14] 2012 లో పొందిన 18 F-16 ఫైటర్ విమానాలు కూడా అణ్వస్త్రాలను మోసుకుపోగలవు.[15] గాల్లోంచి ప్రయోగించే అణ్వాయుధ యుత రాద్ క్రూయిజ్ క్షిపణులు కూడా పాకిస్తాన్ వద్ద ఉన్నాయి.[16]

ఉత్తర కొరియా మార్చు

2006 లో భారీ భూగర్భ విస్ఫోటనాన్ని గుర్తించిన తరువాత ఉత్తర కొరియా తమ వద్ద స్వదేశీ అణ్వాయుధ పరిజ్ఞానం ఉందని చెప్పింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సత్తా కలిగిన విమానాలుక్షిపణులు బహుశా ఆ దేశం వద్ద ఉన్నాయి. వారి క్షిపణి కార్యక్రమం చాలావరసోవియట్లు సరఫరా చేసిన స్కడ్ క్షిపణి మీదే ఆధారపడి ఉంది. వాటిలో కొన్ని ఉపగ్రహ ప్రయోగాలకు కూడా సరిపోయే శక్తి గలవి. పాశ్చాత్య పరిశోధకుల  ప్రకారం ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలు ప్రస్తుతం వారి వద్ద ఉన్న క్షిపణులలో ఇముడ్చ లేనంత పెద్దవి.[17]

అనుమానిత అణుత్రయ దేశాలు మార్చు

ఇజ్రాయిల్ వద్ద 1960 ల నాటికే విమానాల నుండి అణ్వాయుద్ఝాలను ప్రయోగించగల సామర్థ్యం ఉంది. క్షిపణి చాలిత వ్యవస్థ 1960 ల మధ్యనాళ్లకే ఉంది. 2000 నాటికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఉంది.[18] డాల్ఫిన్ తరగతి జలాంతర్గాముల ద్వారా ప్రయోగించే పొపెయే క్షిపణుల రూపంలో అణుత్రయ సామర్థ్యం చేకూరినట్లుగా భావిస్తున్నారు.

ఇతర అణ్వాయుధ ప్రయోగ వ్యవస్థలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Barry, John (12 December 2009). "Do We Still Need a Nuclear 'Triad'?". Newsweek. Retrieved 8 October 2010.
  2. Office for the Deputy Assistant to the Secretary of Defense for Nuclear Matters. "Nuclear Stockpile". US Department of Defense. Archived from the original on 28 జూన్ 2012. Retrieved 8 October 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "Toning Up the Nuclear Triad" Archived 2013-08-22 at the Wayback Machine.
  4. 4.0 4.1 "Time to Modernize and Revitalize the Nuclear Triad".
  5. 5.0 5.1 5.2 Barry, John (12 December 2009).
  6. "U.S. Lawmaker Warns of China's Nuclear Strategy".
  7. http://www.straitstimes.com/BreakingNews/Asia/Story/STIStory_723617.html
  8. "China Builds Underground 'Great Wall' Against Nuke Attack" Archived 2020-02-16 at the Wayback Machine.
  9. "Now, Indian has a nuclear triad".
  10. Farah Zahra, PhD (Political Science) (12 August 2011). "Credible minimum nuclear deterrence". Daily Times. Retrieved 19 July 2012. The nuclear arms race in South Asia is not purely a quantitative matter; it encompasses a qualitative dimension where the nuclear weapons and delivery systems on both sides are improving in quality as well ... Dr. Farah Zahra
  11. IISS. "Nuclear policy, doctrine and planning Rationales for nuclear weapons". International Institute for Strategic Studies. Archived from the original on 28 జూన్ 2012. Retrieved 19 July 2012.
  12. "Nuclear profusion".
  13. "Design Characteristics of Pakistan's Ballistic Missiles" Archived 2012-06-29 at the Wayback Machine.
  14. "Associated Press Of Pakistan ( Pakistan's Premier NEWS Agency ) - First Squadron of JF-17 Thunder inducted in PAF" Archived 2015-12-22 at the Wayback Machine. http://www.app.com.pk.
  15. "Boosting air defence: F-16s replace Americans at Jacobabad airbase".
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-06-11. Retrieved 2016-10-19.
  17. Postol, Theodore (6 May 2009). "A Technical Assessment of Iran's Ballistic Missile Program" (PDF). Institute of Technology. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 19 అక్టోబరు 2016.
  18. "Missile Survey: Ballistic and Cruise Missiles of Foreign Countries" (PDF). Archived from the original (PDF) on 2019-04-21. Retrieved 2016-10-19.
"https://te.wikipedia.org/w/index.php?title=అణుత్రయం&oldid=4168915" నుండి వెలికితీశారు