అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? ఇక ఆమె ఏం చేసిన గొప్పే! అత్త లేని ఇంట మంచి పేరు తెచ్చుకోవడం కోడలికి బహు సులువు. అదే విదంగా కోడలిని ఆరళ్ళు పెట్టని అత్తలూ అరుదే. కోడలు కాపురానికి రానంతవరకూ అత్తలందరూ గుణవంతులే.. కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదు. అత్తలేని కోడల్ని, కోడలులేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్ళబుచ్చుతూ ఈ సామెతని వాడతారు.

Ghantasala's statue
ఘంటసాల వెంకటేశ్వరరావు

ఒక జానపద గేయం ఈ సామెతతో మొదలవుతుంది. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది. ఘంటసాల గానం చేసిన రికార్డు బాగా జనాదరణ పొందింది.

ఆహూ ఊహూ ... అత్త లేని కోడలుత్తమురాలు ఓయమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఓయమ్మా.. ఆహూ ఊహూ..
కోడాల కోడాల కొడుకు పెళ్ళామా
పచ్చిపాలమీద మీగడేమాయె కోడలా
వేడిపాలమీద వెన్న ఏమాయే కోడలా
అత్తమ్మ ఊరకే ఆరళ్ళు గానీ
పచ్చిపాలమీద మీగడుంటుందా
వేడిపాలమీద వెన్న ఉంటుందా
ఉట్టీ మీదున్న సున్నుండలేమాయె కోడలా
ఇంటికి పెద్దయిన గండుపిల్లుండగా
ఇంకెవరు వస్తారె అత్తమ్మా

గయ్యాళి అత్త పాత్ర తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ, ప్రత్యేకించి జానపద సాహిత్యంలో అతి సాధారణం.