అదితి గుప్తా (రచయిత్రి)
అదితి గుప్తా (Aditi Gupta) మెన్ స్ట్రాపీడియా సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ పార్టనర్. ఆమె భర్త తుహిన్ పాల్ ఇద్దరూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్వ విద్యార్థులు, వారు 2012 లో మెన్స్ట్రుపీడియా కామిక్ ను సహ-స్థాపించారు. 2014లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ జాబితాలో చోటు దక్కించుకుంది[1].
అదితి గుప్తా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | గర్హ్వా, జార్ఖండ్, భారతదేశం |
వృత్తి | మెన్స్ట్రుపీడియా కామిక్ రచయిత్రి,సహ వ్యవస్థాపకురాలు |
జాతీయత | భారతదేశం |
పూర్వవిద్యార్థి | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ |
రచనా రంగం | మెన్స్ట్రుపీడియా కామిక్ |
జీవిత భాగస్వామి | తుహిన్ పాల్ |
జీవితం
మార్చుఅదితి గుప్తా. జార్ఖండ్ రాష్ట్రము లోని గర్హ్వాలో జన్మించింది. అహ్మదాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి న్యూ మీడియా డిజైన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందిన అదితి గుప్తా భర్త తుహిన్ పాల్ కూడా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో చదివాడు.అక్కడ వారిద్దరూ కలిసి అనేక ప్రాజెక్టులలో పనిచేయడం జరిగింది. చదువుకున్న వారిలో కూడా రుతుస్రావం గురించి ఎలాంటి అవగాహన లేకపోవడాన్ని వారు గమనించి, ఆమెను ఏడాది పాటు ఈ అంశంపై పరిశోధన చేయడానికి ప్రేరేపించింది. ఈ పరిశోధనలో డాక్టర్లు, అమ్మాయిల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ముగ్గురు యువతులు, ఒక డాక్టర్ ప్రధాన పాత్రలుగా కామిక్ పుస్తకం ప్రారంభించాలనే ఆలోచన రావడం జరిగింది[2].
ప్రేరణ
మార్చుఅదితి "రుతుస్రావం" అనే అంశంపై పరిశోధన చేయడానికి ప్రేరేపించబడింది. ఎలాంటి అవగాహన లేని ఆమెకు 12 సంవత్సరాల వయస్సులో మొదటి పీరియడ్ రావడం,ఆమె 9 వ తరగతిలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల వయస్సులో దాని గురించి చెప్పడం,ఆమె రుతుక్రమం వచ్చినప్పుడు, ఒక ప్రత్యేక గదిలో పడుకోవాల్సి ఉండేది, ఇతరుల మంచంపై కూర్చోవడానికి అనుమతించక పోవడం, వంటగదిలోకి లేదా ఆలయంలోకి ప్రవేశించడానికి, ఇంటిలో ఉండే ప్రార్థనా స్థలాన్ని తాకడానికి కూడా అనుమతించలేదు. తన బట్టలను విడిగా ఉతుక్కోవడానికి,ఆరబెట్టడానికి,మార్కెట్లో లభించే శానిటరీ న్యాప్కిన్లను ఉపయోగించడానికి వీలులేదు. ఎందుకంటే వాటిని కొనడం తన కుటుంబ గౌరవానికి ప్రమాదంగా పరిగణించబడింది, ఈ అంశాన్ని అధ్యయనం చేసి మన సమాజంలోని ఇలాంటి నిషేధాలను వదిలించుకోవడం, మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె భావించి, తన 15 ఏళ్ల వయసులో తొలి శానిటరీ న్యాప్కిన్ కొనుక్కుంది. డాక్టర్లు, అమ్మాయిల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ముగ్గురు యువతులు, ఒక డాక్టర్ ప్రధాన పాత్రధారులు,కామిక్ పుస్తకాన్ని ప్రారంభించారు. నవంబరు 2012 లో, అదితి, ఆమె భర్త, పాల్ ఈ విషయం గురించి మరింత జ్ఞానం, అవగాహనను వ్యాప్తి చేయడానికి మెన్స్ట్రుపీడియాను ప్రారంభించారు. ఈ అంతర్జాలం (వెబ్సైట్) ఇప్పుడు ప్రీ-టీనేజ్, టీనేజర్లకు, యుక్తవయస్సు,లైంగికత గురించి సమాచారాన్ని అందించే వేదికగా మారింది. తరతరాలుగా కొనసాగుతున్న నిషేధాలు, అపోహలను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతున్నది. ఈ వెబ్ సైట్ లో వివిధ కామిక్ పుస్తకాలు, బ్లాగులు, ప్రశ్నోత్తరాల విభాగం, ఒక అభ్యాస విభాగం కూడా ఉన్నాయి. ఈ కామిక్స్ 14 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి అంశాలపై పలు ప్రచారాలకు కూడా మెన్ స్ట్రాపియా నేతృత్వం వహిస్తున్నది[3].
దేశ -విదేశాలలో
మార్చు2012 నవంబరు లో అదితి గుప్తా తన భర్తతో కలిసి మెన్ స్ట్రాపియాను ప్రారంభించింది. ఆ పుస్తకాలను వెబ్ సైట్ లో కూడా ఉంచారు. వీటిలో రుతుస్రావం, పరిశుభ్రత, యుక్తవయస్సు గురించి సమాచారాన్ని అందించడం, తద్వారా వాటికి సంబంధించిన అన్ని అపోహలను విచ్ఛిన్నం చేస్తుంది. సున్నితమైన అంశాన్ని సులభంగా, అర్థమయ్యేలా తెలపడమే( ప్రజెంట్) చేయడమే ఈ కామిక్ ముఖ్య ఉద్దేశం. భారతదేశ వ్యాప్తంగా 30కి పైగా పాఠశాలల్లో అవగాహన కల్పించడంలో ఈ కామిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కామిక్స్ ప్రస్తుతం పద్నాలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి, 18 దేశాలలో ఉపయోగిస్తున్నారు. మెహసానా, గాంధీనగర్, అహ్మదాబాద్, రాంచీలోని పాఠశాలల్లో ఆమె కామిక్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ చొరవను అక్కడ చాలా మంది యువతుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రశంసలు పొందింది. అదితి గుప్తా ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా వారి సమస్యల గురించి మాట్లాడేలా ప్రేరేపించింది. అదితి గుప్తా తన కామిక్ మెన్ స్ట్రాపీడియా ద్వారా యువతులందరికీ నిజమైన గురువు అని నిరూపించుకుంది. ఈ కామిక్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను మెరుగుపరచడమే కాదు. ఒక అమ్మాయి తన రుతుస్రావం రోజులలో సాధారణంగా ఎదుర్కొనే అన్ని నిషేధాలు, అడ్డంకులను తొలగించింది. ఎన్నో విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా వినూత్న స్టార్టప్ సమయంలో తనకు బలమైన మూలస్తంభంలా ఉన్న భర్తతో కలిసి ఆమె . పారిశ్రామికవేత్తగా విజయం సాధించింది[4] .
మూలాలు
మార్చు- ↑ "Aditi Gupta gets successful in breaking the ice against Menstruation in Indian as well as Foreign homes through her venture - Menstrupedia". MediCircle (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "INTRODUCING ADITI GUPTA- Co-Founder & Managing Director, Menstrupedia". https://yourstory.com/. 02 December 2023. Retrieved 02 December 2023.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help); External link in
(help)|website=
- ↑ Codingest. "Co-Founder Of Menstrupedia- Aditi Gupta (Indian Woman Entrepreneur)". VTVINDIA (in ఇంగ్లీష్). Archived from the original on 2023-12-02. Retrieved 2023-12-02.
- ↑ "Inspirational Career Story-Aditi Gupta". https://www.careerguide.com/. 02 December 2023. Retrieved 02 December 2023.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help); External link in
(help)[permanent dead link]|website=