గాంధీనగర్

గుజరాత్ రాష్ట్ర రాజధాని

గాంధీనగర్, భారతదేశం లోని గుజరాత్ రాష్ట్ర రాజధాని. గాంధీనగర్, అహ్మదాబాద్‌కు ఉత్తరాన సుమారుగా 23 కి.మీ.దూరంలో ఉంది.భారతరాజకీయ రాజధాని ఢిల్లీ, భారతదేశ ఆర్థికరాజధాని ముంబై పారిశ్రామికప్రాంతనడవ పశ్చిమమధ్య బిందువుపై ఉంది. గాంధీనగర్ సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉంది.ఇది దాదాపు ముంబైకి ఉత్తరాన 545 కిమీ (338 మైళ్ళు),ఢిల్లీకి నైరుతిదిశలో 901 కిమీ (560 మైళ్ళు) దూరంలో ఉంది.[5] గాంధీనగర్‌లో అక్షరధామ్ ఆలయం ఉంది.[6] గాంధీనగర్‌నుపూర్తిగాభారతీయ సంస్థగా మార్చాలనే సంకల్పంభారత ప్రభుత్వానికి ఉంది.దీనికి కారణం,ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం.ఈ కారణంగా చండీగఢ్‌లోని లే కార్బూసియర్‌లో శిష్యరికం చేసిన ప్రకాష్ ఎమ్ ఆప్టే, హెచ్‌కె మేవాడా అనేఇద్దరు భారతీయ పట్టణ రూపకర్తలు దాని ప్రణాళికను తయారు చేసారు [7]

గాంధీనగర్
గుజరాత్ రాష్ట్ర రాజధాని
సవ్యదిశలో, పై నుండి: అక్షరధామ్ ఆలయం, గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేషన్ అవలోకనం, గుజరాత్ సైన్స్ సిటీ, మహాత్మా మందిర్
Official logo of గాంధీనగర్
గాంధీనగర్ is located in Gujarat
గాంధీనగర్
గాంధీనగర్
గుజరాత్ లో స్థానం
గాంధీనగర్ is located in India
గాంధీనగర్
గాంధీనగర్
గాంధీనగర్ (India)
Coordinates: 23°13′23″N 72°39′00″E / 23.223°N 72.650°E / 23.223; 72.650
దేశం భారతదేశం
రాష్ట్రంగుజరాత్
జిల్లాగాంధీనగర్ జిల్లా
Named forమహాత్మా గాంధీ
Government
 • Typeమేయర్ కౌన్సిల్
 • Bodyగాంధీనగర్ మున్సిపల్ కార్పోరేషన్
 • మున్సిపల్ కమిషనర్రతన్‌కన్వర్ హెచ్. గాధావిచరన్
 • మేయర్రితా పటేల్
Area
 • Total326 km2 (126 sq mi)
Elevation
81 మీ (266 అ.)
Population
 (2011)[2]
 • Total2,92,167
 • Density900/km2 (2,300/sq mi)
భాషలు
 • Officialగుజరాతీ, హిందీ, and ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పోస్టల్ కోడ్
382010[3]
టెలిఫోన్ కోడ్079[4]
Vehicle registrationGJ-18

చరిత్ర మార్చు

కార్నెల్ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యావంతుడు,ప్రధాన వాస్తుశిల్పి ఎచ్.కె. మేవాడా, అతని సహాయకుడు ప్రకాష్ ఎం. ఆప్టే ఈ నగర ప్రణాళికను రూపుదిద్దారు.[8][9][10]

భౌగోళిక శాస్త్రం మార్చు

 
ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్క్

గాంధీనగర్ సగటు ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 81 metres (266 feet) ఎత్తులో ఉంది. నగరం, ఉత్తర-మధ్య-తూర్పు గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున ఉంది. గాంధీనగర్ చుట్టూ ఉన్న 20,543 చ.కి.మీ. ప్రాంతం గుజరాత్ రాజధానిభూభాగంగా నిర్వచించబడింది.గాంధీనగర్ మొత్తం 326 చ.కి.మీ (126 చ.మై) విస్తీర్ణంలో విస్తరించి ఉఁది. వేసవిలో సబర్మతి నదితరచుగాఎండిపోతుంది. చిన్న నీటి ప్రవాహాన్ని మాత్రమే వదిలివేస్తుంది.గాంధీనగర్ దానిభూభాగంలో 54% పచ్చదనంతో ఉండి,భారతదేశపు చెట్ల రాజధానిగాగర్తింపుపొందింది.[11]

పాలన, రాజకీయాలు మార్చు

మతాల ప్రకారం నగర జనాభా (2011)
మతం శాతం
హిందూ
  
94.46%
ఇస్లాం
  
3.29%
ఇతరులు
  
2.25%

1960 మే 1న, పూర్వపు బొంబాయి రాష్ట్రంలోని 17 ఉత్తర జిల్లాలతో గుజరాత్ ఏర్పడింది. ఈ జిల్లాలు తరువాత ఉపవిభజన చేయబడ్డాయి. 2023 నాటికి రాష్ట్రంలో 33 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి.గుజరాత్ రాష్ట్రానికి రాజకీయ గాంధీనగర్ కేంద్రంగా ఉంది.[12][13]

2011లో జరిగిన మొదటి పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.[14] మహేంద్రసింగ్ రాణా నగరానికి మొదటి మేయర్‌గా నియమితులయ్యాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి అమిత్ షా గాంధీనగర్ ప్రస్తుత లోక్ సభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.[15]

గాంధీనగర్ భారత సైనికదళ,భారత వైమానికి దళాల పశ్చిమ కమాండ్ పోస్ట్ సమీపంలో ఉంది. నగరంలో కూడా కమాండ్ కేంద్రం ఉంది.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్ లోని రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఇటీవల అభివృద్ధి చేసింది.

రవాణా మార్చు

గాలి మార్చు

అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం గాంధీనగర్ నుండి 18 కిమీ దూరంలో ఉంది.ఇది దాని ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ సేవలు అందిస్తుంది.

రైలు మార్చు

గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ (జి.ఎన్.సి) సెక్టార్ 14లో ఉంది. పశ్చిమ మండలాల్లో నడిచే అనేక రైళ్లు గాంధీనగర్ మీదుగా వెళ్ళతాయి. ప్రస్తుతం, ఈ స్టేషన్ నుండి ఐదు రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో మూడు సత్వర ప్రయాణ రైళ్లు, రెండు మెము రైళ్లు. జైపూర్-బాంద్రా గరీబ్ రథ్, ఢిల్లీకి హరిద్వార్ మెయిల్, హరిద్వార్, ఇండోర్ జంక్షన్ బిజి కోసం శాంతి ఎక్స్‌ప్రెస్ ఈ స్టేషన్ ద్వారా నడుస్తున్న ప్రధాన సత్వర ప్రయాణ రైళ్లు.

కలుపూర్‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ (ఎడిఐ) అహ్మదాబాద్ సమీపంలోని రైలు జంక్షన్ (25 కిమీ దూరంలో) ఉంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు పట్టణాలతో అనుసంధాన సౌకర్యం అందిస్తుంది. కలోల్ జంక్షన్ రైల్వే స్టేషన్ (కె.ఎల్.ఎల్) నుండి ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశంలో ప్రయాణించడానికి భారతీయ రైల్వే రవాణాలు అందుబాటులో ఉన్నాయి.

మెట్రో మార్చు

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ II కింద, గాంధీనగర్‌ను అహ్మదాబాద్‌తో కలుపుతూ మొత్తం 22.8 కి.మీ పొడవైన నెట్‌వర్క్‌ పని జరుగుతుంది. అహ్మదాబాద్ మెట్రో ఉత్తర - పశ్చిమ లైన్ మోటేరా స్టేషన్ నుండి మహాత్మా మందిర్ స్టేషన్ వరకు పొడిగించబడుతోంది. జి.ఎన్.ఎల్.యు. స్టేషన్‌ని జి.ఐ.ఎఫ్.టి సిటీ స్టేషన్‌కు బ్రాంచ్ లైను కలుపబడుతుంది.[16]

మూలాలు మార్చు

 1. "Municipal Expansions". The Times of India.
 2. "Gujarat (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
 3. "PIN Code: Gandhinagar, Gujarat, India". findpincode.net.
 4. "Change in Ahmedabad, Gandhinagar phone numbers - Times of India". The Times of India. Retrieved 2018-03-03.
 5. "National Informatics Centre". gandhinagar.nic.in. National Informatic. Retrieved 25 March 2020.
 6. "SBI IFSC Code: Gandhinagar, Gujarat, India". Sbiifsccode.co.in. Archived from the original on 2016-08-18. Retrieved 2023-06-24.
 7. "Gandhinagar Endangered: A Capital's Plan Dismantled". planetizen.com. planetizen.com. Retrieved 25 March 2020.
 8. New development plan will kill G’nagar, warns original planner.
 9. Architecture, Low Cost Housing, Regional Planning, Urban Development, Town Planner, Housing, India, Prakash, Madhusudan, Apte, Eisenhover, Gandhinagar, Urban Planning, Urban Growth Archived 27 ఏప్రిల్ 2011 at the Wayback Machine.
 10. The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012
 11. "With 54% green cover, Gandhinagar India's tree capital". The Times of India. Archived from the original on 2013-04-26.
 12. "Gujarat State profile". Zee News (in ఇంగ్లీష్). 2012-12-11. Retrieved 2020-08-18.
 13. "India - Gujarat". webcache.googleusercontent.com. Retrieved 2020-08-18.
 14. "Congress wins maiden Gandhinagar civic poll – The Times of India". The Times of India. Archived from the original on 2013-04-11.
 15. "Seventeenth Lok Sabha Members Bioprofile". Lok Sabha House of the People. Parliament of India. Retrieved 1 December 2019.
 16. "Ten firms bid for last section of Phase-2 of Ahmedabad Metro". The Indian Express (in ఇంగ్లీష్). 2022-05-15. Retrieved 2022-06-11.

వెలుపలి లంకెలు మార్చు

Gandhinagar గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి